Home / Entertainment / మహేష్ నుండి ఈ ఏడాది రెండు సినిమాలు.

మహేష్ నుండి ఈ ఏడాది రెండు సినిమాలు.

Author:

Brahmotsavam Movie Release date

ప్రిన్స్ మ‌హేష్‌బాబు వ‌న్‌, ఆగ‌డు లాంటి రెండు ప్లాప్ సినిమాల త‌ర్వాత మ‌హేష్‌ సినిమాల విషయంలో ముందు కంటే స్పీడ‌ప్ అయ్యాడు. లేటెస్ట్ బ్లాక్‌బ‌స్ట‌ర్ శ్రీమంతుడు సినిమా మ‌హేష్ కేరీర్‌లో మ‌ర‌పురాని సినిమాగా మిగిలిపోతుంద‌న‌డంలో సందేహం లేదు. ఈ సినిమాతో మ‌హేష్‌కు ఇటు హిట్టుకు హిట్టు, భారీ వ‌సూళ్లు, చిత్ర‌, రాజ‌కీయ రంగాల‌కు చెందిన ప‌లువురు ప్ర‌ముఖుల ప్ర‌శంస‌లు కూడా ద‌క్కాయి. ప్రస్తుతం మహేష్ బాబు ‘బ్రహ్మోత్సవం’ సినిమా షూటింగ్‌లో బిజిగా ఉన్నాడు. ఈ సినిమా కుటుంబ బాంధవ్యాల కథా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలోని కొన్ని ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ సీన్స్ ని షూట్ చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత మహేష్ బాబు తమిళ స్టార్ డైరెక్టర్ ఎఆర్ మురుగదాస్ డైరెక్షన్ లో ఓ భారీ బడ్జెట్ ద్విభాషా చిత్రం చేయనున్న సంగతి తెలిసిందే..

మహేష్ బాబు మురుగదాస్ ల సినిమా షూటింగ్ ని ఏప్రిల్ లో మొదలు పెట్టనున్నట్టు సమాచారం.ఏప్రిల్ లో ఈ సినిమా షూటింగ్ ని మొదలు పెట్టి 6 నెలల్లో షూటింగ్ ని పూర్తి చేసి అనగా సెప్టెంబర్ కల్లా సినిమా షూటింగ్ ని పూర్తి చేసి అక్టోబర్ చివర్లో రానున్న దీపావళి కానుకగా ఈ సినిమాని రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. అందుకే షూటింగ్ మొదలయ్యాక ఎలాంటి ఇబ్బంది ఉండకూడదని స్క్రిప్ట్, కాస్టింగ్ మరియు లొకేషన్స్ ని పక్కాగా ఫిక్స్ చేస్తున్నారు. దీని ప్రకారం మహేష్ బాబు ఈ ఏడాది రెండు సినిమాలను రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నాడు.

(Visited 167 times, 1 visits today)