Home / Inspiring Stories / స్వాతంత్రం కావాలంటే కాశ్మీర్ ని వదిలి వెళ్లిపోండి, కాశ్మీర్ మాదే…!

స్వాతంత్రం కావాలంటే కాశ్మీర్ ని వదిలి వెళ్లిపోండి, కాశ్మీర్ మాదే…!

Author:

శ్రీనగర్‌లో ఎలక్షన్ డ్యూటీ ముగించుకుని తిరిగి వస్తున్న సీఆర్‌పిఎఫ్ జవాన్లపై కొంతమంది యువత దాడి చేసిన సంగతి తెలిసిందే. చేత్తో, కాళ్లతో ఇష్టమొచ్చిన విధంగా తన్నినా, తిట్టినా జవాన్లు మాత్రం ఏమీ స్పందించకుడా తమ సామాన్లు, చేతిలో ఉన్న గన్స్‌తో అలానే నడుచుకుంటూ వెళ్లిపోయారు. అయితే ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యింది. ఈ వీడియోపై క్రికెటర్ గంభీర్ స్పందించాడు, రాళ్ళు విసురుతూ అల్లర్లు సృష్టిస్తున్నవారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. ‘కశ్మీరు మాదే’నన్నాడు. ‘స్వాతంత్ర్యం కావాలనుకునేవారు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి’ అని హెచ్చరించాడు.

leave now kashmir is ours gambhir

భారతదేశ జాతీయ జెండాలోని మూడు రంగులకు వినూత్న అర్థాన్ని వివరించాడు. కాషాయం ఆగ్రహ జ్వాలను సూచిస్తుందని పేర్కొన్నాడు. జీహాదీల శవాలపై కప్పే బట్టకు తెలుపు రంగు సంకేతంగా నిలుస్తుందని తెలిపాడు. ఉగ్రవాదంపై విద్వేషాన్ని ఆకుపచ్చ రంగు తెలియజేస్తుందని వివరించాడు. భారతదేశ సైనిక జవానును కొట్టే ఒక్కొక్క దెబ్బకు కనీసం 100 మంది జీహాదీల ప్రాణాలు గాలిలో కలిసిపోతాయని హెచ్చరించాడు. స్వాతంత్ర్యం కావాలనుకునే వారు వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోండని హెచ్చరించాడు. కాశ్మీరు భారతదేశానిదేనని స్పష్టం చేశాడు.

సోషల్ మీడియాలో వైరల్ మారిన ఈ వీడియోపై సెహ్వాగ్ కూడా స్పందించాడు, దేశాన్ని కాపాడుతున్న జవాన్లకు ఇలా జరగకూడదని ఈ అల్లరి మూకను అడ్డుకోవాలని చెప్పాడు.

(Visited 9,734 times, 1 visits today)