Home / Inspiring Stories / ప్లాస్టిక్ రైస్ బిర్యానీ – ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ కా కహానీ..!

ప్లాస్టిక్ రైస్ బిర్యానీ – ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ కా కహానీ..!

Author:

Plastic rice in india

కల్తీ…మనిషి కి అవసరమైన ప్రతీ వస్తువునీ కల్తీ చేయటం మనకు కొత్తేం కాదు బియ్యం లో రాళ్ళూ, చక్కెరలో పట్టిక, మిరియాలలో బొప్పాయి గింజలూ, (చెప్తే డోక్కుంటారు గానీ) గరం మసాలాలో గుర్రపు లద్దెలనూ పొడి చేసి కలిపిన సంఘటనలను వింటూనే ఉన్నాం.. కానీ ఇప్పుడు కల్తీ ఇంకా పెరిగింది. ఇది వరకు కల్తీల వల్ల కొన్ని సార్లు ఆరోగ్యం పాడయ్యేది. కన్నీ పోనూ పోనూ కల్తీ భయంకరంగా ఎదుగుతోంది తన రూపాన్ని వికృతంగా మార్చుకుంటోంది. డబ్బు కోసం ఎంతటి రాక్షసత్వానికైనా దిగజారటానికి వెనుతీయటం లేదు ఈ కల్తీ రాయుళ్ళు.. కల్తీ చేయలేరు అనుకునే గుడ్లూ, పాలూ ఆఖరికి కూరగాయలు కూడా కృత్రిమంగా తయారు చేయబడుతున్నాయి. మనం తినే ఆహారమే మనల్ని తినేందుకు సిద్దమౌతోంది…. ఇప్పుడు భారతీయ మార్కెట్లోకి అడుగు పెట్టిన కల్తీ రైస్ ఇప్పుడు ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లలో మన ప్లేట్ లో సర్వ్ చేయబడుతోంది… బంగాళా దుంప, చిలకడ దుంపల పౌడర్ లో ప్లాస్టిక్ ని కలిపి అచ్చుల్లో పోసి ఈ ఫేక్ రైస్ ని మన మార్కెట్లో వదులుతున్నారు. చైనాలో ఈ రకం బియ్యం, ఫేక్ గుడ్లూ మరీ సీక్రేట్ గా ఏమీ తయారవటం లేదు పెద్ద ఎత్తున ఫ్యాక్టరీలని పెట్టి మరీ ఈ రైస్ ని తయారు చేస్తున్నారు…

Plastic rice in india from china

వీటిని తయారు చేయటానికి వాడే భయంకర రసాయనల వల్ల ఇప్పుడు ఆరోగ్యం దెబ్బతినటమే కాదు ముందు తరాల పైనా వీటి దుష్ప్రభావం ఉంటుందని అంటున్నారు డాక్టర్లు. ఈ రసాయనల ప్రభావం మెదడూ మరియూ నాడీ వ్యవస్తలని దెబ్బతీస్తోందట. కాబట్టి ఆహారం విషయంలో జాగ్రత్తగ ఉండాలనీ ఫాస్ట్ ఫుడ్ ల మీదా, నాసిరకం కూరగాయల మీదా ఆధారపడ వద్దని సలహా ఇస్తున్నారు.ఈ విష రసాయన బియ్యాన్ని భారత్ కి ఎగుమతి చేస్తున్నారు. ఈ విషయం కస్టమ్స్ అధికారులకు తెలిసినా ఎందుకు అనుమతిస్తున్నారో అర్థం కావటం లేదన్న విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి…

భారీ పరిశ్రమల స్థాయిలో నడుస్తున్న ఈ ఫేక్ రైస్ ఇండస్ట్రీ లో జరిగే తంతు ఏమిటో కింది వీడియో లో మీరే చూడండి.

మనం సేఫే ఇంకా హైదరాబద్ కి రాలేదు అనుకుంటున్నారా..!? మీరు ఎగ్ ఫ్రైడ్ రైస్ లో కాలేసినట్టే. ప్రధాన కూడళ్ళ లో ఉండే ఫాస్ట్ ఫుడ్ సెంటర్లన్నీ ఇదే ప్లాస్టిక్ రైస్ ని విచ్చలవిడిగా వాడేస్తున్నారు…

Must Read: 15 నిమిషాల్లో ఎలాంటి నొప్పినైనా తగ్గించే ఎఫెక్టివ్ చిట్కా.

(Visited 13,454 times, 1 visits today)