Home / Entertainment / ‘కృష్ణాష్టమి’ ఫిబ్రవరి 5వ తేదీన ఈ సినిమాని గ్రాండ్ గా రిలీజ్.

‘కృష్ణాష్టమి’ ఫిబ్రవరి 5వ తేదీన ఈ సినిమాని గ్రాండ్ గా రిలీజ్.

Author:

Krishastami Movie Release Date

కమెడియన్ నుంచి హీరోగా ప్రమోషన్ కొట్టేసిన కామెడీ కింగ్ సునీల్ హీరోగా నటించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘కృష్ణాష్టమి’. సునీల్ సరసన నిక్కీ గార్లాని, డింపుల్ చోపడే హీరోయిన్స్ గా నటించారు. నిర్మాత దిల్ రాజు ఈ సినిమాని చాలా రోజుల క్రితమే పూర్తీ చేసి, అన్ని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ని కూడా ఫినిష్ చేసి, పర్ఫెక్ట్ టైంకి రిలీజ్ చేయాలని ఇన్ని రోజులు ఆగారు. సంక్రాంతి తర్వాత రిలీజ్ కి ఎలాంటి ఇబ్బందులు లేకపోవడం వలన ఈ చిత్ర టీం శనివారం సాయంత్రం ఆడియోని రిలీజ్ చేసింది. ఈ ఆడియో రిలీజ్ అయిన ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ కూడా వస్తోంది.

దాంతో ఈ చిత్ర టీం రిలీజ్ కి డేట్ ని కూడా ఫిక్స్ చేసారు. దిల్ రాజు చెప్పిన సమాచారం ప్రకారం ఫిబ్రవరి 5వ తేదీన ఈ సినిమాని గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు. ఒక ఎన్నారై కథతో రానున్న ఈ సినిమాకి జోష్ ఫేం వాసు వర్మ డైరెక్టర్. ఫ్యామిలీ కథా చిత్రానికి యాక్షన్ అంశాలను కూడా మిక్స్ చేసి చేసిన ఈ సినిమాలో. దాదాపు రెండేళ్ళ గ్యాప్ తర్వాత వస్తున్న ఈ సినిమా సక్సెస్ పై సునీల్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు.

(Visited 113 times, 1 visits today)