Home / Videos / ఉలిక్కి పడ్డ పూణే…!?

ఉలిక్కి పడ్డ పూణే…!?

 

వయసు పెరిగినా బుద్ది పెరగ లేదు..అరవయ్యేళ్ళ వయసుకు 45 ఏళ్ళ భార్య. తనేం చేయలేక ఆమె పై అనుమానం. ఫలితం భార్యని చంపటం మాత్రమే కాదు. ఆమె తలని నరికి పోలీస్ స్టేషన్ వరకూ అలా రోడ్డు మీద నడిచుకుంటూ పోయాడు. తాము చూసే దృశ్యం నిజమేనా అని జనమంతా దిగ్భ్రాంతి గా అలా చూస్తూ ఉండిపోయారు…

వివరాల్లోకి వెళితే పూణే లోని కాట్రాజ్ ఏరియా లో ఒక హౌసింగ్ సొసై టీ లో వాచ్ మెన్ గా పని చేస్తున్న 60 ఏళ్ళ రాము చౌహాన్. తన భార్య మరొక బందువుల అబ్బాయితో అక్రమ సంబందం పెట్టుకుందనే అనుమానం తో చంపేసాడు. తరువాత ఆమె తలని మొండేం నుంచి వేరు చేసి స్టేషన్ వరకూ నడుచుకుంటూ వెళ్ళాడు. అతని చేతిలో ఉన్న తలని చూసి పోలీసులే షాక్ తిన్నారు. ప్రస్తుతానికి రాము చౌహాన్ స్టేషన్ లోనే ఉన్నాడు IPC-302 సెక్షన్ కింద బుక్ చేసిన పోలీసులు దర్యాపు చేస్తున్నారు…

 

(Visited 75 times, 1 visits today)
[fbcomments url="http://peadig.com/wordpress-plugins/facebook-comments/" width="100%" count="off" num="3" countmsg="wonderful comments!"]