Home / Latest Alajadi / బంపర్ ఆఫర్: ఆ అర్ధగంట ఆ షాపింగ్ మాల్ లో అన్ని ఫ్రీ.

బంపర్ ఆఫర్: ఆ అర్ధగంట ఆ షాపింగ్ మాల్ లో అన్ని ఫ్రీ.

Author:

ఆఫర్ అంటే ఇది.. అలా ఇలా కాదు.. ఏ 50 శాతమో,75 శాతమో కూడా కాదు ఏకంగా 100 % ఫ్రీ. ఎప్పుడూ ఎక్కడా వినని, చూడని ఆఫర్. అయితే ఎదో ఒక కండిషన్ లేకుండా ఏ ఆఫరూ ఉండదు కదా..ఇక్కడా ఒక తిరకాసు ఉంది. ఏంటంటే,  షాపుకొచ్చి మీకు నచ్చిన వస్తువు ఏదైనా తీసుకెళ్ళండి ..దాని రేటు ఎంతయినా ఉండనీ.. కానీ ఈ ఆఫర్ మాత్రం కేవలం ఒక్క అరగంటే వరకే ఉంటుంది. ఆ అరగంటలోనే మీరు షాపుకు వచ్చి నచ్చిన వస్తువు ఫ్రీ గా తీసుకు వెళ్ళొచ్చు.  వెంటనే వెళ్లి ఎదో ఒక వస్తువు తెచ్చేసుకుందాం అనుకుంటున్నారా? ఈ ఆఫర్ మనదేశం లో లేదు.. అబుదాబి లోని లులు హైపర్ మార్కెట్ రంజాన్ మాసం సందర్భంగా మే ౩౦న ఈ స్పెషల్ ఆఫర్ ప్రకటించింది. ఇక చూస్కోండి.. మాల్ మొత్తం రచ్చ రచ్చ అయ్యిందట. ఆఫర్ తెలుసుకున్న జనాలంతా షాప్ మీద పది నానా రభస చేసారంట. అరగంట దాటితే ఆఫర్ వర్తించదు కాబట్టి ఒకరినొకరు తోసుకోవడం, గలాటాలతో షాపంతా నానా విధ్వంసమే జరిగిందట. మహిళల విభాగం  రంజాన్ సందర్భంగా తోటి వారికి సాయం చేయాలన్న సదుద్దేశంతోనే ఈ ఆఫర్ ప్రకటించామని మాల్ ప్రతినిధులు చెప్పారు. ఈ మాల్ లో ఆ అరగంట మొత్తం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ ఆఫర్ వల్ల తేలిన గమ్మత్తైన విషయం ఏంటంటే, ఏదైనా ఫ్రీ అని చెప్పినప్పటికీ ఆడాల్లంతా దుస్తుల మీదే మక్కువ చూపించగా, మగవాళ్ళంతా ఎలక్ట్రానిక్ వస్తువల వైపు మొగ్గారు.

ఆ అరగంట లో మాల్ లో జరిగిన రచ్చ రంబోలా చూడాలంటే కింది వీడియో చూడండి.

(Visited 2,576 times, 1 visits today)