చిన్నప్పుడొక సారి “ నేను నల్లగా ఉన్నానట అందరూ ఏడిపిస్తున్నారూ ” అని ఏడుస్తూంటే మా అమ్మ ఇలా చెప్పింది ” కృష్ణ అంటే నల్లనిది వెలుగు కు ముందూ వెనకా ఉండేది చీకటే ఆదీ అంతమూ నేనే అని చెప్పటానికే దేవుడు నల్లని వాడూ అన్నారు నల్లగా ఉండటం అంటే కృష్ణుడిలా ఉన్నావన్నమాట” అంతే అప్పటినుంచీ నా ఫేవరెట్ గాడ్ లార్డ్ కృష్ణ అన్నమాట.
మరి కృష్ణుడంటే ఎప్పుడు చూసినా వెన్న తింటూనో,ఫ్లూటు వాయిస్తూనో ఉండే ఫొటోలు మాత్రమే ఉన్నాయ్ ఇంట్లో. మరి నాఫేవరెట్ గాడ్ లార్డ్ కృష్ణ ఎలా మాట్లాడే వాడు, ఎలా తిరిగే వాడు ఇవన్నీ ఎలా తెలుస్తాయ్..? అని పేద్ద డౌటనుమానం వచ్చి మళ్ళీ అమ్మదగ్గరికెల్తూంటే అప్పుడే కరెంటొచ్చి మాటీవీ ఆనయ్యింది.(మాఇంట్లో టీవీ కరెంట్ పోతేనే ఆఫవ్వుద్ది కరెంటొస్తే ఆనవ్వుద్ది అంతే మేం ముట్టుకొని దాని మనోభావాలు దేబ్బతీయం) అటు చూద్దును కదా మై హీరో లార్డ్ కృష్ణుడు ఫ్లూటు పట్టుకొని పాట పాడుతున్నాడు అలా చూస్తూండి పోయాను. వెనకనుంచి వచ్చిన అమ్మ “ఆహా నిజంగా దేవుడంటే ఇలానే ఉంటాడేమొ అన్నట్టున్నారు రామా రావు గారు”, “అమ్మా ఆయన రాముడు కాదే కృష్ణుడు” అన్నాను చిరాగ్గా “కృష్ణుడేరా కానీ ఆ నటించేది ఎంటీయారు ఇంకా చాలా మందున్నారు” అంది. ఇక అప్పటి నుండి తెలుగు సినిమాల్లో కృష్ణుల్ని వెతకటం అలా అలవాటైపోయింది.. నాకు దొరికిన కృష్ణులు వీళ్ళు కొందరు కృష్ణులవైపో లుక్కేసుకొండి.
వెండితెర మీద ఇంకా చాలామందే కృష్ణులున్నారు. ఎలా ఉన్నా…. ఎవరిలా ఉన్నా…. అందరిలోనూ ఒక
కృష్ణుడుంటాడు.. చిలిపిగా,అమాయకంగా, కోపంగా, రౌద్రంగా, శాంతంగా, సహాయంగా అందరిలోనూ ఉండి అనంతంగా
వెలుగుతాడు..వెలుగునిస్తాడు…మనల్ని వెలిగిస్తాడు.. ఓం నమో భగవతే వాసుదేవాయ
అలజడి.కాం తరఫున శ్రీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు.