Home / Inspiring Stories / సినిమా స్టోరీని తలపించేలా 438 రోజులు సముద్రంలో ఒంటరిగా ఉన్నాడు.

సినిమా స్టోరీని తలపించేలా 438 రోజులు సముద్రంలో ఒంటరిగా ఉన్నాడు.

Author:

నిజజీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా కొన్ని సినిమాలు తీస్తుంటారు. సినిమాలో జరిగినట్టు నిజ జీవితంలో జరిగితే ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి…అది కూడా ఒకే ఒక వ్యక్తి సముద్రంలో సంవత్సరానికి పైగా ఉండవలసిన పరిస్థితి వస్తే ఆ ఊహే ఎంత భయంకరంగా ఉందొ కదా !….

lost-at-sea-the-man-who-disappeared-for-438-days

మాక్సికో లోని సాల్వడార్ ప్రాంతానికి చెందిన జాలరి అయిన జోన్ సాల్వడార్ ఆల్వరేంజా(36) సముద్రంలో చేపలు పడుతూ జీవిస్తుండేవాడు. అలా జీవిస్తున్న కాలంలో ఒకరోజు చేపల వేటకు వెళ్లే సమయంలో తన సహచరుడు జాలరి అయిన రే పెరేజే రాకపోవడంతో ఆలోచించి ఎలాగైనా చేపల వేటకు వెళ్ళాలి అని తన స్నేహితుడైన 22 ఏళ్ల కార్దోబా(పినాట)ను తన చేపల వేటకు తోడుగా తీసుకెళ్లాడు. చేపల వేటకు కావలసిన సామగ్రి… జీపీఎస్,రేడియో,మొబైల్, వైర్లెస్ సెట్, తినడానికి,తాగడానికి ఒక్క రోజుకి సరిపడా ఆహారం పట్టుకొని 2012 లో నవంబర్ 17 న సముద్రలోకి ప్రవేశించారు. వీరు సముద్రంలోకి వెళ్ళిన కొద్దీ సమయానికే భారీ తుఫాన్ వారి బోటును ఛిద్రం చేసింది. దానితో బోటు పూర్తిగా చెడిపోయి, బోటులో ఉన్న సామగ్రి మొత్తం సముద్రంలో పడిపోయాయి. ఇలాంటి ఒక భయంకరమైన సంఘటనలో ఎవరికైనా సమాచారం అందిద్దామన్న వారి దగ్గర ఎలాంటి అవకాశం లేదు. ఏదిక్కు లేనివారికి దేవుడే దిక్కు అన్నట్టు దేవుడి మీద భారం వేస్తూ బిక్కు బిక్కుమంటూ అదే బోటులో కూర్చున్నారు. ఆలా ఐదు రోజులు తుఫాన్ లోనే గడిపారు. తుఫాన్ తగ్గిందని సంతోషించేలోపే వారు ఉండే ప్రాంతం నుండి చాలా దూరం వెళ్లారని వారికి అర్ధం అయింది. ఇక వారికి బ్రతుకు మీద ఆశ రోజుకు రోజుకు సన్నగిల్లుతుంది…

బోటులో ఉన్న ఇద్దరు కచ్చితంగా చనిపోతాం అనుకుంటూ వారిలో వారే విచారంగా ఉంటున్నారు. ఇంతలో కార్దోబా ఆరోగ్యం సరిగాలేక బక్కచిక్కుతున్నాడు. ఈ ఆనారోగ్యానికి తోడు డయేరియా రావడంతో ఇంకా బక్క చిక్కియిపోయాడు. ఇదంతా చూస్తున్న ఆల్వరేంజా తన స్నేహితుడిని ఎలాగైనా బ్రతికించుకోవాలని తన చేతులతో చేపలను, సముద్ర పక్షులను, తాబేళ్లను పట్టి ఆహారంగా తినిపించేవాడు. వారికి తాగడానికి నీరు లేక ఇటు సముద్రం నీరు తాగలేక వారి మూత్రాన్ని వారే పట్టుకుని తాగేవారు….. బోటు ఎటుపోతుందో కూడా తెలియని పరిస్థితి వారిది. అలా కొద్దీ రోజుల తరువాత కార్దోబా చనిపోయాడు. ఇక బోటులో ఆల్వరేంజా ఒక్కేడే అయిపోయాడు. అయిన ఎదో ఒక తీరం దొరుకుతుంది అనుకోని చనిపోయిన స్నేహితుడి శవాన్ని ఆరు రోజులు బోటులోనే ఉంచుకున్నాడు కానీ ఎంతకీ తీరం అనేది కనిపించడంలేదు. ఒకవైపు శవం వాసన మరో వైపు దానిని ఎక్కడైనా పారేస్తే మళ్ళీ ఒక్కడే అవుతానని భాద ఆల్వరేంజా లో రోజు రోజుకు ఎక్కువ అవుతుంది. ఇక చేసేది ఏమిలేక తన స్నేహితుడిని శవాన్ని సముద్రంలో పడేసాడు.

lost-at-sea-the-man-who-disappeared-for-438-days

ఇక ఒంటరిగా తన ప్రయాణం మొదలైయింది. ఎన్నో ఆటుపోట్లు, ఎన్నో ఆకలి రోజులు అలా ఒంటరిగా 438 రోజులపాటు 6700 మైళ్లు ప్రయాణం చేసి చివరకు ఆ బోటు మార్షల్ ఐస్‌లాండ్ అనే దివికి చేరుకుంది. అన్ని రోజులు ప్రయాణం చేయడంతో వేసుకున్న బట్టలు కూడా చినిగిపోయి నగ్నంగా, ఆనారోగ్యంతో ఉన్న ఆల్వరేంజా ను చూసి స్థానికులు ఆసుపత్రిలో చేర్పించారు. కొద్దిగా కోలుకున్న తరువాత అతడిని అక్కడి అధికారులు మీడియా ముందుకు తీసుకొచ్చారు దానినితో కొన్ని రోజులు తనని వంటరిగా వదిలేయండి అని అడగటంతో అందరూ అక్కడి నుండి వెళ్లిపోయారు. కొన్ని రోజులు గడిచాక జరిగిన విషయం అంత మీడియాకు చెప్పడంతో, ఈ విషయం బయటి ప్రపంచానికి తెలిసింది.అన్ని రోజులు ఒక్కడే సముద్రంలో ఉండటం అనేది తన మానసిక స్థైర్యానికి మెచ్చుకోకుండా ఉండలేము. ఈ విచారకరమైన సంఘటనలో ఒక మంచి జరిగింది ఏమిటంటే సముద్రంలో ఎక్కువ రోజులు గడిపిన వ్యక్తిగా ఆల్వరేంజా రికార్డ్ సాధించడం….

(Visited 4,085 times, 1 visits today)