Home / Reviews / లోఫర్ సినిమా రివ్యూ & రేటింగ్.

లోఫర్ సినిమా రివ్యూ & రేటింగ్.

loafer review and rating

‘ముకుంద’ సినిమాతో హీరోగా పరిచయమై ఈ ఏడాది కంచె’ అనే సినిమాతో నటుడిగా తనకి తాను గుర్తింపు తెచ్చుకున్న మెగా హీరో వరుణ్ తేజ్ మూడవ ప్రయత్నంగా ట్రై చేసిన మాస్ మసాలా ఎంటర్టైనర్ ‘లోఫర్’. ఇడియట్, పోకిరి లాంటి తిట్లనే టైటిళ్లుగా పెట్టి సెన్సేషనల్ హిట్లు కొట్టిన పూరి జగన్నాధ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ద్వారా దిశా పటానిని హీరోయిన్ గా పరిచయం చేసారు. వరల్డ్ వైడ్ గా ఈ రోజు రిలీజ్ అయిన ఈ సినిమా ఎలా ఉంది? వరుణ్ తేజ్ మాస్ హీరోగా ఎలా చేసాడు? అనే విషయాలను ఇప్పుడు చూద్దాం.

కథ :

కోటీశ్వరురాలైన లక్ష్మీదేవి (రేవతి ) ని ప్రేమిస్తాడు మురళి ( పోసాని ) ప్రేమ కోసం కోట్ల ఆస్తిని కాదనుకొని వస్తుంది కానీ ,వచ్చిన తర్వాతే తెలుస్తుంది తను ప్రేమించింది ఒక పెద్ద లోఫర్ ని అని దాంతో ఇద్దరి మద్య వివాదం జరగడంతో కొడుకు రాజా (వరుణ్ తేజ్ ) ని తనకంటే పెద్ద లోఫర్ ని చేయాలనీ భావించి కసితో అక్కడి నుండి జోద్ పూర్ తీసుకు వెళతాడు . తల్లి పచ్చ కామెర్లతో చనిపోయిందని అబద్దాలు చెప్పి నిజంగానే కొడుకుని పెద్ద లోఫర్ ని చేస్తాడు మురళి . ఇక అదే సమయంలో ఇంటి నుండి పారిపోయి జోద్ పూర్ కు వస్తుంది పారిజాతం (దిశా పటాని ). జోద్ పూర్ లో అడుగు పెట్టగానే లోఫర్లైన తండ్రి కొడుకులు ఒకరు సెల్ ఫోన్ కొట్టేస్తే మరొకరు బ్యాగ్ కొట్టేస్తారు .ఆ తర్వాత అదే పారిజాతం తో లవ్ లో పడతాడు రాజా కానీ సడెన్ గా పారిజాతం కు సంబందించిన వాళ్ళు జోద్ పూర్ వచ్చి పారిజాతం ని తీసుకెలుతుండగా పారిజాతం మేనత్త ని చూసి షాక్ అవుతాడు రాజా . అసలు పారిజాతం మేనత్త ఎవరు ? ఆమెకు రాజా కు సంబంధం ఏంటి ? తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

అలజడి విశ్లేషణ:

పూరి జగన్నాధ్ సినిమా అనగానే ప్రేక్షకులు మూడు విషయాలు ఆశిస్తారు.. అవి ఆడియన్స్ కి ఇట్టే కనెక్ట్ అయీపొయే హీరో మాస్ క్యారెక్టరైజేషణ్, మాస్ డైలాగ్స్ మరియు యాక్షన్ ఎపిసోడ్స్. వారు ఆశించే ఆ మూడు అంశాలే ఈ సినిమాకి ప్రధాన హైలైట్స్. ఈ సినిమాలో పూరి వీటితో పాటు సెంటిమెంట్ ని కూడా బాగానే దట్టించాడు. సెకండాఫ్ లో వర్కౌట్ అయిన కొన్ని ఎమోషనల్ సీన్స్ సినిమాలో అదనపు బోనస్ కింద చెప్పుకోవాలి. హీరో ఇంట్రడక్షన్ నుంచే వరుణ్ పాత్రకి ఆడియన్స్ బాగా కనెక్ట్ అవ్వడంతో సినిమా అలా అలా సాగిపోతుంది. ఆడియన్స్ కి ఇంటర్వల్ బ్లాక్ మంచి కిక్ ఇస్తే, సెకండాఫ్ లో వచ్చే కొన్ని మదర్ సెంటిమెంట్ సీన్స్ ఆడియన్స్ మనసుకు హత్తుకునేలా ఉన్నాయి.

లోఫర్ ట్రైలర్ చూడగానే అందరికీ పూరి పాత సినిమాలే గుర్తుకొచ్చాయి. ముఖ్యంగా ‘ఏక్ నిరంజన్’ ఛాయలు కొట్టొచ్చినట్లు కనిపించాయి. ఐతే సినిమాలో ఇంకేదైనా మ్యాజిక్ చేసి ఉంటాడులే అనుకుంటే నిరాశ తప్పలేదు. “అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి”లో తరహాలో ‘అమ్మ సెంటిమెంటు’ను దట్టించే ప్రయత్నం కూడా చేశాడు. అటు పూరి బలమైన హీరో క్యారెక్టరైజేషనూ పెద్దగా వర్కవుట్ కాక.. ఇటు సినిమాకు ప్రధాన బలమవతుందని పూరి చెప్పిన అమ్మ సెంటిమెంటూ ఓ మాదిరిగా ఉంది. ‘లోఫర్’ మామూలు సినిమాగా మిగిలిపోయింది.

వరుణ్ తేజ్ కి పుల్ మాస్ ధోరణిలో సాగే పాత్ర చేయడం కొత్తయినప్పటికీ చాలా అంటే చాలా బాగా చేసాడని చెప్పాలి. మెయిన్ గా పూరి మార్క్ డైలాగ్స్ ని డెలివర్ చేయడంలో, హీరో పాత్రలో మానరిజమ్స్ ని చూపించడంలో సూపర్బ్ అనిపించుకున్నాడు. పూరి కూడా వరుణ్ తేజ్ లోని మాస్ యాంగిల్ ని పర్ఫెక్ట్ గా తెరపై స్క్రీన్ పై చూపించి వరుణ్ ని ఆడియన్స్ కి మరింత దగ్గర చేసాడు. మొదటి రెండు సినిమాలతో పోల్చుకుంటే ఇది వరుణ్ తేజ్ ఏనా అని చాలా మంది షాక్ అయ్యేలా వరుణ్ తేజ్ వేరియేషణ్ చూపించాడు.

ఇక తన తల్లిని వెతుక్కుంటూ విలన్ ఊరికిి వచ్చే హీరో నేరుగా వాళ్ల పని పట్టకుండా మధ్యలో డ్రామాలాడ్డం సినిమాను సాగదీయడంలో భాగంగానే అనిపిస్తుంది. హీరో తన తల్లికి నిజం చెప్పకపోవడంలోనూ లాజిక్ కనిపించదు. నిజానికి కథనంలో మ్యాజిక్ ఉంటే.. ఈ లాజిక్కులన్నీ గుర్తుకు రావు. ఆ మ్యాజిక్ మిస్సవడంలోనే సమస్య అంతా. కథనం ఎటు పోతోందో అర్థం కాకుండా ఇష్టానుసారం వెళ్తుండటంతోనే ప్రేక్షకుడికి ఈ లాజిక్కులన్నీ గుర్తుకొస్తాయి.

ఇక హీరోయిన్ దిశా పటాని నార్త్ ఇండియన్ బ్యూటీ అయినా డైలాగ్ డెలివరీ మరియు హావ భావాల విషయంలో ది బెస్ట్ అనిపించుకుంది. ఇక గ్లామర్ పరంగా అయితే మోడ్రన్ లుక్ లో కనిపిస్తూ, తన అందాలతో ఆకట్టుకుంది. ముఖ్యంగా ‘జియా జలే’ సాంగ్ లో తడిసిన బట్టల్లో దిశాని చూపిన విధానం గ్లామర్ ట్రీట్ అని చెప్పాలి. పక్కా లోఫర్ పాత్రలో పోసాని కృష్ణమురళి మెప్పించాడు. ముఖ్యంగా పూరి మార్క్ సెటైరికల్ డైలాగ్స్ పోసాని చెప్పిన తీరు సూపర్. ఇక రేవతి మదర్ గా సినిమాకి ప్రాణం పోశారు. ముఖ్యంగా వరుణ్ – రేవతి కాంబినేషన్ లో వచ్చే ఎమోషనల్ సీన్స్ మాత్రం అందరినీ టచ్ చేస్తాయి. ఇక విలన్ గా ముఖేష్ ఋషి,చరణ్ దీప్, శాండీలు మంచి పోటీని ఇచ్చారు. బ్రహ్మానందం, అలీ, సప్తగిరి, ధనరాజ్ లు ఓ నాలుగు సీన్స్ లో నవ్వించే ప్రయత్నం చేసారు.

ఈ సినిమాలో మదర్ సెంటిమెంట్ సీన్స్ అనేవి మెయిన్ పాయింట్ అయితే మిగతా అంతా తన రొటీన్ ఫ్లేవర్ లోనే ఉంటుంది. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ అయితే పూరి చాలా సినిమాల మాదిరిగానే ఉంటుంది. అదీ కాక ఫస్ట్ హాఫ్ లో ఎంటర్టైన్మెంట్ కూడా పెద్దగా లేదు. సినిమాలో ఎక్కువ భాగం సందర్భానుసారంగా వచ్చే కామెడీని రన్ చేయాలని చూసాడు, అది కొన్ని చోట్ల మాత్రమే హిట్ అయ్యింది, చాలా చోట్ల ఫెయిల్ అయ్యింది.

వీటన్నికంటే మించి పూరి చేసిన మెయిన్ మిస్టేక్ సినిమా మొదటి సీన్ లోనే కథ మొత్తాన్ని చెప్పేయడం, అలాగే స్క్రీన్ ప్లే కూడా ఎలా మొదలై ఎలా ఎండ్ అవుతుంది అనేది చెప్పెయడమే. ఇక సెకండాఫ్ లో ఎక్కువ భాగం సెంటిమెంట్ మీదకి కథ టర్న్ అవుతుంది, దాంతో సెకండాఫ్ ని మొదలు పెట్టడం బాగున్నా, ఓ 20 నిమిశాలా తర్వాత ఫ్లో మొత్తం పడిపోతుంది. అలాగే సెకండాఫ్ లో ఎంటర్టైన్మెంట్ అనేది అస్సలు ఉండదు. చెప్పాల్సిన పాయింట్ ఏమీ లేకపోవడం వలన, ఎమోషనల్ కంటెంట్ ఎక్కువ అవడం వలన సెకండాఫ్ కాస్త సాగదీసినట్టు అనిపిస్తుంది. సినిమా స్లోగా ఉండడంతో ఆ ఫ్లోని అడ్డంగా కట్ చేసి క్లైమాక్స్ లోకి వచ్చేసినట్టు అనిపిస్తుంది.

కథకు ఎంతో కీలకమైన హీరోయిన్ నేపథ్యమే అసహజంగా అనిపిస్తుంది. మైనింగ్ యజమాని ఆస్తిని కొట్టేయడానికి విలన్ అతడికి తన కూతుర్నిచ్చి పెళ్లి చేయాలనుకోవడం.. అడ్డం వచ్చిన భార్యను చంపేయడం..మరికొన్ని హత్యలు చేయడం ఇవన్నీ అతకనట్లుగా అనిపిస్తాయి. తీరా చూస్తే ఆ మైనింగ్ యజమాని పెద్ద కామెడీ పీస్. అదేదో నేరుగా అతణ్నే బెదిరించేసి అతడి ఆస్తి లాక్కుంటే సరిపోయేదిగా.

నటీనటుల ప్రతిభ:

వరుణ్ తేజ్ :వరుణ్ తేజ్ కి పుల్ మాస్ ధోరణిలో సాగే పాత్ర చేయడం కొత్తయినప్పటికీ చాలా అంటే చాలా బాగా చేసాడని చెప్పాలి. మెయిన్ గా పూరి మార్క్ డైలాగ్స్ ని డెలివర్ చేయడంలో, హీరో పాత్రలో మానరిజమ్స్ ని చూపించడంలో సూపర్బ్ అనిపించుకున్నాడు.

దిశా పటాని : అందంగా ఉంది. గ్లామర్ వల బాగానే విసిరింది. నీ వాలు కళ్లల్లో పాటలో ఆమె అందాల్ని బాగా ఎలివేట్ చేశాడు పూరి. ఈ పాట చూస్తే గ్లామర్ హీరోయిన్ గా దిశాకు మంచి ఫ్యూచర్ ఉందని అర్థమైపోతుంది.

రేవతి : రేవతి పాత్ర అనుకున్న స్థాయిలో లేదు కానీ.. నటన పరంగా నిరాశ పరచలేదు. తల్లి బాధ గురించి చెప్పే సీన్లో ఆమె నటన సూపర్బ్.

పోసాని: ముఖ్యంగా పూరి మార్క్ సెటైరికల్ డైలాగ్స్ పోసాని చెప్పిన తీరు సూపర్. పోసాని తనదైన శైలిలో నవ్వించాడు. సినిమాలో అందరికంటే ఎక్కువ ఎంటర్టైన్ చేసింది అతనే.

ఆలీ ‘తమ్ముడు’ స్ఫూఫ్ లో కొంత నవ్వించాడు. బ్రహ్మానందంది ఇలా మెరిసి అలా మాయమయ్యే క్యారెక్టర్. చెప్పుకోవడానికేమీ లేదు. ఇక విలన్ గా ముఖేష్ ఋషి,చరణ్ దీప్, శాండీలు మంచి పోటీని ఇచ్చారు.సప్తగిరి, ధనరాజ్ లు ఓ నాలుగు సీన్స్ లో నవ్వించే ప్రయత్నం చేసారు.

సాంకేతిక వర్గం పనితీరు:

పూరి జగన్నాధ్ కి హెల్ప్ అయిన టెక్నికల్ డిపార్ట్ మెంట్స్ చాలానే ఉన్నాయి.ఇక ఎప్పటిలానే కథ – స్క్రీన్ ప్లే – మాటలు – దర్శకత్వం విభాగాలను పూరి జగన్నాధ్ డీల్ చేసాడు. కథలో ఓ కొత్తదనం లేకపోయినా పాత్రలని కొత్తగా చూపించడంలో ఎమోషనల్ సీన్స్ రాసుకోవడంలో పూరి సక్సెస్ అయ్యాడు. స్క్రీన్ ప్లే ఏమాత్రం ఆసక్తికరంగా లేదు. ఎప్పటిలానే డైలాగ్స్ మాత్రం పూరి గన్ నుంచి పేలిన తూటాల్లా పేలాయి. చాలా చోట్ల అర్థం లేని సన్నివేశాలతో బండి లాగించేయాలని చూశాడు. పూరి పెన్ పవర్ తల్లి బాధ చెప్పే సన్నివేశంలో కనిపిస్తుంది. పోసానికి రాసిన డైలాగులు కూడా బావున్నాయి. ఆడోళ్లను డైనోసర్లు అంటూ పెట్టిన పోలిక పూరి మార్కును తెలియజేస్తుంది. మొదటి సీన్ లో సినిమా కంటెంట్ మొత్తాన్ని చెప్పేయడం సినిమాకి మైనస్. అదీకాక సినిమాలో ఎంటర్టైన్మెంట్ లేదు. ముందుగా పిజి విందా జోద్ పూర్, రాజస్థాన్ లొకేషన్స్ ని చాలా చాలా బాగా చూపించాడు. అలాగే మన తెలుగు ఆడియన్స్ కి ఆ లొకేషన్స్ కొత్త కావడం వలన విజువల్స్ చాలా ఫ్రెష్ ఫీల్ ని ఇస్తాయి.

ఇక సునీల్ కశ్యప్ అందించిన పాటలు మాస్ ఆడియన్స్ వరకూ ఓకే పిక్చరైజేషన్ కూడా వారిని ఆకట్టుకునేలా ఉంది. ఇక సునీల్ కశ్యప్ అందించిన నేపధ్య సంగీతం మాత్రం సినిమాకి చాలా పెద్ద ప్లస్ అయ్యిందని చెప్పాలి. హీరో ఎలివేషన్ మరియు సెంటిమెంట్ సీన్స్ లో రీ రికార్డింగ్ అదిరింది. విఠల్‌ కోసనం ఆర్ట్ వర్క్ చాలా బాగుంది. ఎస్ఆర్ శేఖర్ తనకిచ్చిన పార్ట్ ని ఉన్నంతలో బాగానే చేసాడు, కానీ కథ, చెప్పిన విధానం రెగ్యులర్ గా ఉండడం వలన అక్కడక్కడా సాగాదీత కనిపిస్తుంది. విజయ్ యాక్షన్ ఎపిసోడ్స్ డీసెంట్ అనిపిస్తాయి. కానీ పొలం ఫైట్ సీన్ మాత్రం సూపర్బ్.

ప్లస్ పాయింట్స్:

  • వరుణ్ ,పోసాని, రేవతి నటన.
  • సినిమాటోగ్రఫీ
  • ఇంటర్వల్ బ్లాక్

మైనస్ పాయింట్స్:

  • కథ
  • ఫస్ట్ హాఫ్
  • స్క్రీన్ ప్లే
  • సాగదీసినట్టుండే సెకండాఫ్

                                           పంచ్ లైన్ : పూరి లోఫర్ అయ్యిండు వరుణ్ తేజ్ మాస్ హీరో అయ్యిండు.

(Visited 300 times, 1 visits today)
[fbcomments url="http://peadig.com/wordpress-plugins/facebook-comments/" width="100%" count="off" num="3" countmsg="wonderful comments!"]