Home / General / తాగిన మత్తులో ఊరుకాదు ఏకంగా మూడు రాష్ట్రాలను దాటిన ఊబర్ ప్రయాణీకుడు

తాగిన మత్తులో ఊరుకాదు ఏకంగా మూడు రాష్ట్రాలను దాటిన ఊబర్ ప్రయాణీకుడు

Author:

బస్సులో నిద్ర పోయి దిగాల్సిన ఊరు దాటాక మేల్కొని నాలిక కరచు కొనే వారు, నిద్రలో ఉండిపోయి ఆనక దిగాల్సిన స్టేషన్ దాటిందని లబో దిబోమనే ప్రయాణీకులూ మామూలే! అయితే సొంతంగా బుక్ చేసుకొన్న క్యాబ్ ఊరే కాదు ఏకంగా మూడు రాష్ట్రాలే దాటి పోయాక తీరిగ్గా మేల్కొన్న ప్రయాణీకుడి సంఘటన అమెరికాలో జరిగింది.

ఏం జరిగింది?

అమెరికా లోని వెస్ట్ వర్జీనియా రాష్ట్రానికి చెందిన కెన్నీ బాచ్ మన్ అనే వ్యక్తి ఒక వారాంతపు పార్టీలో పూటుగా మద్యం సేవించాడు. ఆ తర్వాత అదే ఊళ్ళో ఉన్న యూనివర్శిటీ క్యాంపస్ లోని తన స్నేహితుడి ఇంటికి వెళ్ళడానికి ఊబర్ క్యాబ్ బుక్ చేసుకొన్నాడు. అయితే అతను మేల్కొనే సరికి అతను న్యూ జెర్శీ లో ఉన్నాడు.

uber

ఎందుకంటే మత్తులో కదల్లేని అతని చిరునామా న్యూజెర్శీ లోని గ్లౌసెస్టర్ గా నమోదై ఉండడంతో డ్రైవర్ కాస్తా 300 మైళ్ళు ప్రయాణించి మూడు రాష్ట్రాలు దాటి కెన్నీ ఇంటి ముందు నిలిపాడు. అయితే మత్తు దిగిన తర్వాత మేల్కొన్న కెన్నీ కి తాను స్వ స్ధలంలో ఉన్న సంగతి కంటే తాను ప్రయాణించిన కారు బిల్లే షాక్ ఇచ్చింది.

కారణం..

కార్ కు అతను చెల్లించాల్సిన మొత్తం అక్షరాలా 1635.95డాలర్లు కావడమే. ఎన్ జే. కామ్ కి అతను ఇచ్చిన ముఖాముఖి లో కెన్నీ మాట్లాడుతూ రెండు గంటల తర్వాత కొద్దిగా సృహ వచ్చాక తన స్నేహితుని ఇల్లు ఇంకా రాలేదేమిటా అనుకొన్నానని ఒకవేళ డ్రైవర్ తనను రోడ్డు పక్కన వదిలి వెళ్తాడేమో అని భావించాననీ కాని అలా జరగలేదని సంతోషంగా ఉందని అన్నాడు.

kenny

తాగిన మైకంలో కెన్నీ x కారు కు బదులు xl కారు ఎంచుకోవడంతో అతనికి రెండింతల ఛార్జీ పడింది. అంతా ఐపోయాక తాను ఆ మొత్తం చెల్లించనని మొండికేసిన కెన్నీ కి కోర్టు మొటిక్కాయలు వేసింది. మొత్తం కారు బాడుగతో పాటు ఆయా రాష్ట్రాల టోల్ గేట్లలో డ్రైవర్ సొంతంగా చెల్లించిన టోల్ ఛార్జీలు కూడా చెల్లించాల్సిందిగా ఆదేశించింది.

తెలుగు డాట్ అలజడి డాట్ కామ్ ను ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌,ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.

(Visited 1 times, 1 visits today)