Home / Inspiring Stories / ఒక వ్యక్తి ఎంతో మంది పేద విద్యార్థుల జీవితాలలో వెలుగు ఇస్తున్నాడు.

ఒక వ్యక్తి ఎంతో మంది పేద విద్యార్థుల జీవితాలలో వెలుగు ఇస్తున్నాడు.

Author:

man for poor children education

మన భారతదేశంలో ఎంతో మంది పేద విద్యార్థులకు సరస్వతి కటాక్షం ఉన్న లక్ష్మి కటాక్షం ఉండదు. ఒక వ్యక్తి మాత్రం అలాంటి వారికి అండగా ఉంటూ వారి భవిష్యత్తుకి బంగారు బాటలు వేస్తున్నాడు. ఇప్పటి వరకు 200 విద్యార్థులకు పైగా చదివించిన మహానుబావుడు అతను.
తన గురించి తన మాటల్లోనే, 15సంవత్సరాల క్రితం స్కూల్ నుండి ఫీజ్ కట్టలేక గెంటివేయబడిన ఒక పేద విధ్యార్థితో మా ఆవిడ ఇంటికి వచ్చింది. నేను అప్పుడే నిర్ణయించుకున్నాను తనకు నేరుగా సాహాయం చేయాలని. ఎందుకంటే, చదువు మాత్రమే తన జీవితంలో వెలుగును ఇవ్వగలదు అని. అప్పటి నుండి ఈ రోజు వరకు డబ్బులు లేని వారికి ఎందరికో చదువు చెప్పియడం జరుగుతుంది.
విద్యార్థులకు ఎప్పుడైతే మేము సేవ చేయడం మొదలు పెట్టినప్పుడు(2001లో) నాకు మంచి జీతం అలాగే మంచి జీవితం ఉండేది. కానీ నాకు ఎప్పుడైతే యాక్సిడెంట్ అయ్యిందో అప్పుడు నా కుడి కాలుకు రంద్రం, ఎడమ కంటి చూపు పూర్తిగా కొల్పోయి నాలుగుసంవత్సరాలు పూర్తిగా మంచంపై నుండి లేవలేదు, ఆ సమయంలో పరిస్థితులు చాలా చాలా దారుణంగా ఉన్న ముందు విధ్యార్థుల ఫీజులు, తర్వాతే మా ఖర్చులు అనుకున్నాం. నేను పూర్తిగా కోలుకున్న తర్వాత ఇంకో 40 మంది విద్యార్థుల కోసం చూశాను. ఎందుకంటే ఒక విధ్యార్థి చదువు అయిపోగానే కొత్త ఉత్సాహం వచ్చి ఇంకో నలుగురు విద్యార్థులకు అయిన ఉపయోగపడాలి అని అనిపించేది. జీవితంలో టైం అనేది విధ్యార్థి జీవితంలో చాలా ముఖ్యమైననది. ఈ సమయం పోతే మళ్ళీ తిరిగిరాదు అందుకనే నాకు బిరియాని తినాలి అనిపించిన ఒకటికి నాలుగు సార్లు అలోచించేవాడిని ఎందుకంటే, డబ్బులకు ఇబ్బంది ఉంటుంది కాబట్టి కానీ, ఎన్ని ఇబ్బందులు ఉన్న విధ్యార్థుల పెదవులపై చిరునవ్వు చూస్తే ఆ కష్టమంత ఒక్క క్షణంలో వెల్లిపోతుంది. ఇప్పుడు మా విధ్యార్థులు పెద్ద పెద్ద మల్టినేషనల్ కంపీనిలలో చాలా పెద్ద పెద్ద పోజిషన్లలో ఉన్నారు. వారు మాపై ప్రేమతో మీరు ఇంకా కష్టపడకండి మీరు విశ్రాంతి తీసుకొండి మేము మీకు డబ్బులు పంపిస్తాం అంటుంటారు. కానీ నేను మాత్రం ఎవరైతే పేద విద్యార్థులు డబ్బులు లేక ఇబ్బంది పడుతారో వారికి సహాయం చేయండి, మీరు అలా చేస్తే నాకూ వంద జన్మలకు సరిపడ జీవితాన్ని ఇచ్చినట్టే అని చెపుతాను. ఇదే మా దంపతుల జీవితంలో 15సంవత్సరాల క్రితం మొదలు పెట్టిన యాత్ర. ఇప్పటికి ఎవరైతే చదువుకు ఇబ్బంది పడుతున్నారో మా దగ్గరికి రావోచ్చు.

(Visited 428 times, 1 visits today)