Home / Entertainment / గ్రాండ్ గా మంచు మనోజ్ ‘శౌర్య’ ఆడియో విడుదల.

గ్రాండ్ గా మంచు మనోజ్ ‘శౌర్య’ ఆడియో విడుదల.

Author:

మిస్టర్ పర్ఫెక్ట్, గ్రీకువీరుడు చిత్రాలతో క్లాస్ దర్శకుడిగా పేరొందిన దశరథ్ దర్శకత్వంలో మంచు మనోజ్,రెజినా జంటగా నటిస్తున్న చిత్రం ‘శౌర్య’. సురక్ష్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో మల్కాపురం శివకుమార్ ఈ చిత్రానికి నిర్మాత. . ఇటీవల విడుదలైన ‘శౌర్య’ టీజర్ కి ప్రేక్షకుల నుండి కూడా మంచి స్పందన లభించింది. ఆదివారం హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో ఆడియో విడుదల కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ ఆడియో వేడుక సందర్భంగా చిత్ర ట్రైలర్ ని కూడా విడుదల చేసారు.

ప్రతి సంఘటనకి మూడు యాంగిల్స్ ఉంటాయంటూ ట్రైలర్ ని మొదలుపెట్టి, ప్రేమ అనేది ఎవడికి వాడికి సపరేట్ క్వశ్చన్, మీ ఆన్సర్‌ నాకు పనికి రాదు.. నా ఆన్సర్ మీకు పనికి రాదంటు ముగుస్తుంది. కానీ ట్రైలర్ మాత్రం చాలా సూపర్ గా ఉంది. అలాగే ఇందులోని పాటలు కూడా చాలా బాగున్నాయి.

(Visited 110 times, 1 visits today)