Home / Entertainment / మహేష్ బాబు,మురగదాస్ సినిమాకి హీరోయిన్ గా బాలీవుడ్ ముద్దుగుమ్మ.

మహేష్ బాబు,మురగదాస్ సినిమాకి హీరోయిన్ గా బాలీవుడ్ ముద్దుగుమ్మ.

Author:

విభిన్న తరహా ఫ్యామిలీ కథలు తెరకెక్కిస్తూ తనకంటూ ఓ ప్రత్యేకమైన ముద్ర వేసుకున్న శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ బ్రహ్మోత్సవం మరో వారం రోజుల్లో విడుదల కానుంది. మే 20న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున ఈ సినిమా విడుదల అవుతుంది, ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత 2 వారాల పాటు ప్రమోషన్స్ కు కేటాయించి.. ఆ వెంటనే తన కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేసేందుకు రెడీ అవుతున్నాడు మహేష్ బాబు.

తన తర్వాతి సినిమా మోస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న తమిళ తంబి మురగదాస్ దర్శకత్వంలో అటు తమిళ్ ఇటు తెలుగు రెండు బాషలలో ఒకేసారి విడుదల అవుతాయ్ అన్న విషయం ఈ పాటికే అందరికీ తెలిసినదే ,కాగా ప్రస్తుతం మురగదాస్ కథని ఈ రెండు నేటివిటీలకు దగ్గరగా ఉండేటట్టు కథలో కొన్ని మార్పులు చేసుకుంటూ ,ఓ మంచి బాలీవుడ్ హీరొయిన్ ని వెతికే పనిలో ఉన్నాడట ,మొదట బాలీవుడ్ యంగ్ బ్యూటీ ఆలియా భట్ మహేష్ సరసన రొమాన్స్ చేయబోతుంది అని వార్తలు వచాయి కానీ , ఇప్పుడు మహేష్ పక్కన నటించేందుకు పరిణీతి చోప్రా ఒప్పుకుందని తెలుస్తోంది.

Mahesh Babu and Parineti Chopra

ఇక వాళ్ళ పేర్లు వీళ్ళ పేర్లు మారాక చివరికి పరిణీతి నే సెలెక్ట్ చేశారనీ , కాంట్రాక్ట్ సైన్ చేయడం కూడా పూర్తయిందనీ సమాచారం ,అంతే కాదండోయ్ ఆ సమయంలో ఆమె చూపించిన ప్రొఫెషనలిజం చూసి యూనిట్ కి మైండ్ బ్లాంక్ అయిందని అంటున్నారు. పరిణితి చూపిచిందట సైన్ చేసే ముందుగానే 20 రోజులు ప్రమోషన్ కి కేటాయిస్తాను అని రాయించి కాల్ షీట్లలో వాటికీ ఓ 20 రోజులు కలిపేసుకుందట.అదే పాపం మన హీరోయిన్లకి అయితే ఇన్ని తెలివితేటలు ఉండేవి కాదేమో ఏది ఏమైనా పరిణీతి తెలుగు సినిమా ఎంట్రీ వందశాతం అయిపోయినట్టే.

(Visited 367 times, 1 visits today)