Home / Inspiring Stories / ఏడుకొండలని తొలిచిన యోధుడు, మరో మాంఝీ “రాజారాం”

ఏడుకొండలని తొలిచిన యోధుడు, మరో మాంఝీ “రాజారాం”

Author:

mountainman

దశరథ్ మాంఝీ ఇప్పుడు దేశవ్యాప్తంగా వినిపిస్తున్నపేరు. జీవితం మొత్తం ఒక కొండను తొలిచి, రోడ్డు వేయటానికే ధార పోసి మౌంటెయిన్ మ్యాన్ గా పేరుగాంచిన దశరథ్. స‌మ్మెట‌, ఉలి, గున‌పంల‌తో శ్ర‌మించి కొండ‌ను పిండి చేసి చిన్న‌పాటి మార్గాన్ని సృష్టించాడు. 22 ఏళ్ల పాటు శ్ర‌మించి, ఈ సామాన్య భూమిలేని నిరుపేద కూలి ప‌ర్వ‌తాన్ని జ‌యించాడు. 360 అడుగుల పొడుగు, 30 అడుగుల వెడ‌ల్పుతో కొండ‌ను నిట్ట నిలువుగా చీల్చాడు ద‌శ‌ర‌థ్ మాంఝీ. ఇప్పుడు వ‌జీర్ గంజ్‌లో ఉన్న హాస్పిట‌ల్స్‌కు, స్కూల్స్ కు చేరాలంటే కేవ‌లం ఐదు కిలోమీట‌ర్లు ప్ర‌యాణిస్తే స‌రిపోతుంది. ఆ చుట్టుప‌క్క‌ల‌ ఉన్న 60 గ్రామాల ప్ర‌జలు ఆ మార్గాన్ని ఉప‌యోగించుకుంటున్నారు. మాంఝీ జీవిత కథ సినిమాగా వచ్చింది తన భార్య గాయాల్తో, మరణం తో కొండమీద పగబట్టిన ఆయన మరికొందరి కోసం ఎలా ఆ కొండను డీ కొట్టాడో తెలుసుకున్న యావత్ దేశం సాహో మాంఝీ…! అంటూ సలాం చేసింది. 2006లో అప్ప‌టి బీహార్ ముఖ్య‌మంత్రి నితీశ్ కుమార్ నిర్వ‌హిస్తున్న “జ‌న‌తా ద‌ర్బార్‌”కు వెళ్లాడు మాంఝీ. అప్ప‌టికే మాంఝీ చేసిన ఘ‌న‌త గురించి తెలుసుకున్న‌నితీష్‌కుమార్ ఆయ‌న‌ను వేదిక‌పైకి ఆహ్వానించాడు. ఓ ఐదు నిమిషాలు ముఖ్య‌మంత్రిగా ఉండ‌మంటూ త‌న కుర్చిమీద కూర్చోబెట్టారు. విశాదమేంటంటే…! కొండ‌ను పిండీకొట్టిన ద‌శ‌ర‌థ్ మాంఝీ క్యాన్స‌ర్‌ను మాత్రం జ‌యించ‌లేక‌పోయాడు. ఆగ‌స్ట్ 17, 2007న క్యాన్స‌ర్‌తో మృతి చెందాడు. బీహార్ ప్ర‌భుత్వం, ప్ర‌భుత్వ లాంఛ‌నాల‌తో మాంఝీ అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించింది. మరి మాంఝీ లానే మరెవరైనా ఇతరుల కోసం చేసిన వారున్నారా అంటే…? సమాధానం మహారాష్ట్ర నుంచి వస్తుంది… ఏడు కొండలను తొలచి తన గ్రామాన్ని మిగతా ప్రపంచంతో కలిపిన మహారాష్ట్రకు చెందిన రాజారామ్‌ భాప్కరే పేరు వినిపిస్తుంది..

ఒకటీ రెండూ కాదు ఏడు కొండలను తొలిచి రోడ్డ్లు వేసాడు. మహారాష్ట్రలో మారుమూల గ్రామమైన గుండెగావోన్‌ కొండల మధ్య బంధీ అయి ఉండేది. పక్క గ్రామం కోలేగావోన్‌కు వెళ్లాలంటే 29 కిలోమీటర్లు కొండల చుట్టూ ప్రదక్షణ చేయాలి. స్కూల్ టీచర్ అయిన ఇది స్వాతంత్య్రం వచ్చే నాటి మాట. స్వాతంత్య్రం వచ్చాక తన ఊరి కష్టం తీరుతుంది అని చాలా ఆశపడ్డాడు. స్వతంత్రమైతే వచ్చింది కనీ రోడ్డు రాలేదు కనీసం అటువైపుగా ప్రయత్నాలు కూడా ఏమీ జరగ లేదు. ఆ 29 కిలోమీటర్లూ వెళ్ళి చదువు చెప్పి తిరిగిరావాలి వెళ్తూనే ఉన్నడు వస్తూనే ఉన్నాడూ గర్భినీ స్త్రీల చావులూ,అత్యవసర పరిస్థితిలో ఆసుపత్రికి వెళ్ళాల్సిన మనుషుల చావులని చూస్తూ ఉన్న అతను ఇక ఆగలేకపోయాడు తన స్కూల్ లో పని కొనసాగిస్తూనే ఉదయం,సాయంత్రం ఆ రెండు ఊళ్ళ మధ్య ఉన్న కొండను తవ్వటం మొదలు పెట్టాడు.. అది చూసిన కొందరు పిచ్చి మాస్టారూ అని నవ్వుకుంటే కొందరు మాత్రం మాస్టర్ జీ తో చేతులు కలిపారు కానీ…! అంతా రోజు కూలీ కాబట్టి ఒకటీ రెండు రోజులు మాత్రమే వచ్చేవాళ్ళు, వారి ఆర్థిక పరిస్థితిని గమనించిన బాప్కరే తన జీతం లో తన ఖర్చులకు మాత్రం తీసుకొని వారికి కూలీ కింద మిగిలినది పంచేవాడు. అలా కొన్నేళ్ళకి ఆకొండ తలవంచక తప్పలేదు పక ఊరికి వెళ్ళేందుకు దూరం 29 కిలోమీటర్లనుంచి 8 కిలోమీటర్లకు తగ్గింది. అప్పుడే రాజారాం కి మరో ఆలోచన తట్టింది ఈ ఒక్క ఊరికి ఉన్న దూరం తగ్గిస్తే సరిపోదు మరిన్ని కొండల మధ్యనుంచి రోడ్లు వేయాలి మరిన్ని దూరాలను తగ్గించాలి. అనిపించిన వెంటనే దాన్నొక ఉధ్యమంగా మొదలు పెట్టారు.చుట్టు పక్కల గ్రామాల మధ్యనున్న కొండలను తవ్వే పనికి జనాన్ని ప్రోత్సహిస్తూ, స్వయంగా వెళ్ళి తానూ కొండలను తవ్వుతూ ఉండిపోయాడు అలా ఏకంగా ఒకటీ రెండూ కాడు కాదు ఏడుకొండలను తవ్వేసాడు… కొండలనే కాదు దూరాలని కూడా కత్తిరించి తగ్గించాడు.. 57 ఏళ్లలో 40 కిలోమీటర్ల దూరం రోడ్లను వేశాడు. 7 కొండలను తొలిచాడు. 7 రోడ్లను వేశాడు. తన రిటైర్‌మెంట్‌ సొమ్మును, పింఛన్‌ డబ్బును దారి వేసేందుకే ఖర్చుచేశాడు. ఈ లెక్కన ఎంత మేలు జరిగిఉంటుందో ఇట్టే అర్థమవుతుంది. 1999కల్లా ఆయన ఈ పనిని సాధించాడు..

చాలా సాదాసీదాగా కనిపించే ఈ భాప్కర్‌ గురూజీని దైవంలా గ్రామస్తులు కొలుస్తుండటంలో తప్పేముంది.ఒక పిచ్చివాడిలా కనిపించే మాంఝీ ని ముఖ్యమంత్రి కుర్చీలో కూచోబెట్టటం వల్ల ఆ కుర్చీకి గౌరవం పెంచటం కన్నా మార్గమేముంది. కొన్ని మార్గాలకు ఎవరెవరివో పేర్లు పెడుతుంటారు. వారి పేరు వింటేనే వారి వేయని ఆ దారిన కూడా నడవ బుద్ధి కాదు. ఇలా తమ గ్రామాలకు దార్లు వేసినవారి పేర్లను ఎంత ఉన్నత స్థానాల్లో పెట్టి గౌరవించాలో? రాజకీయ నాయకుల పేర్లని రోడ్లకి పెట్టటం కన్నా జాతీయ రహదారులకి వీరి పేర్లు పెట్టి గౌరవించే రోజు వస్తే ఎంత బావుండేదో కదా..!

(Visited 205 times, 57 visits today)