Home / Inspiring Stories / తల్లికి గుడి కట్టించిన లారెన్స్‌.

తల్లికి గుడి కట్టించిన లారెన్స్‌.

Author:

అమ్మ ప్రేమకి ఇంకేది సాటి రాదు అని ఒక్క మాటలో చెబితే సరిపోయేది కాదు అమ్మ ప్రేమ. అందుకే అమ్మ కోసం ఏకంగా ఓ గుడినే కట్టించేశారు ప్రముఖ కొరియోగ్రాఫర్ టర్న్‌డ్ యాక్టర్ కమ్ డైరెక్టర్ రాఘవ లారెన్స్. మూడేళ్లుగా నిర్మాణంలో వున్న అమ్మ గుడిని నిన్న (మే14) మదర్స్ డే సందర్భంగా ప్రారంభించారు లారెన్స్. ఈ సందర్భంగా లారెన్స్ తన తల్లి కన్మణితో తనకున్న అనుబంధాన్ని, అనేక వ్యక్తిగత విషయాలని పంచుకున్న లారెన్స్… ఈ ఆలయాన్ని మా అమ్మకే కాకుండా ప్రపంచంలోని అమ్మలు అందరికీ అంకితం చేస్తున్నాను అని అన్నారు. గుడి ప్రారంభోత్సవానికి వచ్చే ప్రతీ ఒక్కరూ తమ తల్లిని తోడు తీసుకు రావాలని కోరుతూ అడ్రస్ ను సోషల్ మీడియాలో పోస్టు చేశాడు.

lawrence

ఈ ఆలయాన్ని స్టంట్‌మాస్టర్‌ సూపర్‌ సుబ్బరాయన్‌ చేతుల మీదుగా ప్రారంభించారు. కెరీర్‌ ప్రారంభంలో కష్టాలో ఉన్న లారెన్స్‌ని సుబ్బరాయన్‌ మాస్టర్‌ ఆదుకున్నారు. ఆ అభిమానంతోనే తన తల్లికి గుడిని ఆయన చేతుల మీదుగా ప్రారంభించాలని నిర్ణయించారు. ఆ సందర్భంగా 1000 మంది మాతృమూర్తులకు చీరలు, ఆరుగురు మహిళారైతులకు సహాయం అందజేశారు లారెన్స్.

మా అమ్మ లేకపోతే నేనెప్పుడో చనిపోయి వుండేవాడిని. ఇవాళ ఈ స్థాయిలో వుండేవాడిని కాదు. నా చిన్నప్పుడే నాకు ట్యూమర్ వచ్చింది. అప్పుడు మా అమ్మ అనుక్షణం నా వెన్నంటే వుండి నన్ను కాపాడింది. ఆ తర్వాత కాంచన సినిమా షూటింగ్ టైమ్‌లోనూ మెడ నొప్పితో ఆస్పత్రిపాలైనప్పుడు కూడా మళ్లీ అంతే కేర్ తీసుకుంది.

అప్పుడు నా కోసం మా అమ్మ పడిన తపన చూస్తే, నా చిన్నప్పుడు నా కోసం ఆమె పడిన ఆవేదన నా కళ్లముందు మెదిలింది. అలా ఆస్పత్రి బెడ్‌పై పడుకున్నప్పుడే అనుకున్నాను… మా అమ్మ కోసం ఓ గుడి కట్టాలని. అమ్మ విగ్రహంలో జీవం ఉట్టిపడేలా వుండాలనుకున్నాను. అందుకోసమే ఇంత టైమ్ తీసుకున్నాను. అంతేకాకుండా గాయత్రి దేవి మార్బుల్ విగ్రహాన్ని సైతం ఇంపోర్ట్ చేసుకుని ఇదే గుడిలో ప్రతిష్టించాను అని తెలిపారు లారెన్స్.

(Visited 309 times, 1 visits today)