Home / Entertainment / వర్మ ‘ఎటాక్’ పాటల డేట్ ?

వర్మ ‘ఎటాక్’ పాటల డేట్ ?

Author:

Manchu-Manoj-RGV-Attack-Motion-Poster

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ‘కిల్లింగ్ వీరప్పన్’ తో వర్మ ఈజ్ బ్యాక్ అనే విధంగా సినిమా తన టేకింగ్ తో మల్లీ తను పాత వర్మ ని మనకు చూపించాడు. చాలా రోజుల తర్వాత వర్మ హిట్ ని ఆస్వాదిస్తున్నాడు. తజాగా తన దర్శకత్వంలో మనోజ్, జగపతి బాబు, ప్రకాష్ రాజ్ ప్రధాన పాత్రల్లో ఎటాక్ పేరుతో ఓ సినిమా రూపొందిన విషయం తెలిసిందే. క్రైమ్ జానర్లో పలు విజయవంతమైన సినిమాలను తీసిన వర్మ, మళ్ళీ అదే జానర్లో చేస్తోన్న ఈ సినిమాపై అంతటా మంచి అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే చాలాసార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా ఆడియో రిలీజ్‌పై కానీ, సినిమా రిలీజ్‌పై కానీ ఇప్పటికీ స్పష్టమైన క్లారిటీ రాలేదు.

ఇక కిల్లింగ్ వీరప్పన్ రిలీజ్ కూడా అయిపోవడంతో వర్మ మళ్ళీ ఎటాక్‌ను ప్రేక్షకుల ముందుకు తెచ్చే పనిలో పడ్డారు. ఫిబ్రవరి 5న ఎటాక్ ఆడియో ఆవిష్కరణ వేడుకను నిర్వహించనున్నారని తెలుస్తోంది. అదే నెలలో సినిమాను కూడా ప్రేక్షకుల ముందుకు తెచ్చే అవకాశం కనిపిస్తోంది.

(Visited 84 times, 1 visits today)