Home / Entertainment / రాజమౌళి అసోసియేట్ డైరెక్టర్ కి ఓ లెక్కుంది.

రాజమౌళి అసోసియేట్ డైరెక్టర్ కి ఓ లెక్కుంది.

Author:

Lacchimdeviki O Lekkundi Release Details

టాలీవుడ్ మోస్ట్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి దగ్గర మగధీర, మర్యాద రామన్న, ఈగ బ్లాక్ బస్టర్ సినిమాలకు అసోసియేట్ డైరెక్టర్ గా పని చేసిన జగదీష్ తలసిల దర్శకుడిగా పరిచయం అవుతూ చేసిన సినిమా ‘లచ్చిందేవికీ ఓ లెక్కుంది’.ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ లో ‘అందాల రాక్షసి’ సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న క్రేజీ పెయిర్ నవీన్ చంద్ర – లావణ్య త్రిపాటి మరోసారి జంటగా ఎంఎం కీరవాణి మ్యూజిక్ అందించిన ఈ సినిమా ఆడియోకి మంచి రెస్పాన్స్ రావడమే కాకుండా, ట్రైలర్ కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈశ్వర్ ఎల్లు మహంతి సినిమాటోగ్రాఫర్ గా పని చేసాడు. ఈ సినిమాని మయుఖ క్రియేషన్స్ బ్యానర్ పై సాయి ప్రసాద్ కామినేని నిర్మించారు.టాలీవుడ్ మోస్ట్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి దగ్గర మగధీర, మర్యాద రామన్న, ఈగ బ్లాక్ బస్టర్ సినిమాలకు అసోసియేట్ డైరెక్టర్ గా జగదీష్ చేశాడు. షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆడియోని ఇటీవలే రాజమౌళి చేతుల మీదుగా రిలీజ్ చేసారు.

అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా రిలీజ్ కి సరైన సమయం కోసం ఈ చిత్ర టీం ఎదురు చూస్తోంది. ఫైనల్ గా వారికి డిసెంబర్ లో స్లాట్ దొరకడంతో డిసెంబర్ 11న ‘లచ్చిందేవికీ ఓ లేక్కుంది’ సినిమాని రిలీజ్ చేయడానికి డేట్ ఫిక్స్ చేసారు. జయప్రకాశ్ రెడ్డి, బ్రహ్మాజీ, అజయ్, సంపూర్నేష్ బాబులు ముఖ్య పాత్రలు పోషించిన ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ కి ఈశ్వర్ ఎల్లుమహంతి సినిమాటోగ్రాఫర్ గా పనిచేసాడు.

(Visited 53 times, 1 visits today)