Home / Inspiring Stories / ఈరోజు భారతదేశాన్ని సమైక్య దేశంగా మార్చిన ఉక్కు మనిషి జన్మదినం.

ఈరోజు భారతదేశాన్ని సమైక్య దేశంగా మార్చిన ఉక్కు మనిషి జన్మదినం.

Author:

unknown facts about Sardar vallabai patel2

ఈ రోజు భారత దేశ ఉక్కుమనిషి పుట్టిన రోజు అసలు ఒక దేశం అంటే ఎలా ఉండాలో నేర్పిన సర్దార్ నాయకత్వం లో నే తెలిసింది.భారత దేశాన్ని అవిభక్తంగా ఉంచటానికి ఎంతో తపనపడిన పటేల్ ని మన చరిత్ర పుస్తకాలూ, ప్రభుత్వాలూ పట్టించుకోనే లేదు..మన దేశ మొదటి హోం మంత్రి సర్దార్ వల్లాభాయ్ పటేల్ పుట్టిన రోజు సంధర్బంగా ఆయన గురించిన కొన్ని విశయాలు

1.సర్దార్ జన్మించింది ఒక రైతు కుటుంబం లో చిన్నప్పటినుంచే తండ్రితో పాటు పొలాల్లో తిరిగే వాడు కొన్ని సార్లు తండ్రి రోజంతా ఏమీ తినకుండా ఉండటం చూసేవాడు,ఆకలి తో ఉండటం అనుభవం లోకి వచ్చింది భవిశత్తులో ఆ పోల్లల అనుభవాలే అతని,పట్టుదలనీ శరీర ధారుఢ్యాన్నీ పెంచి ఉక్కు శరీరాన్నిచ్చాయి…

Unknown facts about Sardar Vallabai Patel1

2.1930 లో గుజరాత్ మొత్తాన్నీ ప్లేగ్ వ్యాది వణికించింది.కొన్ని వందల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. సర్దార్ ప్లేగు వ్యాది వచ్చిన స్నేహితుని కోసం నడియాడ్ బయల్దేరాడు. ఆయనకీ అదే వ్యాది సోకే అవకాశం ఉందని ఎందరు చెప్పినా వినలేదు. తన మిత్రుడు కోలుకునే వరకూ ఒక పాడుపడిన గుళ్ళో ఉంటూ అతనికి సేవలు చేసాడు…

unknown facts about Sardar vallabai patel2

3.1909 లో ఒక కోర్టు లో ఆయన ఒక సాక్షి గా హాజరయ్యారు.ఆ రోజే సర్ధార్ సతీమణికి ఆపరేషన్ జరుగుతోంది. విచారణ మధ్యలోనే ఆపరేషన్ ఫేయిల్ అయి ఆమె మరణించారన్న వార్త పటేల్ కి అందింది. ఐతే ఆ సంగతి కోర్టు ఐపోయే వరకూ ఎవరికీ చెప్పలేది,విచారణ మధ్యలో ఆపనూ లేదు… ఒక పనికి ఆయన ఇచ్చే విలువ అది…

unknown facts about Sardar vallabai patel3

4.గాంధీ జీ తో పటేల్ కి చాలా సాన్నిహిత్యం ఉండేది మహాత్ముదంటే ఆయనకి అత్యంత అభిమానం కూడా.. గాందీ మరణం ఆయనని విపరీతంగా కుంగదీసింది…చివరి వరకూ ఆయన అదే విషాదం లో గడిపారు.గాంధీ మరణాన్ని సర్దార్ జీర్ణించుకోలేక పోయేవారు

unknown facts about Sardar vallabai patel4

5.గాంధీకి అత్యంత సన్నిహితుడని నెహ్రూ కి ఎంతో పేరున్నా 1946 లో కాంగ్రేస్ అధ్యక్షుడిగా ఎవరూ నెహ్రూ పేరుని సూచించలేదు అబ్దరూ కోరుకున్నది పటేల్ నె.. అత్యధికులు ప్రతిపాదించిన పేరు సర్దార్ వల్లాభాయ్ పటేల్నే. ఐతే తాను ఎవరి కిందా పనిచేయనని భీష్మించుకున్నారు నెహ్రూ. అప్పుడు గంధీ అభ్యర్థన మేరకు ఆయన పై ఉన్న అభిమానం తో తన అభ్యర్థిత్వాన్ని ఉపసమ్హరించుకున్నారు..

unknown facts about Sardar vallabai patel5

6.1950 లోనే ప్రధాని నెహ్రూకి చైనా తో ఉత్తరభారతానికి ఉన్న ముప్పుని వివరిస్తూ ఒక ఉత్త్రం రాసారు. అప్పుడా ఉత్తరాన్ని పట్టించుకోని ప్రధానికి 1962 లో చైనాతో జరిగిన యుద్దపు చేదు అనుభవాలతో పదేళ్ళ తరవాత సర్దార్ అంటే ఏమిటో అర్థమైయింది..

unknown facts about Sardar vallabai patel6

7.మహాత్ముని మైనారిటీ ధోరనిని ద్వేషించీ ఆయన మరణానికి కారణ మైన ఆర్ ఎస్సెస్ ని నిషేదించటానికీ ప్రయత్నించారు. 1948 లో అప్పటి ఆరెస్సెస్ నాయకుదైన ంశ్ గోవాల్కర్ కి రాసిన ఉత్తరం లో” వాళ్ళ (ఆరెస్సెస్ నాయకుల) ఉపన్యాసాలన్నీ మత విద్వేషం తో నిండి పోయాయి” అని పేర్కొన్నారు. గాంధీ హత్య జరిగాక శిబిరాల్లో స్వీట్లు పంచుకోవటాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు…

unknown facts about Sardar vallabai patel7

ఎందుకో గానీ ఏ రాజకీయ కారణాల కోసమో ఎవరి ప్రయోజనాల కోసమొ సర్దార్ ని ఇప్పటికీ భారత ప్రభుత్వాలు చిన్న చూపే చూసాయి,ఇప్పుదు ఆయనని మళ్ళీ రాజకీయ లబ్ది కోసం ఒక మతానికి ప్రతినిధి గా చిత్రించే కుట్రలూ మొదలయ్యాయి… ఆ ఉక్కుమనిషి ఎప్పటికీ మచ్చలేని మనిషి గా మిగాలాలని కోరుకుంటూ ఆయన జయంతి సంధర్బంగా శుభాకాంక్షలు…

(Visited 966 times, 1 visits today)