Home / Reviews / కుమారి 21F సినిమా రివ్యూ & రేటింగ్.

కుమారి 21F సినిమా రివ్యూ & రేటింగ్.

Kumari 21F movie perfect review and rating

Alajadi Rating

3/5

[easy-social-share buttons="facebook,twitter" counters=0 total_counter_pos="left" hide_names="no" template="flat-retina" facebook_text="Share" twitter_text="Tweet"]

Cast: రాజ్ తరుణ్, హేభ పటేల్.,నోయెల్.

Directed by: పల్నాటి సూర్య ప్రతాప్.

Produced by: సుకుమార్

Banner: PA Motion Pictures.

Music Composed by: దేవీశ్రీ ప్రసాద్

టాలీవుడ్ సక్సెస్ఫుల్ డైరెక్టర్స్ లో ఒకరైన సుకుమార్ సరికొత్త కథలని ప్రేక్షకులకు అందించాలని సుకుమార్ రైటింగ్స్ అనే నిర్మాణ సంస్థని స్థాపించి, అందులో మొదటి సినిమాకి తన కథ – స్క్రీన్ ప్లేని అందించి చేసిన సినిమా ‘కుమారి 21F’. ప్రస్తుతం ప్రేమ విషయంలో యువత ధోరణి ఎలా ఉంది అన్న బోల్డ్ పాయింట్ ని టార్గెట్ చేస్తూ చేసిన ఈ సినిమాలో రాజ్ తరుణ్, హేభ పటేల్ హీరో, హీరోయిన్స్ గా నటించారు. పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం.

కథ:

సిద్దూ (రాజ్ తరుణ్) ఓ సాధారణ యువకుడు.కెజిబి కాలనీలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో జీవనం సాగించే ఓ కుర్రడు.హోటల్ మేనేజ్ మెంట్ పూర్తి చేసి సింగపూర్ లో ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తుంటాడు. తన తల్లితో పాటు కలిసి ఉంటున్న సిద్దూ, తన తండ్రి కుటుంబాన్ని వదిలేసి వేరే అమ్మాయితో ఉంటున్నాడని ద్వేషం పెంచుకుంటాడు. సిద్దుకి ముగ్గురు ఫ్రెండ్స్.. వాళ్ళే శంకర్(నోయెల్), ఫోటోల సురేష్(నవీన్), సొల్లు శీను(సుదర్శన్). వీరు ముగ్గురూ దొంగతనాలు చేస్తూ బయటకి బిల్దప్స్ ఇచ్చుకొని బతుకుతూ ఉంటారు. కట్ చేస్తే అదే కాలనీలోకి ముంబై నుంచి మోడల్ అయిన కుమారి(హేభ పటేల్) వస్తుంది. కుమారి మెయిన్ క్వాలిటీ ఉన్నది ఉన్నట్లు మాట్లాడటం, అందరితో ఫ్రెండ్లీగా ఉండడం. అలాంటి కుమారి మొదటి చూపులోనే సిద్దుని ప్రేమిస్తుంది. చాలా షార్ట్ టైంలోనే ఇద్దరూ లవర్స్ అవుతారు. కానీ కుమారి ఓపెన్ గా ఉండడం, అలాగే కుమారి గురించి సిద్దు ఫ్రెండ్స్ ఎప్పటికప్పుడు నెగటివ్ గా చెబుతుండడం వలన సిద్దుకి కూడా కుమారి మీద అనుమానం రావడంతో నిలదీస్తాడు. దాంతో ఇద్దరి మధ్యా దూరం పెరుగుతుంది. అదే టైంలో సిద్దు ఫ్రెండ్స్ కుమారిపై కన్నేస్తారు.దాంతో లేని పోనీ అనుమానాలు పెంచుకుంటూ వచ్చిన సిద్దు ఓ రోజు వేరే ఎవరి బైక్ మీదో వెళ్తుంటే నిలదీస్తాడు. దాంతో కుమారి తనని అర్థం చేసుకునే మెచ్యూరిటీ తనకు లేదని తన ప్రేమకి నో చెప్పి వెళ్లిపోతుంది. అదే టైంలో సిద్దు ఫ్రెండ్స్ కూడా కుమారిపైన కన్నేస్తారు.

అక్కడి నుంచి సిద్దు తన ప్రేమని దక్కించుకోవడానికి, తన ప్రేమని తెలియజేయడానికి ఏమేమి చేసాడు? అసలు కుమారి ఎందుకు అంతలా బోల్డ్ గా ఉండటానికి కారణం ఏమిటి? అసలు ముంబై నుంచి కుమారి హైదరాబాద్ ఎందుకు వచ్చింది? అసలు కుమారి ముంబై కథ ఏమిటి? అలాగే సిద్దు ఫ్రెండ్స్ కుమారిని ఏమన్నా చేసారా? లేదా? అన్నది మీరు వెండితెరపై చూసి తెలుసుకోవాల్సిన కథ. అక్కడి నుంచి కథ ఎలాంటి మలుపులు తీసుకుంది? చివరికి సిద్దు కుమారిలు కలిసారా? లేదా? సిద్దు ఫ్రెండ్స్ కుమారి పై ఏమన్నా అగాయిత్యం చేయడానికి ట్రై చేసారా? లేదా? అన్నదే మీరు వెండితెరపై చూసి తెలుసుకోవాల్సిన మిగిలిన కథ.

అలజడి విశ్లేషణ:

సుకుమార్ ఇప్పటివరకూ సున్నితమైన యూత్ఫుల్ కథలను చెప్పడంలో సక్సెస్ అయ్యాడు.కానీ కుమారి 21F.. చెప్పాలంటే సుకుమార్ రైటర్ గా తనని తాను కించపరచుకోవడానికి రాసిన కథలా ఉంది. ఎందుకంటే సినిమాలో చెప్పాలనుకున్న పాయింట్ బ్యూటిఫుల్ వే లో కూడా ప్రెజంట్ చేయచ్చు కానీ ఆయన మాత్రం యువతను ఆకర్షించాలని భూతుపై ఎక్కువ దృష్టి పెట్టి ఈ సినిమాలోని సీన్స్ ని డిజైన్ చేసినట్లు తెలిపాడు.ఇప్పుడే యవ్వనంలోకి వచ్చిన నేటితరం యువతలోని భావాలను బేస్ చేసుకొని సుకుమార్ రాసిన ఈ ప్రేమకథ నేటి యువతను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఇందులో వచ్చే అడల్ట్ సీన్స్ అన్నిటికీ ఒక లింక్ పాడు ఉండదు. వస్తుంటాయి అంటే వస్తుంటాయి మీరే సర్దుకొని చూసేయ్యాలి. ఇకపోతే సుకుమార్ స్టైల్ ఉన్న కథ అయితే ఇందులో కనిపించదు, ఏ మారుతినో, లేక బి గ్రేడ్ డైరెక్టర్ నుంచి కథ వస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఇకపోతే ఈ సినిమా యువతకు నచ్చే అంశాలు, ఓవర్ స్కిన్ షో చేసే సీన్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ సినిమా యువతని ఆకట్టుకొని కలెక్షన్స్ మాత్రం బాగా రాబట్టుకుంది. కానీ సుకుమార్ దీనిలో ఎక్కువ భాగం అడల్ట్ కంటెంట్ మీద ఆధార పడ్డాడు. అడల్ట్ కంటెంట్ సినిమాకి ఎక్కువ అయినప్పటికీ ముందు బెంచ్ వారిని ఆకట్టుకొని థియేటర్స్ కి రప్పిస్తుంది. అలాగే సుకుమార్ ఓవరాల్ గా ఈ కథ ద్వారా చెప్పాలనుకున్న రెండు పాయింట్స్ మాత్రం సూపర్బ్ అనిపిస్తాయి.

ఈ చిత్రానికి సుకుమార్ అందించిన కథ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.రాజ్ తరుణ్.. రెండు వరుస హిట్స్ అందుకున్న రాజ్ తరుణ్ పైనే అందరి కన్నూ ఉంది. గత రెండు సినిమాలకి సంబంధంలేని పాత్రలో రాజ్ తరుణ్ కనిపించాడు. కానీ ఈ సినిమాలో రాజ్ తరుణ్ పాత్ర అస్సలు ఎనర్జిటిక్ గా లేదు. ఆ ఎనర్జీ ఎందుకు లేకుండా పాత్రని డిజైన్ చేసారు అన్నదానికి క్లారిటీ లేదు. ఫస్ట్ హాఫ్ లో అయితే ఎప్పుడూ సీరియస్ గా ఉండడం లేదా మూతి ముడుచుకొని ఉండడం, సెకండాఫ్ లో అన్నా కొన్ని చోట్ల డైలాగ్స్ వలన ఎక్స్ ప్రెషన్ మారింది. ముఖ్యంగా క్లైమాక్స్ లో రాజ్ తరుణ్ ఎమోషనల్ పెర్ఫార్మన్స్ సినిమాకి పెద్ద హెల్ప్ అయ్యింది.

ఇకపోతే కుమారిగా కనిపించిన హేభ పటేల్ నటనతో బాగానే చేసింది అనిపించుకుంది.ఇంక చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ మొత్తం హేభ పటేల్ స్కిన్ షో మీదే నడిపించారు అంటే మీరు ఏ రేంజ్ గ్లామర్ ట్రీట్ ఉందనేది అర్థం చేసుకోవచ్చు. ఇక మెయిన్ రోల్స్ చేసిన వారిలో నవీన్, సుదర్శన్ లు తమ పంచ్ డైలాగ్స్ తో కాస్త నవ్విస్తూ వచ్చారు. నోయెల్ నెగటివ్ షేడ్స్ ని బాగా చూపించాడు.. హేమ, తాగుబోతు రమేష్ లు తమ పాత్రల్లో పరవాలేధనిపిస్తే.. సెకండాఫ్ లో వచ్చిన సెకండ్ హీరోయిన్ కూడా స్కిన్ షో పరంగా మెప్పించింది. కుమారి 21F అనే సినిమాకి బాగా హెల్ప్ అయిన పాయింట్స్ విషయానికి వస్తే.. ఫస్ట్ హాఫ్ లో యూత్ ని ఆకట్టుకునే స్కిన్ షో, అడల్ట్ కంటెంట్ సినిమాకి హెల్ప్ అయితే సెకండాఫ్ లో మెయిన్ కథని నడిపించడం, చాలా విషయాలకు క్లారిటీ ఇవ్వడం మరియు క్లైమాక్స్ జస్టిఫికేషన్ ఇచ్చిన విధానం చాలా బాగుంది. అలాగే రాజ్ తరుణ్ – హేభ పటేల్ ల మధ్య వచ్చే కొన్ని కామెడీ సీన్స్ బాగా నవ్విస్తాయి. సుకుమార్ బోల్డ్ కథని రత్నవేలు సినిమాటోగ్రఫీ, దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ మరో మెట్టు పైకి తీసుకెళ్లాయని చెప్పాలి.

నటీనటుల ప్రతిభ:

రాజ్ తరుణ్: రాజ్ తరుణ్ మొదటి రెండు సినిమాల్లో బాగా ఎనర్జిటిక్ గా కనిపించాడు. కానీ ఇందులో ఫస్ట్ హాఫ్ పరంగా సైలెంట్ గా కనిపించిన రాజ్ తరుణ్ సెకండాఫ్ లో తన మార్క్ డైలాగ్ డెలివరీతో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా క్లైమాక్స్ లో రాజ్ తరుణ్ ఎమోషనల్ పెర్ఫార్మన్స్ సినిమాకి పెద్ద హెల్ప్ అయ్యింది.
హేభ పటేల్ : ఇకపోతే కుమారిగా కనిపించిన హేభ పటేల్ నటనతో బాగానే చేసింది అనిపించుకుంది. కానీ మోడ్రన్ అమ్మాయిగా మాత్రం సినిమా స్టార్ట్ టు ఎండ్ అందరినీ తన స్కిన్ షోతో ఆకట్టుకుంది. చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ మొత్తం హేభ పటేల్ స్కిన్ షో మీదే నడిపించారు అంటే మీరు ఏ రేంజ్ గ్లామర్ ట్రీట్ ఉందనేది అర్థం చేసుకోవచ్చు.

మిగతా మెయిన్ లీడ్ రోల్స్ చేసిన వారి విషయానికి వస్తే.. నోయెల్ నెగటివ్ షేడ్స్ ని, దానికి తగ్గట్టు డైలాగ్ డెలివరీ కూడా బాగుంది. ఇక కమెడియన్స్ అయిన నవీన్ – సుదర్శన్ లు తమ మార్క్ పంచ్ డైలాగ్స్ తో ప్రేక్షకులను కాస్త నవ్వించడానికి ట్రై చేసారు. హేమ, తాగుబోతు రమేష్ లు తమ పాత్రల్లో పరవాలేధనిపించారు.

సాంకేతిక వర్గం పనితీరు:

కుమారి 21F అనే సినిమాకి మెయిన్ సుకుమార్. సుకుమార్ ఈ సినిమా కోసం నేటి యువతరం భావాలను బేస్ చేసుకొని రాసుకున్న స్టొరీ లైన్ చాలా బాగుంది. అలాగే దానిని పూర్తి కథగా డెవలప్ చేసుకున్నప్పుడు కొన్ని బ్యూటిఫుల్ సీన్స్ ని కూడా రాసుకున్నాడు. కానీ ఫస్ట్ హాఫ్ లో ఎక్కువ అడల్ట్ కంటెంట్ ని రాసుకోవడం బాలేదు. అది కూడా కథని పక్కన పెట్టి ఫస్ట్ హాఫ్ లో ఎక్కువ రొమాంటిక్ సీన్స్ మీదే దృష్టి పెట్టడం అంత బాలేదు. స్క్రీన్ ప్లే లో లాగ్స్ ఉండడం వలన గుడ్ అనే రేంజ్ లోనే మిగిలిపోయింది. సుకుమార్ కథ – కథనాన్ని చాలా బాగా ప్రెజంట్ చేసాడు డైరెక్టర్ పల్నాటి సూర్య ప్రతాప్. మెయిన్ గా క్లైమాక్స్ ని ఆడియన్స్ కి కనెక్ట్ చేయడంలో సక్సెస్ అయ్యాడు. అలాగే నేరేషన్ విషయంలో కాస్త కేర్ తీసుకోవాల్సింది.

ఇక రత్నవేలు సినిమాటోగ్రఫీతో మేజిక్ చేసాడని చెప్పాలి. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఉండే కాలనీని చాలా రియలిస్టిక్ గాచూపిస్తూనే, విజువల్స్ ని చాలా బ్యూటిఫుల్ గా ఉండేలా చూసుకున్నాడు. చాలా సీన్స్ లో వాడుకున్న ఒర్జినల్ లైటింగ్ సినిమా మోద కి బాగా హెల్ప్ అయ్యింది. ఇక దేవీశ్రీ ప్రసాద పాటలు హిట్ అయ్యాయి, సినిమాలో చూడటానికి కూడా బాగున్నాయి, కానీ చాలా పాటలకి సందర్భం సింక్ అవ్వలేదు. పాటలను పక్కన పెడితే రత్నవేలు విజువల్స్ కి రీ రికార్డింగ్ తో ఓ అందమైన, వినసొంపైన రూపాన్ని తెప్పించాడని చెప్పాలి. ఆర్ట్ వర్క్ చాలా బాగుంది. ఎడిటర్ అమర్ రెడ్డి ఇంకాస్త సినిమా కోసం వర్క్ చేసి కొన్ని అనవసర పాటలని, సీన్స్ ని కట్ చేసి ఉండాల్సింది. పొట్లూరి వెంకీ డైలాగ్స్ బాగున్నాయి. విజయ ప్రసాద్ – థామస్ రెడ్డి – సుకుమార్ కలిసి నిర్మించిన ఈ సినిమా నిర్మాణ విలువలు మాత్రం మైండ్ బ్లోయింగ్ అనే చెప్పాలి. ఓ భారే బడ్జెట్ సినిమాకి ఉన్నట్టు ఈ సినిమా నిర్మాణ విలువలు ఉన్నాయి.

ప్లస్ పాయింట్స్:

  • రత్నవేలు అందించిన బ్యూటిఫుల్ సినిమాటోగ్రఫీ.
  • దేవీశ్రీ ప్రసాద్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్.
  • హేభ పటేల్ స్కిన్ షో.
  • క్లైమాక్స్.

మైనస్ పాయింట్స్:

  • స్లో నేరేషన్.
  • కథనంలో పెద్ద కిక్ లేకపోవడం.
  • ఎడిటింగ్.
  • ఓవర్ అయిన అడల్ట్ కంటెంట్.
  • అనవసరంగా వచ్చే సాంగ్స్.

 

                             పంచ్ లైన్:సు”కుమారి” అడల్ట్ స్కిన్ షోతో యూత్ మనసు దోచే వయ్యరి.

(Visited 174 times, 1 visits today)