Home / Political / 2016-17 బడ్జెట్ లోని ముఖ్యాంశాలు.

2016-17 బడ్జెట్ లోని ముఖ్యాంశాలు.

Author:

Arun Jaitly

భారత దేశంలోని రైతుల కు తాము అండగా ఉంటామనీ, అన్నదాతలకు ఆదాయ భద్రత కల్పిస్తామని చెప్పిన అరుణ్ జైట్లీ ఈ దేశపు ఆదాయాన్ని 2022 నాటికి రెట్టింపు చేయాలన్నది తమ లక్ష్యమని చెప్పారు. కేంద్ర ఆర్థిక బడ్జెట్ ను సోమవారం రోజున లోక్ సభలో ఆయన ప్రవేశపెట్టారు.అయితే రైతుల కోసం చేసిన వ్యాఖ్యలు నిలబెట్టుకునే దిశలోనే కనిపించారు వ్యవసాయం, రైతుల సంక్షేమానికి ఈ బడ్జెట్ లో రూ.35,984 కోట్లు కేటాయించారు.

బడ్జెట్ ప్రవేశ పెట్టేముందు ఆహారభద్రతకు వెన్నుముక రైతులే, వాళ్లకు ఆదాయ భద్రత కల్పిస్తాం, రైతుల ఆదాయాన్ని 2022 నాటికి రెట్టింపు చేయాలన్నది మా లక్ష్యం, 35,984 కోట్లు కేటాయిస్తున్నాం, ఉత్పాదకత పెంచడానికి నీటిపారుదల చాలా ముఖ్యం. 28.5 లక్షల హెక్టార్లకు అదనంగా నీటిపారుదల కల్పిస్తాం, వచ్చే ఏడాది దీనికి 17వేల కోట్లు కేటాయిస్తాం. ప్రత్యేకంగా నాబార్డులో రూ.20 వేల కోట్లతో నీటిపారుదల కోసం ఓ నిధి ఏర్పాటుచేస్తాం. గ్రామీణ ఉపాధి హామీలో భాగంగా 5 లక్షల ఫామ్ పాండ్స్ ఏర్పాటు చేయిస్తాం. సాయిల్ హెల్త్ అండ్ ఫెర్టిలిటీ కోసం రూ.368 కోట్లు కేటాయిస్తున్నాం. అంటూ ఆయన ప్రసంగం సాగింది. రైతు రుణాల మీద వడ్డీ చెల్లింపు కోసం రూ.15వేల కోట్లు కేటాయిస్తున్నాం. గ్రామీణ రహదారుల కోసం రూ. 19వేల కోట్లు కేటాయిస్తున్నాం. రాష్ట్రాల వాటాతో కలిపి రూ. 27 వేల కోట్లు అవుతుంది. ఆన్‌లైన్ ప్రొక్యూర్‌మెంట్ సిస్టమ్‌ను త్వరలోనే కల్పిస్తాం. పశుగణాభివృద్ధి కోసం 4 కొత్త ప్రాజెక్టులు అమలుచేస్తాం.అని అరుణ్ జైట్లీ తెలిపారు.

అరుణ్ జైట్లీ సోమవారం లోక్ సభలో కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టారు. అంతకు ముందు కేంద్ర మంత్రివర్గం లాంఛనప్రాయంగా బడ్జెట్ కు ఆమోదం తెలిపింది. ఇక 2016-17 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆయన ప్రవేశపెట్టిన బడ్జెట్ లోని ముఖ్యాంశాలు ఇవీ.. ఒక్కో రంగానికీ ఎంతెంత ఎందుకు కేటాయించామొ వివరిస్తూ అరుణ్ జైట్లీ ప్రవేశ పెట్టిన 2016-17 ఆర్థిక సంవత్సర బడ్జెట్ లోని ముఖ్యమైన అంశాలివే…

  • 2015లో అత్యధికంగా మోటారు వాహనాల ఉత్పత్తి
  • గ్రామీణాభివృద్ధికి 87,765 కోట్లు కేటాయింపు
  • లక్ష కుటుంబాలకు ఆరోగ్య బీమా పథకం
  • ఇప్పటివరకు 5542 గ్రామాలకు విద్యుత్ సదుపాయం
  • డిజిటల్ అక్షరాస్యత కోసం రెండు కార్యక్రమాలు
  • సాగునీటి రంగానికి రూ.20వేల కోట్లు
  • రహదారుల పథకానికి రూ.19వేల కోట్లు
  • వ్యవసాయానికి రూ.35, 984 కోట్లు
  • గ్రామీణ ప్రాంతాలు, మౌలిక సదుపాయాలపై ప్రత్యేక శ్రద్ధ
  • 2020 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు లక్ష్యం
  • 2015లో అత్యధికంగా మోటారు వాహనాల ఉత్పత్తి
  • హైవేల కోసం రూ.55వేల కోట్లు
  • గ్రామీణాభివృద్ధికి పెద్ద పీట
  • పశు సంపదకు రూ.850 కోట్లు
  • 18542 గ్రామాలకు ఇప్పటికీ విద్యుత్ సరఫరా లేదు
  • స్వచ్ఛభారత్ మిషన్‌కు 9వేల కోట్లు
  • సాగునీటి ప్రాజెక్టులకు రూ.86,500 కోట్లు
  • వ్యవసాయ రుణాలకు రూ.9లక్షల కోట్లు
  • రుణాల మాఫీకి రూ.15వేల కోట్లు
  • ఆథార్ కార్డు కింద అందరికీ పథకాలు
(Visited 449 times, 1 visits today)