Home / Inspiring Stories / దిక్కులేని స్థితిలో వృద్ధాశ్రమంలో మహాత్మా గాంధీ మనుమడు.

దిక్కులేని స్థితిలో వృద్ధాశ్రమంలో మహాత్మా గాంధీ మనుమడు.

Author:

మహాత్మా గాంధీ ఈ పేరు తెలియని వారు ఉండరు. ఈ దేశంలో ఒక్క ఈ దేశంలోనే కాదు ఈ ప్రపంచం మొత్తం తెలిసిన మాహానాయకుడు, గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడు మహాత్మా గాంధీ. 20వ శతాబ్దంలో నాయకులలో అత్యధికముగా మానవాళిని ప్రభావితము చేసిన నాయకుడు. ఈ దేశానికి ఎంతో సేవచేసిన నాయకుని మనవడు ఇప్పుడు ఒక మారుమూల పట్టణంలో చిన్న వృద్దాశ్రమంలో తన భార్యతో ఉంటున్నాడు. గాంధీ మనమడు వృద్దాశ్రమంలో ఉండటమేంటి అనుకుంటున్నారా! కానీ ఇది నిజం.

Gandhi's grandson Kanubhai and wife take refuge at old age home in New Delhi - he is the kid in iconic photo leading Mahatma by walking stick

మహాత్ గాంధీ అన్ని ఫోటోలలో ఒక్క ఫోటో మాత్రం చాలా మందిని వెంటాడుతూ ఉంటుంది. అదే ఒక పిల్లవాడు గాంధీ గారి చేతి కర్రను పట్టుకొని ముందుకు నడుస్తుంటాడు ఆ పిల్లవాడు గుర్తున్నాడ!  అదే పిల్లవాడు పెరిగి పెద్దవాడు అయి ఇప్పుడు వృద్దుడిగా అయిపోయాడు. అతడే కానూభాయ్. గాంధీగారికీ ముగ్గురు కొడుకులు. ఆఖరివాడు రాందాస్ గాంధీ.. ఆయన కుమారుడే కానూభాయ్. గాంధీ గారు చనిపోయే సమయానికి కానూభాయి వయస్సు 17 సంవత్సరాలు ఆ తర్వాత నెహ్రూ, అమెరికా రాయబారి జె కె గాలిబ్రత్ కానూని మసుచుసెట్స్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లో చేర్పించారు. అప్లయిడ్ మేథ్స్ లో పీజీ చేశారు కానూభాయ్. ఆ తర్వాత నాసా లో చేరి, పెళ్ళి చేసుకుని వర్జీనియాలోని హాంప్టన్ లో నివాసముండేవారు. అమెరికా వంటి అత్యున్నత దేశ రక్షన శాఖ యుద్ద విమానాలు తయారి విభాగంలో అత్యున్నత పదవిని పొందినవారిలో కానూభాయి ఒకరు.కానూభాయి భార్య శివలక్ష్మి బయోకెమిస్ట్రీలో పీహెచ్ డీ చేశారు. చాలా కాలం పాటు బోస్టన్ లో ప్రొఫెసర్ గా పనిచేశారు. బోస్టన్ బయోమెడికల్ రిసెర్చ్ ఇన్ స్టిట్యూట్ లో పనిచేసి రిటైరయ్యారు.

Gandhi Grandson Kanubhai Gandhi

మరి ఇద్దరికి మంచి ఉద్యోగాలు మంచి జీవితం వారికేంటి అనుకుంటున్నారా! కానీ వారు కూడా మనుషులే కద! వారు కూడ విది ఆడే వింత నాటకంలో పావులు అయ్యారు అనుకోని పరిణామల వలన ఉన్న ఆస్తి అంత హరించుకుపోయింది. చాలా కాలం పాటు విదేశాల్లో గడిపి 2014 లో ఇండియాకు తిరిగొచ్చిన ఆయన గత రెండు సంవత్సరాలుగా గుజరాత్ లో సబర్మతీ ఆశ్రమానికి దగ్గరలో ఓ వృద్ధాశ్రమంలో ఉన్నారు. వీరికి పిల్లల్లేరు. అలాగే వీరికి రాజకీయాలు అంటే ఇష్టం కూడా లేదు. అందుకే వారు అందరికి దూరంగా ఉంటున్నారు.

ఎంతో విలాసంగా, ఏసీల మద్య బ్రతికిన ఈ జంట ఇప్పుడు జీవన చరమాంకంలో స్వదేశానికి వచ్చి బాధపడుతున్నారు. జీవితంలో ఎత్తుపల్లాలు సహజం. ఎత్తులు చూశాం.. ఇప్పుడు లోయలో ఉన్నాం.. దీన్నుంచి బయటపడాలి,  కానీ చేయి చాచి ఏ పార్టీనీ, ప్రభుత్వాన్నీ ఏమీ అడుక్కోబోమని ఈ జంట అంటోంది.

(Visited 1,288 times, 1 visits today)