Home / Inspiring Stories / మందు తాగితే కళ్ళు పోయాయి.

మందు తాగితే కళ్ళు పోయాయి.

Author:
liquor-dealers

Representative Image

బీహార్ రాష్ట్రంలో మద్యం నిషేదించిన విషయం మనందరికీ తెలిసిందే ,ఎంత నిషేదిస్తే మాత్రం అలవాటుపడ్డ మద్యం ప్రియులు ఊరుకుంటారా చెప్పండి ? అసలే వేసవి కావటంతో పాపం మద్యం ప్రియులు, బీరు రాయుళ్ళు తెగ ఇబ్బంది పడిపోతున్నారు .ఎక్కడన్నా కాసిని మందు చుక్కలు దొరుకుతాయా ఏదో ఈ వేసవి తాపానికి కాస్త గొంతు తడి చేసుకుందామని లేనిపోని ఆశకి పోయి అక్రమంగా కాచిన సారా , చాటుగా ట్రాన్స్పోర్ట్ చేసుకుని అమ్ముతున్న చీప్ లిక్కర్ ,కల్తీ మద్యం బారినపడి ఎక్కడలేని కష్టాలను ఏరి కోరి వెతుక్కుని మరీ కొనితెచ్చుకుంటున్నారు.

కాగా ఇటీవల బీహార్లోని గయలో ఓ బాధాకరమైన విషయం వెలుగులోకి వచ్చింది.ఇక్కడ గయలోని ఓ ప్ర్రాంతం వద్ద ఒక వ్యక్తి కల్తీ మద్యం తాగి ఏకంగా తన కంటిచూపును కోల్పోయాడు. ఆరా తీయగా ఇదంతా ఓ ర్యాలీ సందర్భంగా జరిగినట్టు ఇంకా ఈ భాదితుడుతో పాటుగా మరికొందరికి ఒక శీతల పానీయంలో ఈ కల్తీ మద్యాన్ని కలిపి ఇచ్చినట్టు తెలిసింది . అది తాగిన వెంటనే స్పృహకోల్పోయి అక్కడిక్కడే కుప్పకూలిపోయారట .

వారిలో కొందరిని ఆసుపత్రికి తరలించి ప్రస్తుతం చికిత్స చేస్తున్నారు.కాగా ఆ ఆసుపత్రికి తరలించిన వారిలో రాజ్ కుమార్ గుప్తా అనే ఆ కల్తీ మద్యం ఎక్కువ మోతాదులో తీసుకోవటం వల్ల అతను కంటి చూపు కోల్పోయాడు.ఇలా ఉండగా,మరో పక్క ఈ కల్తీ మద్యం తాగి ఇద్దరు వ్యక్తులు చనిపోయారని ప్రచారం జరుగుతోంది, కానీ దీన్ని ఇంకా పోలీసులు ధ్రువీకరించలేదు.

కానీ చూపు కోల్పోయిన ఆ కుటుంబానికి అతడే పెద్దదిక్కు ,సంపాదనా పరుడు అవ్వడంతో ఆ ఇల్లు కష్టాల్లో పడింది ,ఎలాగో మద్యాన్ని నిషేదించిన వారు రూల్స్ ని కఠినంగా చేసి కల్తీ మద్యాన్ని కూడా పూర్తి స్థాయిలో తుడిచిపెడితే ఎన్నో కుటుంబాలు బాగుపడతాయి కదూ.

(Visited 513 times, 1 visits today)