Home / Entertainment / మొదలు కానున్న మురుగ దాస్ మహేష్ ల 80కోట్ల ప్రాజెక్టు.

మొదలు కానున్న మురుగ దాస్ మహేష్ ల 80కోట్ల ప్రాజెక్టు.

Author:

Mahesh babu and Muraga das movie details

బ్రహ్మ్మొత్సవం లో బిజీ గా ఉంటూనే తన నెక్స్ట్ ప్రాజెక్ట్ మీద దృష్టి పెట్టాడు ప్రిన్స్ మహేష్. ఇదివరకు ఒక సారి వార్తల్లోకి వచ్చి ఆగిపోయిన మురుగదాస్-మహేష్ కాంబినేనేషన్ సినిమా నే ఇప్పుడు చేయబోతున్నారన్నది కూడా స్పష్టమైంది ఏప్రిల్ 12 , 2016న లాంచ్ చేయటానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారని సమాచారం.ఈ చిత్రానికి హీరోయిన్ ఎవరనేది ఫైనలైజ్ కాలేదు. శృతి హాసన్ హీరోయిన్గా చేసే అవకాసం ఉందని వినికిడి. అలాగే మరో హీరోయిన్ గా అలియా భట్ ని కూడా అడుగుతున్నట్లు తెలుస్తోంది. చిత్రాన్ని తమిళ, తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కిస్తారు. ఎన్ వి ప్రసాద్, ఠాగూర్ మధు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.ఐతే ఇప్పటికే శ్రీమంతుడు తో 100 కోట్ల హీరో అనిపించుకున్న మహేష్ కి కూడా కాస్త తన రేంజ్ ని పెంచు కోవాలి అనిపించిందేమొ లేక బాహుబలి రికార్డుల ప్రభావమో గానీ నిర్మాతలు ఈ సినిమా బడ్జెట్ ని కూడా 100 కి దగ్గరలో అనుకుంటున్నారట. సినిమా క్వాలిటీ విశయం లో ఏమాత్రం రాజీ పడేదనీ ఎంత డబ్బు ఖర్చైనా పరవాలేదనీ అంటున్నట్టు సమాచారం.

మరో ప్రక్క బ్రహ్మోత్సవం అనంతరం కూడా ప్రాజెక్టులు వరస పెట్టి సైన్ చేసాసారు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఓ చిత్రం, ఎ ఆర్ మురుగ దాస్ దర్శకత్వంలో మరో చిత్రం గ్రీన్ సిగ్న ల్ ఇచ్చారు. ఈ రెండు చిత్రాలు ఒకే సారి ప్రారంభమవుతాయి. వీటిన్నటి తర్వాత రాజమౌళి తో చేసే గరుడ సిద్దంగా ఉంది. ఇవన్నీ పూరతయ్యే నాటికి 2020 అవ్వొచ్చు గానీ ఒకవేళ కథలు అన్నీ సరిగ్గా ఉంటే మాత్రం మహేష్ బాలీవుడ్ హీరొలకు ఏమాత్రం తీసిపోని క్రేజ్ ని సంపాదించుకుంటాడని మాత్రం బల్ల గుద్ది చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడిప్పుడే తెలుగు సినిమా హద్దులని అధిగమించి ముందుకు దూకే ప్రయత్నం చేస్తోంది. తమిళ హీరోలకి ఇక్కడ సొంత మార్కెట్ ఉన్నట్టు గానే ఇతర భాషల్లో కూడా మనోళ్ళు పాగా వేయాలని  చూస్తున్నారు అదే బాట లో శ్రీమంతుడు ద్విభాషా చిత్రంగా వచ్చింది. ఇక భాహుబలి సంగతి చెప్పక్కరలేదు కూడా. ఇక ఇప్పుదు రాబోయే మహేష్-మురుగ దాస్ ల సినిమా మూడు దక్షినాది భాషల్లో రేడీ అవనుంది. ఇదే ఆలోచనతో మురుగదాస్ సినిమాను భారీగా రిలీజ్ చేసి ఏకంగా బాహుబలి కలెక్షన్స్ కి క్రాస్ చేసే మాస్టర్ ప్లాన్ వేస్తున్నాడు మహేష్. మురుగదాస్ సినిమా కాబట్టి బాలీవుడ్లో కూడా ఆయనకు మంచి ఫ్యాన్స్  ఉన్నారు. సో సినిమా కనుక మంచి సబ్జెక్ట్ తో వస్తే కచ్చితంగా రికార్డులను తిరగ రాయడం ఖాయం అని చెప్పొచ్చు. ఇప్పటికే ఎలాంటి ఎక్స్ పెక్టేషన్స్ లేని శ్రీమంతుడు సినిమాతో దాదాపు దగ్గర దగ్గర 100 కోట్ల కలెక్షన్స్ సాధించి మరోసారి తన స్టామినా ఏంటో ప్రూవ్ చేసుకున్నాడు మహేష్. మరి మహేష్ వేసిన ఈ మాస్టర్ ప్లాన్ వర్క్ అవుట్ అవుతుందా లేదా అన్నది సినిమా వస్తేనే గాని చెప్పలేం.

(Visited 157 times, 1 visits today)