Home / Latest Alajadi / అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన బడ్జెట్ లోని ముఖ్యాంశాలు..!

అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన బడ్జెట్ లోని ముఖ్యాంశాలు..!

Author:

కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఈరోజు పార్లమెంట్ లో బడ్జెట్ ని ప్రవేశపెట్టారు, నోట్ల రద్దు పరిణామం తరువాత వస్తున్న బడ్జెట్ కావడంతో అన్ని రంగాల వారు ఆశతో బడ్జెట్ కోసం ఎదురుచూస్తున్నారు, ముఖ్యంగా వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసేలా బడ్జెట్ ఉంటుందనే ప్రచారం ఉండటంతో రైతులు మోడీ బడ్జెట్ పై చాలా ఆశలే పెట్టుకున్నారు, లోక్ సభలో అరుణ్ జైట్లీ ప్రవేశ పెట్టిన బడ్జెట్ లోని ముఖ్యాంశాలు మీకోసం..

Main-Points-of-Budget

  • 3 లక్షల లోపు ఆదాయం ఉన్నవారికి ట్యాక్స్ మినహాయింపు.
  • 3-5 లక్షల వరకు ఆదాయం కల వారికి 5% ఇన్ కం ట్యాక్స్.
  • రైతులకి 10 లక్షల కోట్ల రుణాలు అందేలా చర్యలు, వారి ఆదాయాన్ని వచ్చే ఐదేళ్లలో రెట్టింపు చేసేలా నిర్ణయం.
  • ప్రకృతి వైపరీత్యాల నుంచి బయటపడేందుకు పంటల బీమా యోజన కింద మరో 40 శాతం కవరేజ్ పెంపు. సాగునీటి సౌకర్యం కోసం రూ. 40 వేల కోట్లతో కార్పస్ ఫండ్
  • వ్యవసాయ – గ్రామీణ అభివృద్ధికి ౧.87 లక్షల కోట్లు కేటాయింపు, ఉపాధి హామీ పథకానికి 48 వేల కోట్లు కేటాయింపు.
  • 2019 వరకు పేదలకి కోటి గృహాలని నిర్మించేలా కేటాయింపు.
  • 4000 వేల కోట్లతో యువత కోసం స్కిల్ డెవలప్ మెంట్ ఫండ్.
  • 100 ఇండియా ఇంటర్నేషనల్ స్కిల్ సెంటర్స్ ఏర్పాటు.
  • రైల్వేల కోసం 1.31 లక్షల కోట్లు కేటాయింపు.
  • 2000 రైల్వే స్టేషన్ లలో సోలార్ పవర్ ఏర్పాటు.
  • కార్పస్ ఫండ్ కింద రైల్వే లో భద్రత కోసం లక్ష కోట్లు కేటాయింపు.
  • మహిళ & శిశు అభివృద్ధి కోసం ౧.84 లక్షల కోట్లు కేటాయింపు.
  • బ్యాంకుల వ్యవస్థని పటిష్టం చేసేలా చర్యలు.
  • త్వరలో ఆధార్ అనుసంధానిత చెల్లింపుల వ్యవస్థ.
  • ఎలక్ర్టానిక్ ఉత్పాదక కేంద్రాల కోసం రూ. 1.26 లక్షల కోట్ల పెట్టుబడులు.

రాష్ర్టాలకు కేంద్రపాలిత ప్రాంతాలకు రూ. 4.11 లక్షల కోట్లు, రక్షణ రంగానికి రూ. 2 లక్షల 74 వేల కోట్లు, శాస్ర్త సాంకేతిక రంగానికి రూ. 34435 కోట్లు
మొత్తం బడ్జెట్ రూ. 21.47 లక్షల కోట్లు.

(Visited 1,450 times, 1 visits today)