Home / Entertainment / జనవరి 18న ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ పాటలు.

జనవరి 18న ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ పాటలు.

Author:

Krishna Gadi Veera Prema Gadha Movie First Look Released

నాని ‘భలే భలే మగాడివోయ్’ సినిమాతో ఊహించని స్థాయి హిట్ కొట్టి ఒక్కసారే స్టార్ స్టేటస్‌ని కొట్టేసిన హీరో, అంతకు ముందు తన సినిమాలు వరుసగా నిరశపరిచాయి, ఇప్పుడు తాజాగా ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ అంటూ మరో ఎంటర్‌టైనింగ్ సినిమాతో సిద్ధమవుతోన్న విషయం తెలిసిందే. ‘అందాల రాక్షసి’ సినిమాతో అందరి దృష్టినీ ఆకర్షించిన హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్నా ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ 14 రీల్స్ నిర్మిస్తుంది. ఈ మధ్యే విడుదలైన ఫస్ట్‌లుక్ పోస్టర్‌కు ఈహించని స్థాయి రెస్పాన్స్ వచ్చింది.

ఇక ఈ రెస్పాన్స్‌తో హ్యాపీ అయిన టీం, సినిమాను అనుకున్న సమయానికల్లా సిద్ధం చేసేలా ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఆడియో రిలీజ్ డేట్‌ను కూడా ఫిక్స్ చేసింది. విశాల్ చంద్రశేఖర్ సంగీత దర్శకత్వంలో రూపొందిన ఆడియోను జనవరి 18న హైద్రాబాద్‌లోని శిల్పకళావేదికలో విడుదల చేయనున్నారు. పలువురు సినీ ప్రముఖుల సమక్షంలో భారీ ఎత్తున జరిగే ఈ ఈవెంట్ కోసం 14 రీల్స్ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. నాని సరసన మెహరీన్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో మురళీ శర్మ, సంపత్ కీలక పాత్రల్లో నటించారు. ఫిబ్రవరి 5న రిలీజ్ ఈ సినిమాకు రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు.

(Visited 205 times, 1 visits today)