Home / Inspiring Stories / ఫుట్ పాత్ మీదే పురుడు పోసిన మహిళా కానిస్టేబుళ్ళు

ఫుట్ పాత్ మీదే పురుడు పోసిన మహిళా కానిస్టేబుళ్ళు

Author:

అసలే మధ్యాహ్నం… సూర్యప్రతాపంతో జనం అల్లాడిపోతున్నారు. ఆ సమయంలో ఫుట్ పాత్ పై నడుచుకుంటూ వెళుతుందో నిండు చూలాలు. అంతలోనే ఆమెకు పురిటినొప్పులు మొదలయ్యాయి. ఒక్క అడుగూ ముందుకు వెయ్యలేకపోతుంది. అయినా ఒక్కో అడుగు ముందుకు వేసుకుంటూ వెళుతోంది. ఎండ వేడికి మరో అడుగు వెయ్యలేక ఫుట్ పాత్ పైనే కూలబడిపోయింది. విషయం నారాయణగూడ స్టేషన్ పోలీసులకి తెలిసింది. అంబులెన్స్ కి కాల్ చేసినా వచ్చేసరికి కనీసం పదినిమిషాలు పడుతుంది…. ఆ సమయం కూడా లేదు… ఏం చేయాలి..?

చుట్టుపక్కనవాళ్లనడిగి చీరలు తెప్పించి ఫుట్ పాత్ చూట్టూ చీరలు అడ్డంగా కట్టి, మహిళా కానిస్టేబుళ్లే పురుడు పోశారు. పండంటి మగ బిడ్డ పుట్టాడు. ఆ బిడ్డను అందుకుని మురిసిపోయారు ఆ ఇద్దరు పోలీసులు. ఇద్దరిలో ఒకరు నారాయణగూడలో హోమ్ గార్డుగా పనిచేస్తున్న శోభ, మరొకరు మహిళా కానిస్టేబుల్ దివ్య. ఆపదలో సమయస్ఫూర్తితో వ్యవహరించిన ఇద్దరు లేడీ పోలీసులకు అభినందనలు తెలిపారు జనం. అంతేకాదు డిపార్ట్ మెంట్ కూడా ఆ ఇద్దరినీ ప్రశంసలతో ముంచెత్తింది. డెలివరీ తర్వాత ఆ మహిళను, శిశువును 108 ద్వారా కోఠిలోని మెటర్నిటీ హాస్పిటల్ కు తరలించారు. ప్రస్తుతం తల్లీబిడ్డల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందన్నారు హాస్పిటల్ సూపరింటెండెంట్ రత్నకుమారి. మహిళను ఢిల్లీకి చెందిన వారిగా గుర్తించారు పోలీసులు. మిగిలిన విషయాలు తెలియాల్సి ఉంది.

నిజానికి ఆంబులెన్స్ కి కాల్ చేసి తమ పని తాము చూస్కోవచ్చు, ఆ లేడీ పోలీసులు దారిన పోయే ఎవరో ఒక అభాగ్యురాలికోసం తమ డ్యూటీని వదిలేయాల్సిన అవసరమూ లేదు… కానీ..! అక్కడె ఉన్న కొన్ని పదుల మంది సాయం చేయగలిగి ఉండికూడా చోద్యం చూస్తూ నిలబడితే చూడలేక తామే ముందుకు వచ్చారు.. మనిషికి మనిషే తప్ప ఇంకెవరూ సాయం చేయలేరనే విశయాన్ని మరోసారి గుర్థు చేసారు… ఆ మహిళా మూర్థులకు వందనాలతో అలజడి.కాం

(Visited 461 times, 1 visits today)