Home / Videos / లంచం తీసుకుంటూ కెమెరా కి దోరికిన బీహార్ మంత్రి.

లంచం తీసుకుంటూ కెమెరా కి దోరికిన బీహార్ మంత్రి.


బీహార్ తొలిదశ ఎన్నికల కు ముందే జేడీయూ పరువు మంట గలిసింది బీజేపీ కి ఇప్పుడో కొత్త అస్త్రం దొరికింది ఆ అస్త్రం పేరు అవదేష్ ప్రసాద్ కుష్వాహా. నితీష్ సర్కార్ లో పట్టణాభివృద్ది శాఖా మంత్రిగా ఉన్న అవదేశ ప్రసాద్ ఎన్ని కల్లో పోటీ కి సిద్దంగా ఉన్నారు కూడా.

ఈ మద్య తెలంగాణా లో రేవంత్ రెడ్డి మాదిరిగానే,ఓటుకు నోటు వ్యవహారాన్ని తలపించే విధంగానే అవదేశ్ చక్కగా బుక్కయ్యారు.  జైహింద్ బీహార్ అనే స్వచ్చంద సంస్థ జరిపిన స్టింగ్ ఆపరేషన్ లో అడ్దంగా రెడ్ హాండెడ్ గా దొరికి పోయాడు ఈ మంత్రి గారు. ఒక వేళ తమ ప్రభుత్వ మే గనక అధికారం లో కి వస్తే కొన్ని విలువైన కాంట్రాక్ట్ లు వారికే ఇప్పించే ఒప్పందం మీద రూ.4 లక్షల లంచం తీసుకుంటున్న వీడియో లు బయట పడ్డాయ్. దాంతో ఒక్క సారిగా దుమారం రేగింది.  దీంతో వెంటనే ఆయన మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఈ విషయాన్ని జేడీయూ జాతీయ అధ్యక్షుడు శరద్‌యాదవ్ ధ్రువీకరించారు.

ఎన్నికల్లో కుష్వాహా నామినేషన్ వేసిన నియోజకవర్గంలో ఆయన స్థానంలో నామినీగా ఉన్న వ్యక్తిని తమ పార్టీ అభ్యర్థిగా పరిగణిస్తామన్నారు. కుష్వాహాపై ఆరోపణలను విశ్వసించే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. బీజేపీలా ముఖ్యమంత్రులు అవినీతికి పాల్పడినా చర్య తీసుకోకుండా మేము ఉండము అనటానికి ఈ ఘటనే సాక్ష్యమనీ ప్రజలు అన్నీ గమనించ గలరు అనీ ఆయన వ్యాఖ్యానించారు . ఓ కాంట్రాక్టర్‌కు అనుకూలంగా వ్యవహరించేందుకుగాను కుష్వాహా రూ.4 లక్షల లంచం తీసుకుంటున్నట్టుగా వీడియోలో రికార్డయింది. అయితే ఈ సంఘటన అంతా కావలనే చేసిన కుట్ర అనీ దీని పై తాను కోర్టు లో పరువు నష్టం దావా వేస్తాననీ అవదేష్ ప్రసాద్ కుష్వాహా ఆరోపించారు. అలా తన వీడియోని తన అనుమతి లేకుండా తీయటం దాన్ని బహిర్గతం చేయటం హేయమైన చర్య అని ఆయన అన్నారు..

(Visited 31 times, 1 visits today)
[fbcomments url="http://peadig.com/wordpress-plugins/facebook-comments/" width="100%" count="off" num="3" countmsg="wonderful comments!"]