Home / Entertainment / ట్రైలర్ లో నాని వీర ప్రేమ గాథ చూపించేశాడు.

ట్రైలర్ లో నాని వీర ప్రేమ గాథ చూపించేశాడు.

Author:

నాని హీరో కంటే యాక్టర్ అంటే బాగుంటుంది. ఎందుకంటే నాని యాక్టింగ్ చేసినట్టు ఎక్కడ కనిపించదు, తను పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ యాక్టర్. నాని ఎలాంటి పాత్ర అయిన తన కామెడీ టైమింగ్ తో, తనకున్న స్కిల్స్ తో పాత్రను మరో మెట్టు ఎక్కిస్తాడు. అందుకే నాని ని న్యాచురల్ స్టార్ అంటారు.నాని నుండి ఇప్పుడు ‘అందాల రాక్షసి’ అంటూ క్లాసిక్ టచ్ తో మెప్పించిన దర్శకుడు హనుమ రాఘవపూడి కాంబినేషన్ లో వస్తున్న సినిమా ‘కృష్ణగాడి వీర ప్రేమ గాథ’ అనే సినిమా విడుదలకు సిద్ధమవుతోన్న విషయం తెలిసిందే.

14 రీల్స్ ఎంటర్టైన్-మెంట్స్ పై తెరకెక్కిన ఈ సినిమా ఆడియో వేడుక బుధవారం నాడు జరిగింది. విశాల్ చంద్ర శేఖర్ ఈ సినిమాకు సంగీతాన్ని అందించాడు. ‘కృష్ణగాడి వీర ప్రేమ గాథ’ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన సూపర్ స్టార్ మహేశ్ బాబు ఆడియోని విడుదల చేశాడు. ఆడియో వేడుకలో భాగంగా..! సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను కూడా విడుదల చేశారు. ట్రైలర్ తో మరోసారి మంచి మార్కులే కొట్టేశాడు హీరో నాని. ఈ ట్రైలర్ లో లవ్‌స్టోరీ, ఒక థ్రిల్లింగ్ ఎలిమెంట్, వీటిచుట్టూ ఉన్న ఫన్.. అన్నింటినీ కలిపి చెప్పిన కథగా ఉంది. ఇక చివరిగా నాని ‘రెండు నిమిషాల్లో చెప్పేయడానికి ఇది కథ కాదురా.. గాథ’ అంటూ నాని చెప్పే ఓ డైలాగ్‌తో ట్రైలర్ ముగుస్తుంది.

(Visited 166 times, 1 visits today)