Home / Inspiring Stories / మన అమరావతి..మన రాజధాని….మన కొత్త రాష్ట్రం….తారలు కదిలి రావలసిన వేళ !

మన అమరావతి..మన రాజధాని….మన కొత్త రాష్ట్రం….తారలు కదిలి రావలసిన వేళ !


నిజమే మరి..కొత్త రాష్ట్రం..కొత్త రాజధాని…అందులోనా అమరేంద్రుడు ఏలే స్వర్గానికి రాజధాని అయిన అమరావతి పేరు..ఇంకో వారం…పది రోజుల్లో సాక్షాత్తూ దేశ ప్రధాని ముహూర్తం షాట్ కి రాబోతున్న తరుణంలో…అమరావతి మీద మమకారం ఉన్న వారందరూ..ఇలా యధాశక్తి సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో తమ శుభాకాంక్షలు,సందేశాలు, వీడియో లో పోస్ట్ చేస్తున్నారు..ఆ కోవలోనే…..నటి, గాయని స్మిత కూడా తన బుల్లి ఆకాంక్షను ఈ రకంగా వ్యక్తం చేశారు..చాలా మంది తెలుగు తారలు,దర్శక నిర్మాతలు, హీరోలు, హీరోయిన్ల కన్నా ముందుగా ఆమె వెల్లడి చేసిన ఈ ఆకాంక్ష మిగిలిన తారాలకు స్పూర్తి నిస్తుందో లేదో..వేచి చూడాలి మరి…

ఇదిలా ఉండగా, ఏపీ రాజధానిగా అమరావతి నగర నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిపించేందుకు ఏపీ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. విజయదశమి రోజున ఘనంగా శంకుస్థాపన వేడుకను నిర్వహించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుముహూర్తాన్ని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి విజ్ఞప్తి మేరకు నూతన నగర నిర్మాణానికి పునాదిరాయి వెయ్యడానికి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమ్మతి తెలియజేశారు కూడా. అక్టోబర్ 22 వతేదీ మధ్యాహ్నం 12.45 గంటలకు శంకుస్థాపన ముహూర్తమని తెలియజేస్తూ తయారైన ఆహ్వాన పత్రిక ఆకట్టుకునేలా ఉంది. ఒకవైపు సుముహూర్త వివరాలు,మరోవైపు అమరావతి స్తూపంపై ఉన్న బహుపత్ర తామర పుష్ప ముద్ర,  ఇంకో వైపు నగర ప్రణాళిక ఉన్నాయి.ఇక ఈ కార్యక్రమానికి భారీ భధ్రత ఏర్పాటుచేయనున్నారు.భద్రతా కారణాల నేపథ్యంలో అహ్వానితులంతా ఉదయం 10.30 గంటల కల్లా సభా ప్రాంగణానికి చేరుకోవాల్సి ఉంటుందని పోలీసులు చెబుతున్నారు. హ్యాండ్ బ్యాగ్స్, బ్రీఫ్ కేసులు, కెమెరాలు, మొబైల్ ఫోన్లు, సిగరెట్లు, అగ్గి పెట్టెలు, లైటర్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు, మంచినీటి సీసాలు, కార్ సెంట్రల్ లాకింగ్ డివైజెస్ వంటి వాటిని సభా ప్రాంగణంలోకి తీసుకురావద్దని ఆహ్వాన పత్రికలో సూచించారు.

(Visited 152 times, 1 visits today)
[fbcomments url="http://peadig.com/wordpress-plugins/facebook-comments/" width="100%" count="off" num="3" countmsg="wonderful comments!"]