Home / Entertainment / ఈ నెల 7న పేలనున్న ‘లక్ష్మి బాంబ్’ పాటలు.

ఈ నెల 7న పేలనున్న ‘లక్ష్మి బాంబ్’ పాటలు.

Author:

మంచు వారి అందాల ముద్దుగుమ్మ మంచు లక్ష్మి ప్రధాన పాత్రలో నటిస్తున్న నూతన చిత్రం ‘లక్ష్మి బాంబ్’ ఈ సినిమాకు సాధ్యం, వసూల్ రాజా వంటి వైవిధ్యమైన సినిమాలకు అందించిన కార్తికేయ గోపాల కృష్ణ దర్శకత్వం వహించగా గునపాటి సురేష్ రెడ్డి సమర్పణలో వేళ్ల మౌనిక చంద్రశేఖర్, ఉమా లక్ష్మి నరసింహలు నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది.ఈ సినిమాలో మంచు లక్ష్మిని ఒక పవర్ ఫుల్ జడ్జ్ పాత్రలో చూపిస్తున్నారు కార్తికేయ గారు.

laxmi-bomb-songs

చాలా రోజుల తరవాత లక్ష్మి గారికి ఒక మంచి చిత్రం కానుందని నిర్మాతలు తెలిపారు. సునీల్ కశ్యప్ అందించిన ఈ చిత్రం యొక్క ఆడియోని ఈ నెల 7 వ తేదీన ఘనంగా రిలీజ్ చేయనున్నారు. ఈ చిత్రం ఆడియో రిలీజ్ కి మంచు వారి ఫ్యామిలీ తో పాటు తెలుగు సినిమా పెద్దలు అందరూ వస్తున్నారని దర్శక, నిర్మాతలు తెలిపారు.

(Visited 247 times, 1 visits today)