Home / Latest Alajadi / ఇండియా మొట్టమొదటి ఆండ్రాయిడ్ గో స్మార్ట్ ఫోన్ అతి తక్కువ ధరలో

ఇండియా మొట్టమొదటి ఆండ్రాయిడ్ గో స్మార్ట్ ఫోన్ అతి తక్కువ ధరలో

Author:

ప్రముఖ మొబైల్ తయారిదారు ఐన లావా ఇంటర్నేషనల్ తన మొట్టమొదటి ఆండ్రాయిడ్ గో మొబైల్ ను ఇండియాకు పరిచయం చేస్తున్నది. ఇటీవల బార్సిలోన దేశం లో జరిగిన మొబైల్ వరల్డ్ కాంగ్రెస్స్ లో లావా వాళ్ళు తాయారు చేసిన లావా Z50 మోడల్ ఆండ్రాయిడ్ గో వెర్షన్ మొబైల్ ను ప్రదర్శనకు ఉంచారు.

ఈ మొబైల్ లో ఆండ్రాయిడ్ ఓరియో ఆప్టిమైజ్డ్ వెర్షన్ వాడటంవలన, తక్కువ కన్ఫిగరేషన్ లో గూగుల్ ఆప్స్, గూగుల్ మప్స్, జిమెయిల్, యూట్యుబ్ వంటి ఆప్స్ త్వరగా లోడ్ అవుతాయి. ఈ ఆప్స్ కి బదులుగా అసిస్టెంట్  గో , మప్స్ గో, జిమెయిల్ గో , యూట్యుబ్ గో ఆప్స్ ని అందుబాటులోకి తెచ్చింది. గూగుల్ ప్లే స్టోర్ కి బదులుగా  ఆండ్రాయిడ్ గో ని ప్రవేశపెట్టారు.

lava z50

Z50 మోడల్  హార్డువేర్ పరంగా చూస్తే దీనిలో ఎంట్రీ లెవెల్ – MT6737m ప్రాసెసర్, 1GB ర్యాం, ఇంటర్నల్ స్టోరేజ్ 8GB, డిస్ప్లే 4.5 ఇంచ్, 854X480 పిక్సెల్స్, 2.5D కోర్నింగ్ గొరిల్లా గ్లాస్ ఉన్నాయి.  దాదాపుగా రూ.3200 నుండి  రూ.5000 గా ఉండచ్చని అంచనా.  మార్చ్ 15న ఈ మొబైల్ మార్కెట్ లో లాంచ్ చేస్తున్నారు

ఈ మొబైల్ ఇతర ఆండ్రాయిడ్ ఓరియో వెర్షన్లతో పోలిస్తే చాల వేగంగా పనిచేస్తుందని అదే ఆండ్రాయిడ్ గో ప్రత్యేకత అని చెప్పవచ్చు.

(Visited 1 times, 1 visits today)