Home / Inspiring Stories / నీతి గురించి అవినీతి ప్రసంగాలు.

నీతి గురించి అవినీతి ప్రసంగాలు.

Author:

ఏసీపి సంజివరావు ఇప్పుడు ఎక్కడ చూసిన మన సార్ గూరించే మాటలు. ఆయన అవినీతి బండారం బయటపడకముందు యువతకు మంచి సందేశాలు ఇచ్చారు. ఈ దాడులు జరిగిన కొన్ని రోజుల ముందు కూకట్ పల్లి పరిధిలోని ఓ కళాశాలలో ఫ్రెషర్స్ డే జరిగింది. ఈ కార్యక్రమానికి సంజీవరావు అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్ధులను ఉద్దేశించి మాట్లాడుతూ.. ఐఏఎస్‌లు చేసి.. ఐపీఎస్‌లు చేసి.. ముఖ్యమంత్రులై.. అవినీతి కూపాల్లో చొచ్చుకుపోయి, కుంభకోణాల్లో ఇరుక్కుపోయి, చంచల్‌గూడ జైల్లో, చర్లపల్లి జైల్లో పడ్డారే…వాళ్ళంతా జాతికి ముద్దుబిడ్డలు కాదు… దుష్టశక్తులు!!” అంటూ అవినీతి గురించి లెక్చర్ ఇచ్చారు.

భరతమాతకు ముద్దుబిడ్డలుగా ఉండాలని.. ఉత్తచెత్త పౌరులుగా కాక.. ఉత్తమ పౌరులుగా నిలవాలని సంజీవరావు మహా గొప్పగా ప్రసంగించారు. యువతలో మార్పు రావడం చాలా అవసరమని సంజీవరావు అన్నారు. భవన నవజీవన బృందావన నిర్మాతలు’ అంటూ కొన్ని శ్రీశ్రీ కవితలు వదిలారు. ఇవన్ని ఇటీవల ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయనే ఆరోపణలతో ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసిన కూకట్ పల్లి ఏసీపి సంజీవ రావు అన్న మాటలే. గత శనివారం నాడు ఏసీబీ అధికారులు ఏసీపి ఇంట్లో సోదాలు నిర్వహించి ఆయనకు రూ.13 కోట్ల ఆస్తులు ఉన్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.. ఏసీబీ దాడుల్లో సంజీవరావు అడ్డంగా దొరికిపోయిన తరువాత ఆయన నీతి గురించి ప్రసంగించిన మాటలు హల్ చల్ చేస్తున్నాయి. ‘నీతి’ మాటలవరకే పరిమితమై..’అవినీతి’ చేతల వరకు తీసుకువెళ్ళారు ఏసీపి సంజీవరావు. ఈ వీడియో చూసిన అందరు ‘ముందు నువ్వు నీతిగా ఉండి ఆ తరువాత నీతి గురించి మాట్లాడు’ అంటు మనోడిపై విరుచుకుపడుతున్నారు.

(Visited 245 times, 1 visits today)