Home / Entertainment / త్రీ స్టార్స్ క్రేజి కాంబినేషన్

త్రీ స్టార్స్ క్రేజి కాంబినేషన్

Author:

mahesh-babu

మురుగదాస్ సినిమా అంటేనే ప్రేక్షకులకు మంచి కథ,మరియు అందులో అంతర్లీనంగా ఒక మెసెజ్ ఉంటుంది.మురుగదాస్ తదుపరి సినిమా మహేష్ బాబు తో తీస్తున్నాడన్న విషయం తేలిసిందే, మహేష్ బాబు ప్రస్తుతం చేస్తున్న బ్రహ్మోత్సవం సినిమా గత కొద్ది రోజులుగా షూటింగ్ కి గ్యాప్ ఇచ్చి ఉన్న ఈ నెల 28 నుంచి న్యూ షెడ్యూల్ ని రామోజీ ఫిల్మ్ సిటీలో మొదలు పెట్టనున్నాడు. మురుగదాస్ కథని పగడ్భందీగా రెడీ చేస్తూనే, సినిమాకి కావాల్సిన టెక్నీషియన్స్ ని కూడా సిద్దం చేస్తున్నారు.

తాజాగా ఎఆర్ మురుగదాస్ మహేష్ బాబు సినిమా కోసం స్టార్ సినిమాటోగ్రాఫర్ మరియు 5 సార్లు నేషనల్ అవార్డు గెలుచుకున్న సంతోష్ శివన్ ని ఎంపిక చేసారు. ఈ రోజు ఓ కార్యక్రమంలో ఈ విశ్యయాన్ని స్వయంగా సంతోష్ శివన్ తెలియజేశాడు. నేషనల్ అవార్డ్స్ తో పాటు హాలీవుడ్ లోని అమెరికన్ సొసైటీ అఫ్ సినిమాటోగ్రాఫర్స్ అసోషియేషన్ లో మెంబర్ షిప్ తెచ్చుకున్న మొదటి ఇండియన్ సినిమాటోగ్రాఫర్ సంతోష్ శివన్ కావడం విశేషం. ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ లో అధికారికంగా లాంచ్ అయ్యి అదే నెలలో సెట్స్ పైకి వెళ్లనుంది. భారీ బడ్జెట్ తో నిర్మించనున్న ఈ సినిమాని ఒకేసారి తెలుగు, తమిళ భాషతో పాటు హిందీలో కూడా డబ్ చేసి రిలీజ్ చేయనున్నారు.

(Visited 93 times, 1 visits today)