Home / Reviews / కృష్ణగాడి వీరప్రేమగాథ రివ్యూ & రేటింగ్.

కృష్ణగాడి వీరప్రేమగాథ రివ్యూ & రేటింగ్.

Author:

Krishnagadi Veera Prema Gadha Movie Perfect Review and Rating

‘భలే భలే మొగడివోయ్’ చిత్ర ఘన విజయం తర్వాత నాని హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘కృష్ణగాడి వీరప్రేమగాథ’. 14రీల్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ చిత్రానికి ‘అందాల రాక్షసి’ ఫేమ్ హను రాఘవాపుడి దర్శకత్వం వహిస్తుండగా నానికి జోడిగా మెహ్రిన్ హీరోయిన్ గా వెండితెరకి పరిచయమవుతుంది. విశాల్ చంద్రశేఖర్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం భారీ అంచనాలతో ప్రపంచవ్యాప్తంగా ఫిబ్రవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా కథ విషయానికొస్తే..

కథ :

ఫ్యాక్షన్ నేపథ్యం ఉన్న అనంతపురం జిల్లా హిందూపురంలో కథ మొదలవుతోంది. ఆ ప్రాంతాన్ని తన కనుసైగలతో శాసించే ఫ్యాక్షన్ లీడర్ రాజన్న(మహదేవన్), అతని కుడిభుజం రామరాజు(రామకృష్ణ). రామరాజు చెల్లెలు మహాలక్ష్మీ(మెహరీన్). అదే ఊళ్లో బోర్ వెల్స్ వేస్తూ ఉంటాడు కృష్ణగాడు(నాని). చిన్నప్పుడు స్కూల్ లో చదువుకునే రోజుల్లోనే మహాలక్ష్మీ ప్రేమ గెలుచుకున్న కృష్ణ, ఆ విషయం ఆమె అన్న రామరాజుకు చెప్పలేక పదిహేనేళ్లుగా ఆ విషయాన్ని నానుస్తుంటాడు. మహాలక్ష్మీ తనకు ఇంట్లో వాళ్లు పెళ్లి చేయకుండా ఉండటం కోసం కావాలనే డిగ్రీ ఫెయిల్ అవుతూ ఉంటుంది. అదే సమయంలో పండగ సెలవులకు రాజన్న తమ్ముడు(సంపత్ రాజ్) పిల్లలు రాజన్న దగ్గరకు వస్తారు. వాళ్లంతా ఇంట్లో ఉన్న సమయంలో రాజన్న మీద ఎటాక్ జరుగుతోంది. ఆ ఎటాక్ నుంచి పిల్లలను తప్పించిన రామరాజు, వాళ్లను హైదరాబాద్ లోని రాజన్న తమ్ముడు(సంపత్ రాజ్)కి అప్పగించమని కృష్ణకు చెప్తాడు. అలా చేస్తే తన చెల్లెలిని ఇచ్చి పెళ్లి చేస్తానని మాట ఇస్తాడు. తన ప్రేమ కోసం పిల్లలను హైదరాబాద్ తీసుకెళ్లడానికి అంగీకరించిన నాని ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడు. అసలు రాజన్న మీద దాడి చేసింది ఎవరు..? కృష్ణగాడి ప్రేమకథకు దుబాయ్ డాన్ డేవిడ్ భాయ్ కి సంబంధం ఏంటి..? చివరకు కృష్ణగాడు తన ప్రేమను ఎలా గెలిపించుకున్నాడు అన్నదే మిగతా కథ.

అలజడి విశ్లేషణ:

భలే భలే మొగడివోయ్ చిత్రం తర్వాత మళ్ళీ ఆ స్థాయిలో నాని తన సహజ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. పిరికివాడిలా, ప్రేమికుడిలా తన అద్భుత నటనతో సినిమాకి ప్లస్ అయ్యాడు. హీరోయిన్ గా తన తొలి చిత్రంలోనే మెహరిన్ తన అభినయంతో ప్రేక్షకులను అలరించింది. ఫ్యాక్షనిజం నేపథ్యంలో ఇంతకుముందు చాలా సినిమాలు వచ్చాయి కాని ఆ సినిమాలు అన్ని సీరియస్ గా సాగుతున్న సినిమాలు మనం చూశాము.. ఆ తర్వాత అవే ఫ్య్క్షనిజం కామెడీ బాట పట్టాయి. హను రాఘవపూడి సీరియస్ కథలోనే పిరికివాడైన హీరో పాత్ర ద్వారా వినోదం పండించాడు. ‘కృష్ణగాడి వీర ప్రేమ గాథ’లో కథకు లింకులు కలిపి ఒక చోటికి తెచ్చే క్రమంలో కొంత గందరగోళం సినిమాను కొంచెం కిందికి తీసుకెళ్లింది. సినిమాలో వచ్చే పాటలు సినిమాకి పెద్ద మైనస్ అని చెప్పాలి. నాని హీరోగా ‘భలే భలే మొగడివోయ్’.., హను రాఘవాపుడి దర్శకత్వంలో వచ్చిన ‘అందాల రాక్షసి’ వంటి సూపర్ హిట్ ఆల్బమ్ ల తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో ఆడియో అద్భుతంగా ఉంటుందని ఊహించిన అభిమానులకు కొంత నిరాశే మిగిలింది. ఫస్ట్ ఆఫ్ లో కొన్ని సన్నివేశాలు కామీడితో సాగిన సెకాండ్ అప్ స్లో నేరేష్ తో కాస్త బోర్ గా ఫీల్ అయ్యేలా చేస్తాయి. ఇక సెకండాఫ్ లో సాంగ్స్ వచ్చే సాంగ్స్ మాత్రం ప్రేక్షకులకు కాస్త చిరాకు తెప్పిస్తాయి. దర్శకుడు హను రాఘవపూడి చాలా విషయాలు చెప్పే క్రమంలో కథనాన్ని అక్కడక్కడా పక్కదారి పట్టించిన ఫీలింగ్ కలుగుతుంది. ముఖ్యంగా ద్వితీయార్ధంలో ఈ గందరగోళం ఎక్కువైంది. ఇక క్లైమాక్స్ లో వచ్చే ఎమోషనల్ సన్నివేశాల్లో నాని నాటన్ సూపర్బ్ అని చెప్పాలి. ఇక 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వి, సత్యం రాజేష్ ల కామెడీ సినిమాకి మంచి ప్లస్ అయింది. మహదేవన్, రామకృష్ణలు తమ పాత్రకి న్యాయం చేసారు. రన్ రాజా రన్ చిత్రం తర్వాత సంపత్ రాజ్ మరోసారి పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఆకట్టుకున్నాడు. ఇక విలన్ గా డేవిడ్ భాయ్ పాత్రలో నటించిన మురళి శర్మ నటనతో మెప్పించాడు. .

సాంకేతిక వర్గం పనితీరు:

హను రాఘవపూడి తన మొదటి చిత్రం ఒక లవ్ స్టొరీ చేసిన ఈ సినిమాతో ఎమోషనల్ డ్రామా, యాక్షన్ ను కూడా అదే స్థాయిలో తెరకేక్కించగలనని నిరూపించుకున్నాడు. ఫస్ట్ ఆఫ్ లో ఒక అందమైన ప్రేమకథను చూపించిన దర్శకుడు సెకండాఫ్ ను మాత్రం అడ్వంచరస్ ట్రావెల్ డ్రామాగా తెరకెక్కించాడు.విశాల్ చంద్రశేఖర్ సంగీతం రిఫ్రెషింగ్ గా అనిపిస్తుంది. నువ్వంటే నా ప్రాణం పాట వెంటాడుతుంది. ఈ ట్యూన్ బ్యాగ్రౌండ్ స్కోర్ లోనూ బాగా వాడుకున్నాడు.. యువరాజ్ ఛాయాగ్రహణం సినిమాలోని మరో హైలైట్. సినిమా అంతటా ఒక వైబ్రంట్ లుక్ ఉండేలా కెమెరా పనితనం చూపించాడు. 14 రీల్స్ వాళ్ల స్థాయికి తగ్గట్లే నిర్మాణ విలువలు ఉన్నాయి.

ప్లస్ పాయింట్స్:

  • నాని నటన
  •  కామెడీ
  •  ఎడిటింగ్
  •  సినిమాటోగ్రఫి
  • ఫస్ట్ హాఫ్

మైనస్ పాయింట్స్:

  • పాటలు
  • సెకండాఫ్ లో కొన్ని సన్నివేశాలు స్లో నేరేషన్
  • అక్కడక్కడ లాజిక్స్ మిస్ అయ్యాయి

అలజడి రేటింగ్: 3.25/5

                                                 పంచ్ లైన్: ప్రేమతో వీరత్వం చూపిన కృష్ణగాడు.

(Visited 1,762 times, 1 visits today)