Home / User Stories / ఈ టీవీ ఉంటే మీ ఇంట్లోకి దోమలు రావు.

ఈ టీవీ ఉంటే మీ ఇంట్లోకి దోమలు రావు.

Author:

మాములుగా దోమలు ఇంట్లో నుండి పోవలాంటే ఏం చెయ్యాలి అంటే దోమల బత్తి కాని లేద ఏదైన మస్కిటో కాయిల్ గాని, లేదా అల్ అవుట్ ని ఆన్ చెయ్యాలి. కానీ ఇప్పుడు మీరు టీవి ఆన్ చేస్తే సరిపోతుంది అంటున్నారు ప్రముఖ ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తి సంస్థ ఎల్ జీ. ఇది వినటానికి కొద్దిగా వింతగా ఉన్న నమ్మవలసిందే అంటున్నారు కంపెనీ  వారు. మస్కిటో ఎవే టీవీ పేరిట మార్కెట్లోకి తీసుకొచ్చిన ఈ టీవీని ఆన్ చేస్తే.. టీవీ చెంతకు దోమలు రానే రావట. ఈ టీవి ఇప్పుడు పలువురి దృష్టిని విపరీతంగా ఆకర్షిస్తోంది. ఇప్పటికే మన దేశీయ మార్కేట్ లో విడుదల చేసిన కంపెనీ  వారు.

Masquito away tv

భారతీయ వినియోగదారుల అభిరుచిని దృష్టిలో పెట్టుకొని తాజా టీవీని తయారు చేసినట్లుగా ఉత్పత్తిదారులు చెబుతున్నారు.  ఈ టీవిలో విశేషం  గురించి చెబుతూ… ఈ టీవీలో ఏర్పాటు చేసిన అల్ట్రాసోనిక్ పరికరాన్ని ఒకసారి యాక్టివేట్చేస్తే.. సౌండ్ వేవ్ టెక్నాలజీ పని చేస్తుందని.. దీంతో.. దోమలు చెంతకురాకుండా పారిపోతాయని చెబుతున్నారు.ఈ టీవి ధర దాదాపు రూ.30 వేలకు కాస్త తక్కువగా.. రూ.47వేలకు కాస్త ఎక్కువగా ఉంటాయని తెలుస్తోంది.దోమల్ని తరిమేసే ఈ టివి కారణంగా ఏలాంటి హాని జరుగదని, అలాగే ఎలాంటి హానికార రేడియేషన్లను విడుదల చేయదని దీని ఉత్పత్తిదారులు చెబుతున్నారు.

(Visited 1,890 times, 1 visits today)