Home / Reviews / కృష్ణాష్టమి సినిమా రివ్యూ & రేటింగ్.

కృష్ణాష్టమి సినిమా రివ్యూ & రేటింగ్.

Author:

Krishnastami Movie Perfect review and rating

సక్సెస్ఫుల్ చిత్రాల నిర్మాత దిల్ రాజు నిర్మాతగా, వాసు వర్మ జోష్ నుంచి తేరుకొని ఏడేళ్లకు దర్శకుడిగా తనను తాను నిరుపించుకోవడానికి, కమెడియన్ నుంచి హీరోగా మారిన సునీల్ ని హీరోగా తీసుకొని చేసిన చిత్రం కృష్ణాష్టమి. మరి కృష్ణాష్టమి సునీల్ కెరీర్ కి బూస్ట్ ఇచ్చిందా..? ఈ సినిమాతో అయినా వాసువర్మ దర్శకుడిగా ప్రూవ్ చేసుకున్నాడా..? మరి మీరే చూడండి….

కథ :

కృష్ణ వరప్రసాద్ (సునీల్) చిన్నప్పటి నుంచి తన కుటుంబానికి దూరంగా అమెరికాలోనే చదువుకుని అక్కడే పెద్దవాడవుతాడు. అతణ్ని ఇండియాకు రప్పించడం తన కుటుంబానికి ఇష్టం ఉండదు. కృష్ణ పెళ్లి కూడా అమెరికాలోనే చేయాలని ఆశపడతాడు అతడి పెదనాన్న. ఐతే కృష్ణ ఆయనకు తెలియకుండా ఇండియాకు బయల్దేరిపోతాడు. దారి మధ్యలో పల్లవి (నిక్కీ గర్లాని) అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. ఐతే అతను ఇండియాకు రాగానే అతడి మీద అటాక్ జరుగుతుంది. ఆ ప్రమాదంలో గాయపడిన అజయ్ (అజయ్) ఇంటికి అతడి కొడుకుని తీసుకుని కృష్ణ వెళ్లగా ఆ ఇంటి పెద్దే తన మీద అటాక్ చేయించాడని తెలుస్తుంది. ఇంతకీ కృష్ణ మీద ఆ అటాక్ ఎందుకు జరిగింది.. అతణ్ని అమెరికాలోనే ఎందుకు చదివించాల్సి వచ్చింది.. తన సమస్య ఏంటో తెలిశాక కృష్ణ దాన్ని ఎలా పరిష్కరించుకున్నాడు.. అన్నది మిగతా కథ.

అలజడి విశ్లేషణ:

ఫస్టాఫ్ మొత్తం చాలా డీసెంట్‌గా కొనసాగుతుంది. హీరో ఎంట్రి, హీరోయిన్ ఎంట్రితో అసలు కథని ఏ మాత్రం రివీల్ చేయకుండా చాలా సాగదీసేశారు. ఎంటర్టైన్మెంట్ ఫర్వాలేదు కానీ.. పాటలు ఎక్కడబడితే అక్కడ రావడంతో బోర్ కొడుతుంది. అక్కడక్కడ వచ్చే కొన్ని కామెడీ సీన్స్ ప్రేక్షకులను కాస్త నవ్విస్తాయి. అయితే.. ప్రీ-ఇంటర్వెల్ ఎపిసోడ్ కాస్త ఆసక్తికరంగా వుంటుంది. ఇక ఇంటర్వెల్ బ్లాక్ ఎవరూ ఊహించని ట్విస్ట్‌తో ముగుస్తుంది. ఈ ఇంటర్వెల్ ఎపిసోడే ఫస్టాఫ్‌ని ప్లస్ పాయింట్‌గా చెప్పుకోవచ్చు. ఓవరాల్‌గా సునీల్ తన ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్‌, ప్రీ-ఇంటర్వెల్, ఇంటర్వెల్ ఎపిసోడ్స్‌తో ఫస్టాఫ్‌ డీసెంట్‌గా సాగుతుంది. హీరోయిన్ కు ‘పల్లవిజం’ ఫిలాసఫీ అని ఒకటి పెట్టి.. దాని చుట్టూ ఓ సాదాసీదా లవ్ స్టోరీతో ప్రథమార్ధాన్నంతా లాగించేశారు. పోసాని కృష్ణమురళి సప్తగిరి కొంచెం కామెడీ తాళం వేసినా.. అది సరిపోకపోవడంతో ఫస్టాఫ్ భారంగా గడుస్తుంది. ఫస్టాఫ్ వినోదంతో రాజీ పడితే ‘కృష్ణాష్టమి’ ఓ మోస్తరుగా అనిపిస్తుంది కానీ.. కొత్తదనం కోరుకుంటే మాత్రం నిరాశ తప్పదు.

ఇక సెకండాఫ్ గురించి మాట్లాడుకుంటే.. ప్రథమార్ధంతో పోలిస్తే ద్వితీయార్ధంలో ఎంటర్టైన్మెంట్ పార్ట్ బెటర్ గా ఉండటం ఊరటనిస్తుంది. సెల్ఫీ బల్ఫీగా బ్రహ్మీ ఓ మోస్తరుగా నవ్వించాడు. అసలు కథాంశాన్ని పక్కన పెట్టేసి, ఎంటర్టైన్‌మెంట్ డోస్‌ని బాగా పెంచేశారు. ఇక పాటలు సందర్భానుకూలంగా వస్తాయి. యాక్షన్ ఎపిసోడ్స్ మాస్ ఆడియెన్స్‌ని ఉర్రూతలూగిస్తాయి. ఎమోషనల్ ఎపిసోడ్స్‌ని బాగా తీశారు. ఇక క్లైమాక్స్ చాలా ఆసక్తికరంగా మారుతుంది. చివరగా.. ఎమోషనల్‌గా ముగుస్తుంది. మొత్తంగా చెప్పుకోవాలంటే.. సెకండాఫ్‌లో కొన్ని లోపాలు వున్నప్పటికీ.. క్లైమాక్స్ మేజర్ ప్లాస్ పాయింట్‌గా నిలిచింది.

సాంకేతిక వర్గం పనితీరు:

జోష్ సినిమాతో ఆశించిన స్థాయి విజయం అందుకోలేకపోయినా దర్శకుడు వాసు వర్మ మీద ఎంతో నమ్మకంతో దిల్ రాజు మరో అవకాశం ఇచ్చాడు. అయితే రెండో అవకాశాన్ని కూడా వాసు వర్మ సరిగ్గా ఉపయోగించుకున్నట్టుగా కనిపించలేదు. హీరో విలన్ ఇంట్లో ఉండి వాళ్లను మార్చటం అనే రొటీన్ కాన్సెప్ట్ ని మరోసారి ఎంచుకున్న వాసువర్మ పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. అయితే ఫస్ట్ హాఫ్ కాస్త సోలోగా నడించినా సెకండాఫ్ లో మాత్రం వేగంగా కథ నడిపించాడు.

ముఖ్యంగా మాస్ ఇమేజ్ ఉన్న హీరో(అల్లు అర్జున్) కోసం రాసుకున్న కథను కామెడీ ఇమేజ్ ఉన్న హీరోతో తెరకెక్కించడం అంతగా వర్క్ అవుట్ అయినట్టుగా లేదు. ఇక సినిమాటోగ్రాఫీ చాలా బాగుంది. యూరప్ అందాలతో పాటు ఇండియాలోని లొకేషన్స్ ని కూడా చాలా బాగా చూపించారు. దినేష్ కనకరత్నం సంగీతం పరవాలేదనిపించింది. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. సాంగ్స్, ఫైట్స్, ఫారిన్ లొకేషన్స్ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా తెరకెక్కించారు.

ప్లస్ పాయింట్స్ :

  • కామెడీ
  • సినిమాటోగ్రఫి
  • సినిమా నిడివి

మైనస్ పాయింట్స్ :

  • రొటీన్ కథ
  • ఫస్ట్ హాఫ్
  • పాటలు

అలజడి రేటింగ్: 2/5

                                         పంచ్ లైన్:  కృష్ణాష్టమి నిర్మాతకు కష్టాష్టమే! 

(Visited 1,273 times, 1 visits today)