Home / Entertainment / రికార్డులు తిరగరాసిన లెజెండ్.

రికార్డులు తిరగరాసిన లెజెండ్.

Author:

యువరత్న నందమూరి బాలకృష్ణ ఒక కొత్త రికార్డు నెలకొల్పాడు.. ఇంతవరకు ఏ తెలుగు సినిమా సాధించని ఫీట్ లెజెండ్ సినిమాతో సాధించాడు. దక్షిణాదిన ఇంత వరకూ అత్యధిక కాలం పాటు రన్ అయిన సినిమాగా లెజెండ్ సినిమా నిలిచింది. ప్రొద్దుటూరులోని అర్చన హాల్ లో బాలకృష్ణ సినిమా ‘లెజెండ్’ వరుసగా 950 రోజులు పూర్తి చేసుకుని అరుదైన రికార్డు ని సొంతం చేసుకుంది, దక్షిణాది భాషల్లో ఇన్ని రోజుల పాటు ఆడిన సినిమా ప్రస్తుతానికి ఇదే.

legend-movie-completes-1000days

ఇంతకుముందు రజనీ సినిమా 891 రోజులు వరుసగా ఆడి రికార్డు క్రీయెట్ చేయగా ఇప్పుడు ఆ రికార్డును బాలయ్య అధిగమించాడు. ఇలా ఎక్కువ రోజులు ఆడినా సినిమాలు బాలీవుడ్ లో చాలా ఉన్నాయి కాని మనకు మాత్రం కొత్తే.. షారుఖ్ ఖాన్ సినిమా దిల్వాలే దుళానియా లే జాయెంగే ఏకంగా 20 సంవత్సరాలు ఒక హాల్ లో ఆడింది.

(Visited 220 times, 1 visits today)