Home / Inspiring Stories / శివాలయాన్ని కట్టించిన ముస్లిం ఆదర్శవాది

శివాలయాన్ని కట్టించిన ముస్లిం ఆదర్శవాది

Author:

lord shiva temple by muslim

మతం అంటే ఏమిటి. మతాన్ని కనిపెట్టింది ఎవరు. మనమంతా మనుషులం. మానవత్వమే మన మతం. ఇది ఇప్పుడు మనం ప్రపంచానికి చాటవలసిన విషయం. అలాగే “మంచి చెడ్డలు రెండే మతములు” అనే సూక్తికి తిరుగు లేదు. మంచి ఏ మతంలో వున్నా స్వీకరించుదాం, చెడు ఏ మతంలో వున్నా తిరస్కరించుదాం, అనే విషయాన్ని తూచా తప్పకుండ పాటిస్తున్నాడు ఒక ఆదర్శవాది. ఎందుకంటే మతం పేరు చెప్పుకొని   చంపుకునే వారు, మా  మతమే గొప్ప అని చాతి చూపించేవారు ఇతడిని చూసి కొంతైన నేర్చుకోవాలి. ఇంతకు అతడు చేసిన అంత మంచి పని ఏంటి అనే కద! ఒక సారి మీరు చూడండి….

అతని పేరు కబీర్ ఖాన్ రాజస్థాన్‌లోని టోంక్ పట్టణంలో ఓ ముస్లిం. ఇతడు తన సొంత డబ్బులతో శివాలయాన్ని కట్టించాడు. ప్రజల మధ్య మత కలహాలు ఉండకూడదంటున్న 39 సంవత్సరాల కబీర్ ఖాన్ ఆలయ నిర్మాణంతో మత సామరస్యాన్ని చాటిచెప్పాడు. ఈ గుడిని స్థానిక ప్రజలకు అంకితం చేశాడతను. ఈ ఆలయ నిర్మాణంతో తానొక సందేశం ఇవ్వాలనుకుంటున్నానని, అల్లా అన్నా రామ్ అన్నా ఒకటేనని చెప్పాడు కబీర్. ఈ దేశంలో పుట్టటమే ఏ మతస్థుడికైనా ఎన్నోజన్మల పుణ్యఫలం. జీనా యహా, మర్నా యహా, ఇస్కేసివా జానా కహా’ అంటూ అజాత శత్రువుల్లా బ్రతకాలి. మన మతంతో పాటు ఇతరుల మతాలను కూడా గౌరవించాలి. వ్యక్తులు చేసే పనులకు మతాన్ని నిందించకూడదు. ఈ అవకాశం తనకొచ్చినందుకు సంతోషంగా ఉందంటున్నాడు కబీర్ ఖాన్.

(Visited 396 times, 1 visits today)