Home / Entertainment / సూపర్బ్ ప్రీ రిలీజ్ బిజినెస్ గా నాని వీర ప్రేమకథ.

సూపర్బ్ ప్రీ రిలీజ్ బిజినెస్ గా నాని వీర ప్రేమకథ.

Author:

Krishna Gaadi Veera Prema Gadha Movie Teaser

కొందరు డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యాను అంటారు కానీ నాని డైరెక్టెర్ కాబోయి హీరో అయ్యాడు. శ్రీను వైట్ల మరియు బాపు వద్ద సహాయ దర్శకుడిగా పని చేసాడు. అష్టా చమ్మా అనే సినిమా ద్వారా తెలుగు తెర పై కనువిందు చేసి ఒక స్థానాన్ని సంపాదించాడు. ఈగ తర్వాత మనోది ఫేట్ మారిపోయింది. తర్వాత కొన్ని ఫ్లాప్స్ వచ్చిన మళ్ళీ ‘భలే భలే మగాడివోయ్’ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చి తన సత్త చాటుకున్నాడు. ఇప్పుడు నాని నుంచి వస్తున్న సినిమా ‘క్రిష్ణగాడి వీర ప్రేమగాథ’. ఈ సినిమా ద్వారా హీరోయిన్ గా మెహరీన్ పరిచయం కానుంది. ఈ సినిమాకి అందాల రాక్షసి ఫేం హను రాఘవపూడి డైరెక్టర్ గా బిగ్ ప్రొడక్షన్ హౌస్ అయిన 14 రీల్స్ వారు నిర్మిస్తున్నరు.

ఇదిలా ఉంటే భలే భలే మగాడివోయ్ సూపర్ హిట్ కావడం వల్ల ఈ సినిమాకి సూపర్బ్ ప్రీ రిలీజ్ బిజినెస్ జరుగుతోంది. ట్రైలర్ మరియు ఆడియో రిలీజ్ కూడా కాలేదు కానీ అప్పుడే దాదాపు అన్ని ఏరియాల్లో ఈ సినిమా బిజినెస్ పూర్తయ్యింది. ఓవర్సీస్ లో కూడా పిక్సెల్ డ్రీమ్స్ వారు కూడా కోటి రూపాయలు పెట్టి ఈ సినిమా రైట్స్ ని తీసుకున్నారు. రిలీజ్ కి ముందే ఈ రేంజ్ లో బిజినెస్ జరుగుతుండడంతో ఈ చిత్ర టీం చాలా చాలా హ్యాపీగా ఉన్నారు. ఈ సినిమా ఆడియోని జనవరి 20వ తేదీ హైదరాబాద్ లోని శిల్పకళావేదికలో సూపర్ స్టార్ మహేష్ బాబు చేతుల మీదుగా గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు. అలాగే సినిమాని ఫిబ్రవరి 5వ తేదీన రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు.

(Visited 110 times, 1 visits today)