Home / Inspiring Stories / ఐరన్ మ్యాన్ సూట్ ని 50,000 వేలకే తయారు చేసిన ఇంజనీర్ విధ్యార్ది.

ఐరన్ మ్యాన్ సూట్ ని 50,000 వేలకే తయారు చేసిన ఇంజనీర్ విధ్యార్ది.

Author:

ఏదైనా సాధించాలి అనుకుంటే దానిపైన మనకు ఇష్టం తో పాటు కచ్చితంగా సాధిస్తా నమ్మకం ఉండాలి. అప్పుడే అద్భుతాలను సాధిస్తారు అనడంలో సందేహం లేదు.  . మనకు ఇష్టమైన ఒక వస్తువుని తెర పైనో లేక టీవిలో చూసి దానిని తయారు చేయాలనుకోవడం చాలా కష్టం ఎందుకంటే అది సినిమా, అక్కడా చూపించేదంతా అబద్దం. మరి ఆ అబద్దాన్ని నిజం చేసి చూపించాడు కేరళకు చెందిన యువ ఇంజనీర్ విమల్ గోవింద్ మణికందన్.
మరి ఇంతకు ఏమి సాధించాడో ఒక్క సారి చూద్దాం….
విమల్ కి సూపర్ హీరోస్ అంటే చాలా ఇష్టం ఎందుకంటే తను ఎక్కువగా హాలీవుడ్ సినిమాలు చూస్తుంటాడు. అలా చూస్తున్నప్పుడు ఐరన్ మ్యాన్ సినిమా చూశాడు. అలా చుసిన విమల్ కి అందులో ఐరన్ మ్యాన్ కు ఉండే ఐరన్ సూట్ తనకీ బాగా నచ్చింది దానితో ఎలాగైనా దానిని తయారు చేయాలనుకున్నాడు.  అనుకున్నదే ఆలస్యం పని మొదలు పెట్టాడు. కొద్దీ రోజులోనే దానిని తయారు చేశాడు. ఇప్పుడు ఐరన్ మ్యాన్ సూట్ విమలక్ సొంతం… అంటే దానిని సి చూపించాడు.
విమల్ ఐరన్ మ్యాన్ సూట్ మామూలుది కాదు పూర్తగా ఫంక్షనల్, అలాగే చాలా బరువు ఉంటుంది. దీని బరువు దాదాపు 100 కేజీలు ఉంటుంది.  ఈ సూట్ 150 కేజీల బరువును ఎత్తగలదు. దీనికి కారణం బ్యాటరీ- శక్తితో పీడన వాయు నడిచే గడులు ఉండటమే దీనికి  కారణం. కానీ ఇది మాత్రం ఎగురలేదు అదొక్కటే లోటు.

విమల్ ఇది ఒక ఆకారానికి వచ్చిన తరవాత తాను సూపర్ హీరో కావాలని అనుకోలేదు దానికి కారణం  విమల్ ని అడిగితే ఇలా సమాధానం ఇచ్చాడు…. ఈ రానున్న రోజులలో ఇలాంటి వాటిని ఎక్కువగా డిఫెన్స్ లో లేదా పరిశ్రమలలో ఎక్కువగా బరువులు ఎత్తడానికి ఉపయోగించటానికి వాడనున్నారు అని తెలియజేశాడు.
విమల్ కి ఎక్కువగా ప్రేరణ ఇచ్చిన హాలీవుడ్ సినిమాలు అవెంజర్ సినిమాలు. 2015 లో వీరి స్నేహితులు అందరూ కలసి దీని మొక్క నమూనాని తయారు చేశారు కానీ అది చాలా పెద్దది కానీ చాలా పవర్ ఫుల్ . ఇప్పుడు ఈ స్నేహితులంతా కలసి ఐరన్ మ్యాన్ సూట్ పైనే ఇక బెటర్ మెంట్ కోసం ప్రయోగాలు చేస్తున్నారు.

(Visited 129 times, 1 visits today)