Home / Entertainment / ‘లజ్జ’లో ఏం చూపిస్తారు?

‘లజ్జ’లో ఏం చూపిస్తారు?

Author:

lajja

‘1940లో ఒక గ్రామం’ చిత్రంతో దర్శకుడు నరసింహ నంది జాతీయ ఆవార్డును అందుకున్నారు. ఆ తరువాత ‘కమలతో నా ప్రయాణం’ , ‘హైస్కూల్’ వంటి చిత్రాలను రూప కల్పన చేశారు. ఇప్పుడు శివ, వరుణ్, మధుమిత ప్రధాన పాత్రల్లో, శ్రీ లక్ష్మీ నరసింహ సినిమా బ్యానర్‌పై నరసింహ నంది దర్శకత్వంలో, బూచేపల్లి తిరుపతి రెడ్డి నిర్మాతగా నిర్మించిన చిత్రం లజ్జ. ప్రతి అమ్మాయి పెళ్ళైన తరువాత తన భర్త ప్రేమ తనకే సొంతం అని కలలు కంటుంది. భర్త దగ్గర నుండి ప్రేమను పొందక పోయినప్పుడు ఆ అమ్మాయి ఆలోచనలు ఎలాంటి పరిస్థితికి దారి తీస్తాయి అన్నదే చిత్ర కథ. తన మనసుకు నచ్చిన వ్యక్తి కోసం ఎంత దూరమైన వెళ్లగలిగిన పాత్ర మధుమితది అని చిత్ర దర్శక నిర్మాతలు అంటున్నారు. దీన్ని బట్టి సినిమా వివాహేతర సంబంధం చూట్టూ తిరుగుతుందని స్పష్టమవుతోంది. ఈ చిత్రం లోగో ఆవిష్కరణ ఫిల్మ్ ఛాంబర్‌లో ఇటీవల జరిగింది. ప్రసన్నకుమార్ లజ్జ చిత్రం లోగోను విడుదల చేశారు. ఈ సందర్బంగా ప్రసన్నకుమార్ మాట్లాడుతూ జాతీయ ఆవార్డును అందుకున్న దర్శకుడ్ని మనం కాపాడుకోగలిగితేనే చిత్ర పరిశ్రమకు మంచి చిత్రాలు వస్తాయి అన్నారు.

(Visited 507 times, 1 visits today)