Home / Inspiring Stories / పులితో పోరాడి యజమాని ప్రాణాలు కాపాడిన కుక్క

పులితో పోరాడి యజమాని ప్రాణాలు కాపాడిన కుక్క

Author:

ఈ ప్రపంచంలో ఎన్నో జీవరాశులు ఉండగా ఒక కుక్కలకు మాత్రమే విశ్వాసానికి మారు పేరు అని ఎందుకు అన్నారో మారోసారి నిరుపించింది ఒక కుక్క. అది ఎక్కడో కాదు మన దేశంలోనే యూపీలోని బర్బత్ పూర్ లో జరిగిన సంఘటన ఇప్పుడు చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఎందుకో ఒక్క సారి మీరే చదవండి.

బర్బత్ పూర్ కు చెందిన గురుదేవ్ సింగ్ రాత్రి సమయంలో తన ఇంటి బయట మంచి నిద్రలో ఉన్నాడు. ఆయన పక్కనే తన పెంపుడు కుక్క జాకీ పడుకుంది. ఇంతలో ఆ గ్రామానికి దగ్గరలో ఉన్న దూడ్వా జాతీయ పార్కు నుంచి ఓ పులి అటువైపుగా వచ్చింది. ఇంటి బయట పడుకున్న గురుదేవ్ సింగ్ ని చూసి అది దగ్గరికి రాబొతుండగా కుక్క ఒక్కసారిగా గురుదేవ్ ని మేల్కొనే లాగా చేసి అతను పూర్తిగా అలర్ట్ అయ్యే వరకు జాకీనే పులిని అడ్డుకుంది.అలా చాలా సమయం పులితో పోరాడుతూ దగ్గరలోని అడవిలోకి పులిని తీసుకెళ్లింది జాకీ. ఇంతలో గురుదేవ్ సింగ్ ఈ విషయం నుండి తేరుకొని చుట్టుపక్కలవారిని కలుపుకొని చుట్టు ఉన్న అడవి ప్రాంతంలో వెతకడం ప్రారంబించాడు కానీ ఎంతకు జాకి కనబడలేదు. అలా వెతుక్కుంటూ వెళుతుంటే.. ఒకచోట రక్తపు మడుగులో జాకీ కనపడింది. దీంతో కన్నీటి సంద్రమైంది గురుదేవ్ కుటుంబం.

Street dog sitting

గురుదేవ్ సింగ్  ఈ విషయం గురించి మాట్లాడుతూ…నాలుగేళ్ల క్రితం వీధిలో ఉండగా జాకీని తన పిల్లలు తీసుకొచ్చానని.. ఎంతో ముచ్చటగా పెంచుకుంటున్నామని.. ఇవాళ ఇలా జరిగిందని ఆవేదన వ్యక్తం చేశాడు. తమ కోసం తన ప్రాణాలను పణంగా పెట్టిన జాకీకి ఘనంగా అంతిమసంస్కారాలు నిర్వహించింది గురుదేవ్ కుటుంబం. ఈ ఘటన గత శుక్రవారం జరిగింది.

(Visited 1,184 times, 1 visits today)