Home / General / ఓటు వేసే అవకాశం పొందుదాం…ఓటరుగా నమోదుకు నేడు ఆఖరు రోజు !

ఓటు వేసే అవకాశం పొందుదాం…ఓటరుగా నమోదుకు నేడు ఆఖరు రోజు !

Author:

కొత్త ఓటర్లు నమోదు చేసుకోవడానికి నేడు ఆఖరు. జనవరి 1, 2018కి 18 ఏళ్లు నిండిన వారు మాత్రమే దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. ఆ తేదీ తర్వాత 18 ఏళ్లు పూర్తి చేసుకున్న వారికి ఓటరు కార్డు ఇవ్వరు. అలాంటి వారు మళ్ళీ జనవరి 1 వరకు ఆగాల్సిందే. మంగళవారం సాయంత్రం 6 గంటల వరకూ అవకాశం ఉంది. దరఖాస్తులు స్వీకరించేందుకు పలుచోట్ల సేవా కేంద్రాలను ఏర్పాటు చేసింది ఎన్నికలు సంఘం. ఓటరుగా నమోదు చేసుకోవాలంటే ఫొటో, వయసు ధృవీకరణ, చిరునామా తెలిపే గుర్తింపు కార్డులు ఉంటే సరిపోతుంది. దరఖాస్తులను పరిశీలించి అర్హులైన వారికి అక్టోబరు 8 నాటికి ఓటరు కార్డులను మంజూరు చేస్తారు. తెలంగాణలో ఈనెల 10వ తేదీ నుంచి 24 వరకు 1,07,343 దరఖాస్తులు వచ్చాయని ఎన్నికల విభాగం అధికారులు చెప్పారు.

ఓటరు నమోదు, పేర్లు, చిరునామాల సవరణ దరఖాస్తుల స్వీకరణ నేటితో ముగుస్తుందని జీహెచ్‌ఎంసీ తెలిపింది. అన్ని దరఖాస్తులను నాలుగో తేదీకల్లా పరిశీలించి తుది ఓటరు జాబితాను అక్టోబరు 8న ప్రకటిస్తామంటోంది. అనంతరం కొద్ది రోజులకు మళ్లీ నమోదు, సవరణ… పునఃప్రారంభం అవుతాయని, ఆ తేదీలను ఎన్నికల సంఘం తర్వాత ప్రకటిస్తుందని అధికారులు తెలిపారు. ఎన్నికల నోటిఫికేషన్‌, నామినేషన్ల స్వీకరణ తుది గడువు ఆధారంగా వాటిని ఎన్నికల సంఘం ఖరారు చేస్తుందన్నారు.

last day in telangana for voter registration 2018

ఏ దరఖాస్తు.. ఎందుకు?

ఫారం-6.. నూతన ఓటరు నమోదు

ఫారం-7.. ఓటరు కార్డు తొలగింపు(శాసనసభ నియోజకవర్గం దాటి బదిలీ కావడం, చనిపోవడం, తదితర కారణాలతో)

ఫారం-8.. పేరు, చిరునామాల్లో దోషాలు ఉంటే సరిదిద్దుకునేందుకు.

ఫారం-8ఏ.. చిరునామా మార్పు(అదే శాసనసభ నియోజకవర్గం పరిధిలో)

Website Link : http://ceotelangana.nic.in/

ఇది నిరంతర ప్రక్రియ..

ఓటరు నమోదు, పేర్లు, చిరునామాల సవరణ దరఖాస్తుల స్వీకరణ మాత్రమే నేటితో ముగుస్తుందని జీహెచ్‌ఎంసీ తెలిపింది. అనంతరం కొద్ది రోజులకు మళ్లీ నమోదు, సవరణ.. పునఃప్రారంభం అవుతాయని, ఆ తేదీలను ఎన్నికల సంఘం తర్వాత ప్రకటిస్తుందని అధికారులు తెలిపారు.

(Visited 1 times, 1 visits today)