Home / Inspiring Stories / మహిళా యాంకర్ కు తెలుగు టీ వీ చానెల్ అధినేత ‘ఇన్ డీసెంట్ ప్రపోజల్’!

మహిళా యాంకర్ కు తెలుగు టీ వీ చానెల్ అధినేత ‘ఇన్ డీసెంట్ ప్రపోజల్’!

Author:

తెలుగు ఛానెల్స్ చరిత్రలో ఒక సంచలనం..ఒక టీ వీ చానెల్ అధినేత తనను సెక్స్ వేధింపుల కు గురి చేస్తున్నారంటూ ఒక మహిళా యాంకర్ రాష్ట్ర మానవ హక్కుల సంఘంలోనూ,  రాష్ట్ర మహిళా కమిషన్ లోనూ ఫిర్యాదు చేయబోతున్నట్టు తెలిసింది. తన పట్ల ఆ టీ వీ  చానెల్ అధినేత అమర్యాదకరంగా ప్రవర్తించడమే కాకుండా, ఒక ‘ఇన్ డీసెంట్ ప్రపోజల్’ కూడా తీసుకువచ్చారంటూ ఆమె తన సన్నిహిత సహచరుల దగ్గర వాపోయినట్టు తెలిసింది. ‘అనధికారిక సేవ’లకు అత్యధిక మొత్తం చెల్లిస్తానంటూ ఆయన ఇచ్చిన ఆఫర్ కు బిత్తర పోయిన ఆమె …ఆ చానెల్ అధినేత కు సీరియస్ వార్నింగ్ ఇచ్చిందనీ, దాంతో ఆయన కూడా ‘రివర్స్ గేర్’ లో వచ్చి ..ఇట్లాంటివి మామూలే కదా….ఇష్టం లేకపోతే ‘నో’ అని చెప్పవచ్చుననీ అన్నట్టు తెలిసింది. అయితే, ఆ ప్రపోజల్ తీసుకుని వచ్చిన తర్వాతి రోజు నుంచీ ఆమెను ఆ అధినేత ‘ప్రొఫెషనల్’ గా వేధిస్తున్నాడనీ, ఉద్యోగంలో కంటిన్యూ కావటానికి వీల్లేని పరిస్థితులు తీసుకువస్తున్నారనీ కూడా ఆ యాంకర్ తన కొలీగ్స్ దగ్గర వాపోయినట్టు తెలిసింది. ఈ విషయం ఆ నోటా …ఈ నోటా పాకడం తో ఖంగు తిన్న ఆ టీ వీ  చానెల్ అధినేత ప్రస్తుతం రాజీ ఫార్ములాతో ..కొందరు జర్నలిస్టు సంఘాల నాయకుల వద్దకు తిరుగుతున్నట్టు తెలుస్తోంది.

ఇప్పటికే రాష్ట్ర మానవ హక్కుల సంఘం లోనూ…లేబర్ కమిషనర్ కార్యాలయం లోనూ ….జర్నలిస్టులను ఇబ్బందులకు గురి చేసిన దానిపైన కేసులు ఎదుర్కుంటున్న ఆ టీ వీ చానెల్ అధినేత , ఈ తాజా వివాదంతో పరువు ఎక్కడ పోతుందో అనే బెంగ పెట్టుకున్నట్టు తెలుస్తోంది. తనకు తెలిసిన నలుగురైదుగురు సినీ రంగ ప్రముఖుల ద్వారా ఆ మహిళా యాంకర్ మీద ఒత్తిడి తీసుకోచ్చేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ, వారు ఈ సున్నితమైన విషయం లో తాము జోక్యం చేసుకోలేమనీ, మీ ప్రయత్నాలు మీరు చేసుకొండనీ ..ఒక ఉచిత సలహా పారేశారట! దిక్కు తోచని ఆ టీ వీ  చానెల్ అధినేత ప్రస్తుతం బిక్కు బిక్కుమంటూ తన ఛాంబర్ కే పరిమితమైనట్టు కూడా తెలిసింది. ఇతర రాష్ట్రాల్లోనూ, ఇతర దేశాల్లోనూ కూడా కొన్ని భాగస్వామ్య వ్యాపారాలు కలిగి ఉన్న ఈ పెద్దమనిషి నిజ స్వరూపం తెలియక ఆయన దగ్గర కొలువులో చేరిన కొంతమంది మంది జర్నలిస్టులు ప్రస్తుతం తలలు పట్టుకుని కూర్చున్నారట. ఈ విషయం తెలిసిన ఇతర మీడియాలలో పని చేస్తున్న జర్నలిస్టులు, జర్నలిస్టు సంఘాల నాయకులు ఆ మహిళా యాంకర్ కు బాసటగా నిలవటానికి, అవసరమైతే అంశాన్ని జాతీయ మహిళా హక్కుల కమిషన్ దృష్టికి తీసుకు వెళ్ళి మీడియా సంస్థల్లో మహిళలకు రక్షణ కల్పించేలా ఒత్తిడి తీసుకు రావాలనీ నిర్ణయించుకున్నారట! ఉద్యోగ అవసరాన్నిఅద్దం పెట్టుకుని మహిళలను వేధించే ఇటువంటి సంస్కృతిని ఎదుర్కోవాలని జర్నలిస్టు సంఘాలు గట్టిగా నిర్ణయం తీసుకున్నాయి.

(Visited 287 times, 1 visits today)