Home / Entertainment / చిరు 150వ సినిమాకి మరో నిర్మాతగా ప్రముఖ నిర్మాణ సంస్థ.

చిరు 150వ సినిమాకి మరో నిర్మాతగా ప్రముఖ నిర్మాణ సంస్థ.

Author:

chiranjeevi-story kaththi remake

మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన ‘కత్తి’ సినిమాకి రీమేక్ అనీ రామ్ చరణ్ క్లారిటీ ఇవ్వడంతో మెగా అభిమానుల ఆనందానికి అవధులు లేవు. ఈ సినిమాకి కమర్షియల్ డైరెక్టర్ వివి వినాయక్ దర్శకత్వం వహించనున్నాడు. చిరు 150వ సినిమా అనుకున్నప్పటి నుంచీ ఆ సినిమాని రామ్ చరణ్ తన సొంత బ్యానర్ అయిన కొణిదెల ప్రొడక్షన్స్ పై నిర్మిస్తానని చెబుతున్నాడు. చెప్పిన దాని ప్రకారమే ఆయనే నిర్మించనున్నాడు. కానీ తాజా సమాచారం ప్రకారం చిరు 150వ సినిమాని చరణ్ తో పాటు మరో ప్రముఖ నిర్మాణ సంస్థ కూడా భాగస్వామ్యం కానుంది. వారే లైకా ప్రొడక్షన్స్.. వీళ్ళే తమిళ వెర్షన్ ని కూడా నిర్మించారు. ఇప్పుడు అదే సంస్థ చరణ్ తో సహా నిర్మాతలుగా కలిసి చిరు 150వ సినిమా చేయనున్నారు. లైకా ప్రొడక్షన్స్ నిర్మాణ సంస్థతో శ్రీలంక అధ్యక్షుడు మహింద రాజపక్సకు సంబంధాలున్నాయంటూ ఆరోపణలు ఉన్నాయి. తమిళ వెర్షన్ రీలిజ్ సమయంలో తమిళ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేయడం, చెన్నైలో పలు థియేటర్లపై తమిళ సంఘాల దాడి చేసి థియేటర్లను కూడా ధ్వంసం చెయ్యడంతో.. తర్వాత చిత్ర నిర్మాణ సంస్థ అయిన ‘లైకా’ పేరును సినిమా నుంచి తొలగిచారు. ఇక ఇప్పుడు కత్తి తెలుగు వెర్షన్ కి సంబందించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. వచ్చే ఏడాది ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ప్రస్తుతం లైకా ప్రొడక్షన్స్ వారు ప్రస్తుతం రజినీకాంత్ – శంకర్ కాంబినేషన్ లో ‘రోబో 2.0’ని మొదలు పెట్టారు.తమిళనాడులో పెద్ద పెద్ద సినిమాలు ఇప్పుడు లైకా ప్రొడక్షన్ వారు నిర్మిస్తున్నారు. మెగాస్టర్ సినిమాతో తెలుగులో కూడా మొదటి చిత్రంగా వస్తున్నారు. ఇక తర్వాత తెలుగులో కూడా మరి సినిమాలు నిర్మిస్తారో లేదో చూడాలి.

(Visited 45 times, 1 visits today)