Home / Inspiring Stories / ఒక సారి చూడండి మీ పర్స్ లో అమ్మ ఫోటో ఉందా?

ఒక సారి చూడండి మీ పర్స్ లో అమ్మ ఫోటో ఉందా?

Author:

mother

నేను ఆఫీస్ కి వెళ్లే హడావుడి లోనే కిచెన్ లో ఉన్న మా అమ్మని చూసాను. ఆమె సగం గోరువెచ్చని నీళ్ళు నింపిన బకెట్ లో నిలబడి ఉంది. అప్పుడు గుర్తొచ్చింది నిన్నటినుండీ అమ్మకి విపరీతమైన కాళ్ళ నొప్పులు కానీ ఆమె తన పిల్లలని ఆకలితో ఉంచాలనుకోలేదు. మాకోసం పొద్దున్నే లేచి తన కాళ్ళ నొప్పుల గురించి కాకుండా మా ఆకలి గురించే ఆలోచించింది. ఎలా? ఎలా ఐతే నేను ఈమెరుణం తీర్చుకోగలను? అనిపించింది. డిల్లీ కి చెందిన రిజ్ వాన్ పొద్దున్నే కిచెన్ లో వాళ్ళ అమ్మని చూసి సోషల్ మీడియా లో షేర్ చేసుకున్న మాటలివి…నిజమే మనం వాళ్ళ ఋణం నిజంగా తీర్చుకోగలమా?

పొద్దున్న ఎనిమిదింటికి అమ్మ లంచ్ బాక్స్ ఇవ్వటానికి లేట్ అయినప్పుడు కోపం వస్తుంది కదా ఒక్కరోజు పొద్దున్నే నాలిగింటికి లేచి వంట పని చేసే అమ్మ పనిని చేసి చూస్తే ఆమె పడే కష్టం మనకేమైనా అర్థమవ్వొచ్చు. ఒకరోజని కాదు ప్రతీరోజూ ఆమె అదే పని చేస్తూనే ఉంటుంది.. ఆదివారాలలో ఆమె పని మరింత ఎక్కువ…. అమ్మకి సెలవులుండవా..!?

అమ్మ మనకి ఏదైనా పని చెప్పినప్పుడో లేదంటే ఏదైనా సలహా చెప్పినప్పుడో “నీకేం తెలీదు నువ్వుండు” అనేస్తాం. నిజమే మనం దేని గురించి ఆలోచిస్తున్నామో ఆ పని ఎలా చేయాలో ఆమెకి తెలియదు.. కానీ తన బిడ్డ పడే భాద మాత్రమే ఆమె చూస్తోంది. తనకేమీ తెలియక పోయినా ఏలాగో ఒక లాగా మనకు సహాయ పడి మన ధుఖాన్ని దూరం చేయాలనుకుంటోంది. అని గుర్థించలేమా!?

ఔను…! అమ్మలకి ఏదీ తెలియదు తన పిల్లల సంతోషం తప్ప. అమ్మకు “లవ్ యూ అమ్మా” అని చెప్పి ఎన్నిరోజులైందీ గుర్తుందా… చెప్పలేదని అమ్మ అలిగినట్టు ఎప్పుడైనా అనిపించిందా? అమ్మ అలిగితే మనం బతకగలమా…!? ఒక్క సారి గుర్తు తెచ్చుకోండి పసితనం లో జ్వరం వచ్చినపుడు “నాకు పనుందీ నువ్వే ఆటోలో హాస్పిటల్ కి వెళ్ళి వచ్చెయ్యి” అని డబ్బులు చేతిలో పెట్టి ఉంటే…!

మీరు మొదటి సారి ఉధ్యోగానికి వెళ్ళేటప్పుడు అమ్మ చూపు గుర్తుందా..? ఎంత మురిపెంగా చూసి ఉంటుందీ…! అదే మీరు లంచ్ లేటయిందనో, ఇష్టమైన షర్ట్ ఉతికి పెట్టలేదనో అరిచినప్పుడూ అమ్మ మొహం లోకి ంచూసారా..? పోనీ కిచెన్ లో మీకోసం వంట చేస్తున్నప్పుదు ఆమె చెయ్యి ఎన్ని సార్లు కాలి ఉంటుందో ఊహించగలరా… మీ ఆకలి తీరాలీ అంటే అమ్మ ఎన్ని సార్లు చేతిని కోసుకొనో కాల్చుకొనో ఉండి ఉంటుందీ…

చిన్నప్పుడు ఎపుడైనా కోపం లో మనల్ని కొట్టాక అమ్మ మన వైపు మొహం తిప్పకుండా మన వైపు చూడకుండా ఉన్నప్పుడు ఆమె ఏం చేసినట్టు… కొద్ది సేపటికి ఆమె కళ్ళు ఎందుకు ఎర్ర బడినట్టు ఎప్పుడైనా అనిపించిందా?

అమ్మ అలసిపోవటమూ పని చేయటమూ రెండూ ఒక సారే జరుగుతాయా…! అబ్బా వెన్ను నొప్పిగా ఉందీ, ఇవాళ జ్వరంగా ఉందీ అంటూనే పనులన్నీ చేసిపెట్టే అమ్మే లేకుంటే…!? మనసంగతేంటీ…!?

ఒక్క సారి పర్స్ తీసి చూడండి ఎవరి ఫొటో ఉందీ… దేవుడి ఫొటో..!? గర్ల్ ఫ్రండ్? భార్య? ఇంకా ఎవరైనా..? నాన్న అమ్మ ల ఫొటో…!? అమ్మ ఫొటో చూడండి (పర్స్ లో ఉంటే) అమ్మతో ఏమైనా చెప్పాలనిపిస్తోందా??? ఒక కాల్ చేయండీ.. అమ్మతో మాట్లాడండి… మీతో పాటు నన్నూ దీవించమని అడగండి….

(Visited 1,641 times, 1 visits today)