Home / Entertainment / మహేష్ బాబు తో రాజమౌళి ‘గరుడ’ చెయ్యబోతున్నారా?

మహేష్ బాబు తో రాజమౌళి ‘గరుడ’ చెయ్యబోతున్నారా?

Author:

రాజమౌళి బుసాన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ కి వెళ్లడమేమో కానీ….ఇక్కడ హైదరాబాద్ లో రచ్చ రంబోలా అవుతోంది. రాజమౌళి బాహుబలి-2 పూర్తి చేయగానే , ఇక మహేశ్ బాబు తో ‘గరుడ’ ప్లాన్ చేస్తున్నట్టు ఫిల్మ్ నగర్ లో టాక్. వెయ్యి కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో ఈ చిత్రం రూపొందబోతోందని చాలా ఫాస్ట్ గా న్యూస్ వ్యాపిస్తోంది. ఇందులో నిజా నిజాలు ఎలా ఉన్నా, ఇప్పుడు వెయ్యి కోట్ల సాహసం చేయటానికి ఏ నిర్మాత ముందుకొస్తాడో అనేదే అందరో ఆసక్తి గా ఎదురు చూస్తున్న అంశం.

మరో పక్క, సౌత్ కొరియా పోర్ట్ సిటీ బుసాన్ లో మొదలైన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో 75 దేశాల నుంచి 94 ప్రీమియర్స్ తో సహా 304 సినిమాలు ప్రదర్శితమవుతున్నాయి. వందల మంది సెలెబ్రిటీ లు హాజరైన ఈ మెగా ఈవెంట్ కు మన దేశం నుంచి బాహుబలి , భజరంగీ భాయి జాన్ ఎంపికయ్యాయి. అందులో భాగంగానే అక్కడి నుంచి రాజమౌళి, ఆ రెండు సినిమా ల తాలూకు పోస్టర్లు ప్రదర్శితమైన మల్టీ ప్లెక్స్ బిల్డింగ్ ఫోటో తన ఫేస్ బుక్ పేజ్ లో పోస్ట్ చేశారు. ఫిల్మ్ ఫెస్టివల్ 20 ఆ ఎడిషన్ సందర్భంగా మన దేశానికి దక్కిన గౌరవం గా బాహుబలి ని అందరూ ఆసక్తిగా తిలకిస్తున్నట్టు సమాచారం. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘బాహుబలి-ది బిగినింగ్’ సినిమాను ఓపెన్ సినిమా కేటగిరిలో 20వ బుసన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రదర్శిస్తున్నారు. జులై 10 న రిలీజైన ‘బాహుబలి-ది బిగినింగ్’ కలెక్షన్ల వసూళ్లు, రికార్డుల మోతతో బాక్సాఫీసు దద్దరిల్లేలా చేసింది. ఇండియన్ సినిమా హిస్టరీలో హయ్యెస్ట్ డొమెస్టిక్ గ్రాస్ గా ఈ చిత్రం రికార్డుల కెక్కింది. దేశీయంగా అత్యధికగా వసూళ్లు సాధించిన సినిమాగా బాహుబలి సినిమా మొదటి స్థానంలో ఉంది. బాహుబలి చిత్రాన్ని అంతర్జాతీయ ప్రమాణాలకు తగిన విధంగా ప్రఖ్యాత హాలీవుడ్ ఎడిటర్ విన్సెంట్ టబైలాన్ కూర్పు చేశారు. గతంలో ఈయన హాలీవుడ్ సినిమాలు ‘టేకెన్ 2′, ఇన్‌క్రెడబుల్ హల్క్, ట్రాన్స్‌పోర్టర్ 2 తదితర చిత్రాలకు ఎడిటింగ్ చేసారు. ఈయన ఎడిట్ చేసిన బాహుబలి వెర్షన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రదర్శితమవుతోంది. బాహుబలి చిత్రాన్ని ఈ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఇండోర్ స్క్రీనింగ్స్ లో అక్టోబర్ 4, అక్టోబర్ 7వ తేదీన… ఔట్ డోర్ స్క్రీనింగ్ అక్టోబర్ 9న ప్రదర్శించనున్నారు.

Also Read: రాజమౌళి ‘గరుడ’ లో భీష్ముడిగా అమితాబ్.

ఈ ఫిల్మ్ ఫెస్టివల్ కి రాజమౌళి కూడా హాజరయ్యారు. కొరియన్ ఆడియన్స్, మీడియాతో అక్టోబర్ 4వ తేదీన ఇష్టాగోష్టి నిర్వహిస్తున్నారు. బహుశా ఈ సందర్భంగా నే రాజమౌళి తన తదుపరి ఎస్సైన్ మెంట్ మహేశ్ బాబుతో ఉండబోతోందనీ, అది ‘గరుడ’ కావచ్చుననీ ప్రకటించే అవకాశం ఉన్నట్టు చెబుతున్నారు. అది నిజమో, వదంతో తెలియదు కానీ….వెయ్యి కోట్ల బడ్జెట్ ప్రకటన అంటూ జరిగితే మాత్రం..అప్పుడు ఆదాయ పన్ను శాఖాధికారుల దృష్టి మన ఫిల్మ్ నగర్ మీద పడటం ఖాయమని ఒక భోగట్టా!

(Visited 403 times, 1 visits today)