Home / Entertainment / “సాధ్యం” దర్శకుడు కార్తికేయతో మంచు లక్ష్మి కొత్త సినిమా ఈ నెల 20న ప్రారంభం

“సాధ్యం” దర్శకుడు కార్తికేయతో మంచు లక్ష్మి కొత్త సినిమా ఈ నెల 20న ప్రారంభం

Author:

 

మంచు లక్ష్మి ఈ పేరు వినగానే మనకు ఒక మంచి నిర్మాత, అలాగే మంచి యాంకర్. కానీ, వీటికంటే తనలో నటి మాత్రం మనల్ని అందరిని ఆశ్చర్యపరుస్తుంది. ఎందుకంటే లక్ష్మి ఎప్పటికప్పుడు తను ఎంచుకునే పాత్రలు చాలా కొత్తగా మరియు చాలా డిఫరెంటుగా ఉంటాయి. ఈ మధ్యలో సినిమాలకు కొద్దిగా గ్యాప్ తీసుకున్న మంచు ముత్యం ఇప్పుడు మరో సినిమాతో మన ముందుకు రాబోతుంది.

kaarthikeya to direct manchu lakshmi

ఈ సినిమాను కార్తికేయ గోపాలకృష్ణ దర్శకత్వం వహించనున్నాడు. అలాగే వేళ్ల మౌనిక చంద్రశేఖర్, ఉమ లక్ష్మి నరసింహ నిర్మాతలుగా ఈ చిత్రం తెరకెక్కిస్తున్నారు.

నిర్మాతలు మాట్లాడుతూ….

మేము మొదటి నుండి లక్ష్మి మంచు గారి ఒక సినిమా తీయాలని అనుకుంటున్న సమయంలో కార్తికేయ గారు మాకు ఒక మంచి కథ చెప్పారు, ఈ కథను లక్ష్మి గారికి చెప్పడంతో విన్న వెంటనే ఓకే చేశారు.
కార్తికేయ గారు ఇదివరకు జగపతిబాబు, ప్రియమణి జంటగా నటించిన సాధ్యం మరియు నవదీప్ తో వసుల్ రాజా లాంటి సినిమాలు తెలుగు ప్రేక్షకులకు అందించాడు. అలాంటి దర్శకుడితో మరియు లక్ష్మిగారి లాంటి నటితో మేము సినిమా మొదలు పెట్టడం చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమా   మే 20న లాంచనంగా పూజా కార్యక్రమాలను జరుపుకుంటుంది. ఈ సినిమాకు పని చేసే నటి, నటుల వివరాలు  లాంచింగ్ రోజు తెలియజేస్తాము అన్నారు.

దర్శకుడు కార్తికేయ మాట్లాడుతూ….
ఈ కథను లక్ష్మి గారు విన్న వెంటనే ఓకే చేశారు. ఈ కథ థ్రిల్లర్, కామిడితో పాటు మంచి మెసేజ్ ఉంటుంది. ఈ సినిమాలో లక్ష్మి గారు ఒక పవర్ పుల్ పాత్రలో నటిస్తుంది. తను ఇప్పటి వరకు పోషించని పాత్ర ఇది. కథ ముందే చెప్పొద్దు  కానీ కథలో దమ్ము ఉండటం వలన నేను కథ ముందే తెలియజేస్తున్నా..
ఈ సినిమాలో లక్ష్మిగారు న్యాయం కోసం పోరాడే పవర్ పుల్ జడ్జ్ పాత్రలో నటించనున్నారు. ఈ అవకాశం ఇచ్చిన నిర్మాతలకు చాలా థాంక్స్ అని అన్నారు.

(Visited 392 times, 1 visits today)