Home / Entertainment / సావిత్రి గారి పుట్టినరోజే సందర్బంగా ఆమె గురించి చాలా మందికి తెలియని విషయాలివే! సినిమాలో లేనివి!

సావిత్రి గారి పుట్టినరోజే సందర్బంగా ఆమె గురించి చాలా మందికి తెలియని విషయాలివే! సినిమాలో లేనివి!

Author:

తెలుగు చిత్రసీమలో తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకున్న నటి సావిత్రి..మహానటిగా అవతరించిన ఆమె దూరమై దశాబ్దాలు దాటిన ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేసుకుంది.సావిత్రి అంటే సావిత్రి ఒక్కరే..ఆమెకి సాటి అయిన నటి మరొకరు లేరు..ఇకపై రారు అనేంతగా పేరు సంపాదించుకుంది.కేవలం కళ్లతోనే హావభావాలు పలికించగల నేర్పుకలిగిన నటి.ఎందరో నటీనటులకు ఆదర్శంగా నిలిచిన సావిత్రిగారి గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు.

సావిత్రి గారికి ఆరేళ్ల వయసులోనే తండ్రి చనిపోయారు..ఆ తర్వాత పిన్ని,బాబాయిల దగ్గరే పెరిగిపెద్దయ్యారు సావిత్రి.
చిన్నప్పటి నుండి చదువుల కంటే మిగతా యాక్టివిటిస్ పట్ల ఆసక్తి చూపేవారు సావిత్రి.అందులో భాగంగానే నటన,డ్యాన్స్ వైపు వెళ్లారు.తనకి ఎనిమిదేళ్ల వయసునుండే నాటకాల్లో నటించడం ప్రారంభించారు.

పన్నెండేళ్ల వయసులో సినిమాల్లో ప్రయత్నాలు ప్రారంభించారు..పెద్దదానిగా కనపడేలా మేకప వేసుకుని మరీ ఆడిషన్స్ కి వెళ్లేవారు ఆమె..అయినా అవేవి వర్క్ అవుట్ అయ్యేవి కావు. 1950లో అక్కినేని సరసన నటించే అవకాశం వచ్చింది.ఆ సినిమానే సంసారం ..కాని ఆ సినిమా టైంలో చాలా టేక్స్ తో తీసుకోవడంతో ఆ ఛాన్స్ లక్ష్మీకాంతం గారికి ఇచ్చారు..దాంతో తన తొలిచిత్ర అవకాశాన్ని కోల్పోయారు.

సావిత్రి గారి సిని జీవితంలో మిస్సమ్మ సినిమా ఎంతో స్పెషల్..వాస్తవానికి ఆ సినిమాలో సావిత్రి పాత్రకు మొదట ఎన్నుకున్నది భానుమతి గారిని..సినిమా షూటింగ్ ప్రారంభమయ్యక భానుమతి గారూ షూటింగ్ కి సరిగా రాకపోవడంతో..భానుమతి గారిపై కోపంతో ప్రోడ్యుసర్స్ ఆ పాత్రని సావిత్రికి ఇచ్చారు . సావిత్రి గారికి బంగారు నగలంటే ఎనలేని మక్కువ.సినిమా షూటింగ్ టైంలో తన నగలను తనే తెచ్చుకునేవారు.ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే తన నగలని తనే దగ్గరుండి డిజైన్ చేపించుకునేవారట..ఆవిడే బతికుంటే ఇండియాలో అతిపెద్ద జువెలరి డిజైనర్ అయ్యుండేదని ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో చెప్పారు షావుకారు జానకి.

savitri 27 feb 2018

సావిత్రి గారు ఎంతో ఉదార స్వభావం కలిగిన వారు.సాయం అంటూ తలుపుతట్టిన వారిని కాదనకుండా పంపేవారు.అలాంటి తన గుణం చేత చివరికి తనకేం మిగుల్చుకోకుండా వెళ్లిపోయారు. సావిత్రి గారికి కార్లంటే ఎంతో ఇష్టం.ఆ రోజుల్లోనే ఎవరి దగ్గర లేనన్ని కార్ల కలెక్షన్ సావిత్రి గారి దగ్గర ఉండేది.

తొలిచూపులోనే జెమిని గణేశన్ తో ప్రేమలోపడ్డారు..మొదటిసారి సినిమా ఆఫర్ల కోసం చెన్నైలోని జెమిని స్టూడియోస్ కి వెళ్లినప్పుడే జెమినితో పరిచయం,ప్రేమగా మారి పెళ్లికి దారితీసింది.ఆ పెళ్లి విషయం కొన్నేళ్ల వరకు గోప్యంగా ఉంచారు.
సావిత్రి గారితో పెళ్లికి ముందే జెమిని గణేశన్ కి రెండు సార్లు పెళ్లయింది.ఆ విషయం తెలిసి కూడా సావిత్రి జెమినితో మూడో వివాహానికి ఒప్పుకున్నారు.సావిత్రి గారి పతనం ప్రారంభం అయింది కూడా జెమినితో పెళ్లి తర్వాతే..అతనితో పెళ్లి తర్వాత మధ్యానికి బానిస అయ్యి,అనారోగ్యం పాలయ్యారు.

జెమిన గణేశన్ డబ్బు విషయంలో చాలా జాగ్రత్త పరుడు.సావిత్రి అలా కాదు తన దగ్గరున్న డబ్బు దానదర్మాల పేరిట కొంత,బిజినెస్లో నష్టాల పేరిట మరికొంత పోగొట్టుకుంది. తన ఆస్తి పాస్తులంతా పోయాక పిల్లలతో కలిసి ఒక చిన్న అద్దె ఇంట్లో ఉండేది.ఆ తరవాత వైధ్యానికి డబ్బులు లేక చాలా ఇబ్బందులు పడి కోమాలోకి వెళ్లిపోయింది..కోమాలోకి వెళ్లిన పద్దెనిమిది నెలలకు సావిత్రి మరణించింది. తన చివరి వరకు కూడా నటనే ప్రాణంగా బతికింది సావిత్రి..గోరింటాకు సినిమాలో ఒక సీన్లో తన చేతి గాజులు పగిలి చేతికి గాయం అయి రక్తం కారుతున్నా కూడా సీన్ కంప్లీట్ అయ్యేవరకు గాయాన్ని గురించి పట్టించుకోలేదు..ఇలాంటివి ఎన్నో ఘటనలు తన సినీ జీవితంలో.అందుకే అందరికి ఆదర్శప్రాయం అయింది మహానటి.

Images source: savithri.info

(Visited 1 times, 1 visits today)