Home / Entertainment / కాలేయ సంబంధిత వ్యాధితో నటుడు కళాభవన్ మణి కన్నుమూత.

కాలేయ సంబంధిత వ్యాధితో నటుడు కళాభవన్ మణి కన్నుమూత.

Author:

Kalabhavan-Mani

మలయాళ నటుడు కళాభవన్ మణి (44) కన్నుమూశారు. ఊపిరితిత్తులు, కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన.. కోచిలోని అమృత ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి 7.15 గంటలకు తుదిశ్వాస విడిచారు. కళాభవన్ మృతిపై దక్షిణా ది చిత్ర పరిశ్రమ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మణి1971 జనవరి 1న జన్మించారు. ఆయనకు భార్య, కూతురు ఉన్నారు. రిక్షా డ్రైవర్‌గా పనిచేస్తూనే.. కేరళలో గొప్ప కళాకారులను అందించిన కళాభవన్‌లో మిమిక్రీ ఆర్టిస్టుగా కెరీర్‌ను ప్రారంభించారు. ఆ తర్వాత ఆ కళాభవన్ పేరునే ఇంటిపేరుగా చేసుకున్నారు. హాస్య నటుడిగా అక్షరం సినిమాతో మలయాళ సినీరంగానికి పరిచయమైన మణి.. వాసంతియుం లక్ష్మీయం పిన్నె న్యానమ్ చిత్రంలో అంధ వీధి గాయకుడిగా అద్భుతమైన ప్రతిభను కనబరిచారు. ఆ చిత్రంలో ఆయన నటనకు జాతీయస్థాయిలో ప్రత్యేక ప్రశంస అవార్డుతో పాటు, పలు అవార్డులను అందుకున్నారు. శనివారం నాడు తీవ్ర అస్వస్థతకు గురికావడంతో కొచ్చిలోని అమ్రిత ఆసుపత్రిలో ఆయన కుటుంబ సభ్యులు చేర్చారు. అత్యవసర చికిత్సకై ఐసీయూలో వైద్యులు చికిత్స చేశారు. అయితే 7:15 గంటలకు ఆయన మృతి చెందినట్లు కుటుంబీకులు చెప్పారు. “పరిస్థితి విషమంగా ఉండటంతో ఐసీయూలో ఉంచాం. ఆదివారం రాత్రి 7.15గంటల ప్రాంతంలో తుది శ్వాస విడిచారు’ అని వైద్యులు తెలిపారు.

200పైగా చిత్రాల్లో మణి నటించారు. మిమిక్రీ ఆర్టిస్టుగా ఆయన కెరీర్ ప్రారంభించారు. ఆ తర్వాత విలన్ పాత్రలో అభిమానులను మెప్పించారు. మళయాళ సినిమాల్లోనే కాకుండా పలు తెలుగు సినిమాల్లో కూడా ఆయన నటించారు. తెలుగులో కళాభవన్‌కు ‘జెమిని’తో మంచి పేరు వచ్చింది. అర్జున్, నరసింహుడు, ఎవడైతే నాకేంటి? చిత్రాల్లో మణి నటించారు.

కళాభవన్ మణి తొలుత ఆటోడ్రైవర్‌గా జీవితం నెట్టుకొచ్చారు. ఐతే ఆయనకు నాటకాలు అంటే మక్కువ. దీనితో స్థానిక స్టేజ్ షోలలో పాల్గొనేవారు. ఆయన నటనకు ప్రేక్షకులు నీరాజనాలు పట్టడంతో స్టేజి షోల నుంచి సినీరంగ ప్రవేశం చేశారు. జెమినీ చిత్రంలో పలు జంతువులు మాదిరిగా ఆయన మాట్లాడే విధానం, నటించిన తీరుకు మంచి గుర్తింపు వచ్చింది.

(Visited 371 times, 1 visits today)